రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

యునైటెడ్ కింగ్డంలో కోబ్రా వారియ‌ర్ విన్యాసాల‌లో పాలుపంచుకోనున్న భార‌త వైమానిక ద‌ళం (ఐఎఎఫ్‌)

Posted On: 23 FEB 2022 2:17PM by PIB Hyderabad

 భార‌త వైమానిక ద‌ళం 06 నుంచి 27 మార్చి 2022 వ‌ర‌కు యుకెలోని వాడింగ్‌ట‌న్‌లో జ‌రుగ‌నున్న ఎక్స్ కోబ్రా వారియ‌ర్ 22 పేరుతో జ‌రుగ‌నున్న బ‌హుళ జాతీయ వైమానిక విన్యాసాల‌లో పాల్గొన‌నుంది. ఈ విన్యాసాల‌లో యుకెకు చెందిన యుద్ధ విమానాలు, ఇత‌ర అగ్ర వైమానిక ద‌ళాల‌తో పాటుగా భార‌త వైమానిక ద‌ళానికి చెందిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సిఎ) పాలుపంచుకోనుంది. 
ఈ విన్యాసాలు ఇందులో పాలుపంచుకుంటున్న వైమానిక ద‌ళాల కార్యాచ‌ర‌ణ‌, ప్ర‌ద‌ర్శ‌న ఉత్త‌మ అభ్యాసాల‌ను పంచుకోవ‌డం ద్వారా పోరాట సామ‌ర్ధ్యాన్ని మెరుగు ప‌ర‌చ‌డం, స్నేహ‌బంధాల‌ను ఏర్ప‌ర‌చుకోవాల‌న్న ల‌క్ష్యంతో జ‌రుగుతున్నాయి. త‌న ప్రావీణ్యాన్ని, కార్యాచ‌ర‌ణ సామ‌ర్ధ్యాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు ఎల్‌సిఎ తేజ‌స్‌కు ఇది ఒక వేదిక కానుంది. 
ఐదు తేజ‌స్ విమానాలు యునైటెడ్ కింగ్డంకు వెళ్ళ‌నున్నాయి. ఐఎఎఫ్ సి-17 విమానం వీటి కూర్పుకు, విడ‌దీయ‌డానికి (ఇండ‌క్ష‌న్ అండ్ డి-ఇండ‌క్ష‌న్‌) అవ‌స‌ర‌మైన ర‌వాణా స‌హాయాన్ని అందించ‌నుంది. 

 

***


(Release ID: 1800664) Visitor Counter : 231