హోం మంత్రిత్వ శాఖ
ఐదు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అదనంగా రూ. 1,682.11 కోట్ల కేంద్ర సహాయాన్ని ఆమోదించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి కమిటీ
2021లో ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు మరియు పుదుచ్చేరి సంభవించిన వరదలు / కొండచరియలు విరిగిపడటంతో జరిగిన నష్టానికి సహాయంగా నిధుల విడుదల
Posted On:
03 MAR 2022 10:43AM by PIB Hyderabad
వరదలు/కొండచరియలు విరిగిపడటంతో నష్టపోయిన ఐదు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) కింద అదనపు కేంద్ర సహాయాన్ని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ (హచ్ఎల్‌సి) ఆమోదించింది. 2021. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ఐదు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలితప్రాంత ప్రజలకు సహాయం చేయాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎన్‌డిఆర్‌ఎఫ్ నుంచి హచ్ఎల్‌సి ఐదు రాష్ట్రాలకు 1,664.25 కోట్ల రూపాయలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి 17.86 కోట్ల రూపాయలను అదనపు కేంద్ర సహాయంగా ఆమోదించింది.
అదనపు కేంద్ర సహాయంగా అందనున్న నిధుల వివరాలు :-
ఆంధ్రప్రదేశ్‌కు.351.43 కోట్ల రూపాయలు ;
హిమాచల్ ప్రదేశ్ కు 112.19 కోట్ల రూపాయలు;
కర్ణాటకకు 492.39 కోట్ల రూపాయలు
మహారాష్ట్రకు 355.39 కోట్ల రూపాయలు
తమిళనాడుకు 352.85 కోట్ల రూపాయలు; మరియు
కేంద్రపాలిత పుదుచ్చేరికి 17.86 కోట్ల రూపాయలు.
రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్) కింద ఇప్పటికే విడుదల చేసిన నిధులకు అదనంగా ఈ అదనపు కేంద్ర సహాయం అందుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వారి ఎస్‌డిఆర్‌ఎఫ్ నిధులుగా 28 రాష్ట్రాలకు 17,747.20 కోట్ల రూపాయలను మరియు ఎన్‌డిఆర్‌ఎఫ్ నిధులుగా 8 రాష్ట్రాలకు 4,645.92 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
విపత్తులు సంభవించిన వెంటనే నష్టాలను అంచనా వేసేందుకు ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నివేదికలు అందే వరకు వేచి ఉండకుండా వివిధ మంత్రిత్వశాఖలతో కూడిన ఇంటర్-మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్‌లను కేంద్ర ప్రభుత్వం పంపడం జరిగింది.
***
(Release ID: 1802600)
Visitor Counter : 193