రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"ఆపరేషన్ గంగా"లో భాగంగా ఉక్రెయిన్ నుండి ఢిల్లీకి చేరుకున్న 200 మంది భారతీయ విద్యార్థులు


తరలివచ్చిన వారిని స్వాగతించిన MOS (మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ & ఫెర్టిలైజర్స్) మంత్రి శ్రీ భగవంత్ ఖుబా

ఉక్రెయిన్ నుండి భారతీయులందరినీ స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ

Posted On: 03 MAR 2022 12:07PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ ఆపరేషన్ గంగాలో భాగంగా ఉక్రెయిన్ నుండి దాదాపు 200 మంది విద్యార్థులు మరియు భారతీయ పౌరులు ఉక్రెయిన్ నుండి భారతదేశానికి సురక్షితంగా తిరిగి తీసుకురాబడ్డారు.

 

రసాయన మరియు ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తరలి వచ్చిన వారిని ఆహ్వానించారు. అధిక శాతం విద్యార్థులు ఉన్న ఈ ఇండిగో విమానం ఈ రోజు ఉదయం ఢిల్లీలో దిగింది.
 


తిరిగి వచ్చిన వారందరినీ స్వాగతిస్తూ, ఉక్రెయిన్ నుండి భారతీయులందరినీ స్వదేశానికి రప్పించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. విద్యార్థులకు వారి స్నేహితులు, సహోద్యోగులను కూడా త్వరలో తరలిస్తామని ఆయన అన్నారు.



భారతదేశానికి తిరిగి వచ్చి కుటుంబాలతో సమావేశమైన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విమానంలో ఉన్న ఒక యువ విద్యార్థి సంతోషంతో కన్నీళ్లతో యుద్ధ కలహాల దేశం నుండి సురక్షితంగా ఖాళీ చేయించడం అంటే మాటలు కాదు.. కానీ ఆ అద్భుతాన్ని మన దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాధ్యం చేశారు అని వ్యాఖ్యానించాడు.
 
ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఇండిగో విమానం నేడు 10.35 గంటలకు బయలుదేరింది. (IST) బుధవారం ఉదయం 8.31 గంటలకు న్యూఢిల్లీకి చేరుకుంది.
 
ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో మరియు స్పైస్‌జెట్ కూడా ఉక్రెయిన్ పొరుగు దేశాల నుండి ఢిల్లీ మరియు ముంబైకి బహుళ విమానాలను నడుపుతున్న ఆపరేషన్ గంగా మిషన్‌లో చేరాయి.

 

****


(Release ID: 1802840) Visitor Counter : 193