ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాస్కో ‘ఉషు స్టార్స్‌ చాంపియన్‌ షిప్‌’లో స్వర్ణ పతక విజేత సాదియా తారిఖ్‌కు ప్రధానమంత్రి అభినందన

प्रविष्टि तिथि: 26 FEB 2022 9:02PM by PIB Hyderabad

   మాస్కోలో నిర్వహిస్తున్న ‘ఉషు స్టార్స్‌ చాంపియన్‌ షిప్‌’ పోటీల్లో భారత క్రీడాకారిణి సాదియా తారిఖ్‌ స్వర్ణ పతకం సాధించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెను అభినందించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో-

“మాస్కో ‘ఉషు స్టార్స్‌ చాంపియన్‌ షిప్’లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సాదియా తారిఖ్‌కు అభినందనలు. ఆమె సాధించిన ఈ విజయం వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆమెకు నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.

***

DS/SH


(रिलीज़ आईडी: 1801623) आगंतुक पटल : 189
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam