ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
రూ. 1,600 కోట్లతో ఐదేళ్ళకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలును ఆమోద ముద్రవేసిన కేబినెట్
ఎబిడిఎం టెలిమెడిసిన్ వంటి సాంకేతికతల వినియోగాన్ని ప్రోత్సహించి, ఆరోగ్య సేవల జాతీయ పోర్టబిలిటీని ప్రారంభించడం ద్వారా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణకు సమానమైన ప్రాప్యతను మెరుగుపరుస్తుంది
పౌరులు తమ ఎబిహెచ్ఎ (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) సంఖ్యను సృష్టించుకునే సదుపాయం, దానికి వారి డిజిటల్ ఆరోగ్య రికార్డుల అనుసంధానం
Posted On:
26 FEB 2022 1:55PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబిడిఎం)ను రూ. 1,600 కోట్ల రూపాయిల బడ్జెట్‌తో ఐదేళ్ళ పాటు దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబిడిఎం) అమలు ఏజెన్సీగా జాతీయ ఆరోగ్య అధికార సంస్థ (నేషనల్ హెల్త్ అథారిటీ-ఎన్‌హెచ్ఎ) వ్యవహరిస్తుంది.
ఎన్నో సంవత్సరాలుగా ఆరోగ్య సంరక్షణ అనుకూల వ్యవస్థల్లో డిజిటల్ ఆరోగ్య పరిష్కారాలు ఎంతో ప్రయోజనకరంగా ఉండటమే కాక ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తేవడంలో సాంకేతిక పాత్రను కోవిన్, ఆరోగ్య సేతు నిరూపించాయి, అయితే, సంరక్షణను కొనసాగించడానికి, వనరులను సమర్ధవంతంగా ఉపయోగించేందుకు ఇటువంటి పరిష్కారాలను ఏకీకృతం చేయవలసిన అవసరం ఉంది.
ప్రభుత్వం చేపట్టిన చొరవలైన జన్‌ధన్, ఆధార్ అండ్ మొబైల్ త్రయం (జెఎఎం) పునాదుల పై, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబిడిఎం) విస్త్రతమైన డాటా, సమాచారం, మౌలిక సదుపాయల సేవలు, ద్వారా నిరాటకంగా ఆరోగ్యానికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం భద్రత, గోప్యత, గుప్తతలను నిర్ధారిస్తూ, బహరింగ, పరస్పర చర్యలు చేపట్టగల, ప్రమాణాల ఆధారిత డిజిటల్ వ్యవస్థలను సరైన రీతిలో ప్రభావితం చేస్తోంది.
తమ ఆరోగ్య రికార్డులను అనుసంధానం చేసుకునేందుకుఎబిడిఎం కింద పౌరులు ఎబిహెచ్ఎ (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) సంఖ్యలను సృష్టించుకోవచ్చు. ఇది వివిధ ఆరోగ్య సంరక్షణను అందించేవారి నిమిత్తం వ్యక్తుల కోసం రేఖాంశ ఆరోగ్య రికార్డుల సృష్టిని అనుమతించడమే కాక చికిత్సా సంబంధ నిర్ణయాలను మెరుగుపరుస్తుంది.
ఎబిడిఎం పైలెట్ ప్రాజెక్టులను లడాఖ్, చండీగఢ్, దాద్రా& నగర్ హవేలీ, దామన్& దియ్యు, పుదుచ్చేరీ, అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్ తో ఆరు కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలలో పూర్తి అయింది. ఇక్కడ ఎన్‌హెచ్ఎ అభివృద్ధి చేసిన సాంకేతిక వేదిక విజయం నిరూపితమైంది. పైలట్ సందర్భంగా, డిజిటల్ శాండ్ బాక్స్‌ను సృష్టించారు. ఇందులో 774కు పైగా భాగస్వామ్య పరిష్కారాలు ఏకీకృతం అవుతున్నాయి. ఫిబ్రవరి 24, 2022 నాటికి 17,33, 69, 087 ఆయుష్మాన్ భారత్ అరోగ్య అకౌంట్లు సృష్టించబడ్డాయి, దాదాపు 10,114 మంది వైద్యులు, 17, 319 ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ఎబిడిఎం కింద నమోదు అయ్యాయి.
ఎబిడిఎం ప్రతిభావవంతమైన ప్రజారోగ్య చొరవల కోసం అంగీకార ఆధారిత నిర్ణయాలను తీసుకునే సౌకర్యాలను కల్పించడమే కాక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ వ్యాప్తంగా ఆవిష్కారాలను ప్రోత్సహించి, ఉపాధిని సృష్టిస్తుంది.
***
(Release ID: 1801465)
Visitor Counter : 302
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Malayalam