హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"వలసదారులు మరియు స్వదేశానికి తిరిగి వచ్చిన వారికి సహకారం మరియు పునరావాసం” కల్పించేందుకు అమలు చేస్తున్న ఏడు రక్షణ ఉప పథకాలను 2021-22 నుంచి 2025-26 వరకు కొనసాగించేందుకు ఆమోదం తెలిపిన శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 1,452 కోట్ల రూపాయల వ్యయంతో అమలు కానున్న పథకాలు


కేంద్రం ఆమోదంతో శ్రీ అమిత్‌ షా నాయకత్వంలో పథకాల ఫలాలు లబ్ధిదారులకు చేరేలా చర్యలు అమలు చేయనున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

Posted On: 02 MAR 2022 3:01PM by PIB Hyderabad

"వలసదారులు మరియు స్వదేశానికి తిరిగి వచ్చిన వారికి  సహకారం  మరియు పునరావాసం” కల్పించేందుకు అమలు చేస్తున్న ఏడు రక్షణ ఉప పథకాలను 2021-22 నుంచి  2025-26  వరకు కొనసాగించేందుకు కేంద్రంలో శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 1,452 కోట్ల రూపాయల వ్యయంతో ప్రస్తుతం అమలు జరుగుతున్న పథకాలు కొనసాగుతాయి. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించడంతో పథకాల ప్రయోజనాలు  లబ్ధిదారులకు చేరేలా చూసేందుకు శ్రీ అమిత్ షా నాయకత్వంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుంది. 

పునరావాసం  కారణంగా నష్టపోయిన వలసదారులు మరియు స్వదేశానికి తిరిగి వచ్చిన వారికి ఈ పథకాల వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఈ పథకాలు సహేతుకమైన ఆదాయాన్ని ఆర్జించి ప్రధాన  ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు అయ్యేందుకు వలసదారులు మరియు స్వదేశానికి తిరిగి వచ్చిన వారికి అవకాశం కలిగిస్తాయి. 

కేంద్ర ప్రభుత్వం వివిధ సందర్భాలలో వివిధ పథకాలను ప్రారంభించి అమలు చేస్తున్నది. సహాయ సహకారం అందించేందుకు రూపొందించిన ఏడు పథకాల వివరాలు:

జమ్మూ మరియు కాశ్మీర్ మరియు ఛంబ్‌లోని పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాలకు చెందిన నిర్వాసిత కుటుంబాలకు సహకారం  మరియు పునరావాసం, శ్రీలంక తమిళ శరణార్థులకు సహాయ సహకారాలుత్రిపురలోని బ్రూస్‌ సహాయ శిబిరాల్లో ఉంటున్న వారికి సహాయ సహాయం, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు మెరుగైన సహకారం, తీవ్రవాదులతిరుగుబాటుమత/వామపక్ష తీవ్రవాద హింస మరియు సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పులు మరియు దేశంలో గని/ఐఈడీ పేలుళ్ల బాధితుల తో సహా తీవ్రవాద హింసలో నష్టపోయిన బాధిత ప్రజల కుటుంబాలకు ఆర్థిక సహాయం మరియు ఇతర సౌకర్యాలుసెంట్రల్ టిబెటన్ రిలీఫ్ కమిటీ (సిటిఆర్‌సి)కి గ్రాంట్-ఇన్-ఎయిడ్ అందించేందుకు ఈ పథకాలు అమలు జరుగుతున్నాయి. 

వీటితో పాటు గతంలో బంగ్లాదేశ్ కి చెంది ప్రస్తుతం కూచ్ బీహార్ జిల్లాలో ఉన్న 51 ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు, బంగ్లాదేశ్ నుంచి తితిలి వచ్చిన భారత శరణార్థులకు పునరావాసం కల్పించేందుకు  కేంద్ర ప్రభుత్వం   పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి గ్రాంట్-ఇన్- ఎయిడ్ అందిస్తోంది. 

***


(Release ID: 1802360) Visitor Counter : 249