రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా 16 నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించే 'విజ్ఞాన్ సర్వత్ర పూజ్యతే'లో డీఆర్‌డీవో పాల్గొంటుంది.

प्रविष्टि तिथि: 22 FEB 2022 3:58PM by PIB Hyderabad

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయిన 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న 'విజ్ఞాన సర్వత్ర పూజ్యతే'లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)  పాల్గొంటోంది. 'విజ్ఞాన్ సర్వత్ర పూజ్యతే అనేది ఫిబ్రవరి 22 నుండి 28, 2022 వరకూ దేశంలోని ప్రతి ప్రాంతం నుండి సైన్స్, టెక్నాలజీ & ఆవిష్కరణలను ప్రదర్శించడానికి చేపట్టిన దేశవ్యాప్త కార్యక్రమం.

దేశంలోని 16 నగరాల్లో 'అమృత్ మహోత్సవ్ సైన్స్ షోకేస్: రోడ్‌మ్యాప్ టు 2047' అనే అంశంపై ప్రదర్శనలను కూడా డీఆర్‌డీవో నిర్వహిస్తోంది. ఆగ్రా, అల్మోరా, బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, హైదరాబాద్, జోధ్‌పూర్, లేహ్, ముంబై, మైసూరు, పూణే, తేజ్‌పూర్, ఎర్నాకులం, విజయవాడ మరియు విశాఖపట్నం నగరాల్లో ఈ సైన్స్ & టెక్నాలజీ మెగా ఎక్స్‌పోజిషన్‌లను డీఆర్‌డీవో నిర్వహిస్తోంది.ఆర్&డీ సంస్థలు చేస్తున్న పనిని హైలైట్ చేయడానికి  'మహోత్సవ్'లో డీఆర్‌డీవో పాల్గొంటోంది. అలాగే 2047కి వెళ్లే మార్గంలో ఆలోచనలు మరియు సాంకేతిక ప్రయత్నాలను ప్రదర్శించడానికి ఇది ఒక అవకాశం.

పలు సాంకేతికతలకు సంబంధించిన వివిధ డీఆర్‌డీవో ఉత్పత్తులను ఇందులో ప్రదర్శించనున్నారు. ఇందులో నాగ్, మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ఎంపీఏటీజీఎం), ఆకాశ్, బ్రహ్మోస్, అస్త్రా, ప్రళయ్, మిషన్ శక్తి, ఆర్మర్డ్ ఇంజనీర్ రికనైసెన్స్ వెహికల్ (ఏఈఆర్‌వి), మారీచ్, 3డీ సెంట్రల్ అక్విజిషన్ రాడార్ (3డీ కార్), ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్ బ్రిడ్జ్ లేయర్ ట్యాంక్ (బిఎల్‌టి)  మొదలైన నమూనాలు వీటిలో ఉన్నాయి. అలాగే రెట్రోమోటర్, బూస్టర్ మోటార్, కాంపోజిట్ రాకెట్ మోటార్ కేసింగ్, డ్రాప్ ట్యాంక్, బ్రేక్ డిస్క్ మొదలైనవి  సాంకేతికతలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి.

దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో పలు శాస్త్ర సాంకేతిక అభివృద్ధిపై ప్రముఖ శాస్త్రవేత్తల ఉపన్యాసాలు కూడా ఈ వారం గుర్తించబడతాయి. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా 33 కేంద్రాలలో 11 విభిన్న భారతీయ భాషల్లో విభిన్న థీమ్‌లు మరియు అంశాలపై ఉపన్యాసాలు ఇస్తున్నారు.

స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించేందుకు మరియు 75వ స్వాతంత్ర్య సంవత్సరంలో దేశం సాధించిన వివిధ రంగాలలో సాధించిన విజయాలను ప్రదర్శించడానికి భారత ప్రభుత్వం (జీఓఐ) ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని ఏడాదిపాటు నిర్వహిస్తోంది. ప్రభుత్వంలోని వివిధ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు, రాష్ట్రాల స్థాయిలోని ఏజెన్సీలతో సన్నిహిత భాగస్వామ్యంతో ఎస్‌&టీ విజయాలను జరుపుకుంటున్నాయి.

రక్షణ, అంతరిక్షం, ఆరోగ్యం, వ్యవసాయం, ఖగోళ శాస్త్రం మరియు ఇతర రంగాలలోని సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో సహాయపడిన మన శాస్త్రీయ వారసత్వం మరియు సాంకేతిక నైపుణ్యాన్ని 'విజ్ఞాన సర్వత్ర పూజ్యతే' పేరుతో 'అమృత్ మహోత్సవ్ సైన్స్' ప్రదర్శిస్తుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మరియు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) జీఓఐ  మరియు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్‌కి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని డీఆర్‌డీవో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ (డీఎస్టీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డిబిటీ), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్‌ఐఆర్), మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (ఎంఓఈఎస్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.


 

****


(रिलीज़ आईडी: 1800402) आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Malayalam , English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Tamil