ప్రధాన మంత్రి కార్యాలయం

రాజస్థాన్ లోని కోటా లో జరిగిన రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ఇచ్చేందుకు ఆయన ఆమోదం తెలిపారు

Posted On: 21 FEB 2022 9:52AM by PIB Hyderabad

రాజస్థాన్ లోని కోటా లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వడాని కి కూడా ప్రధాన మంత్రి ఆమోదం తెలిపారు.

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) ఒక ట్వీట్ లో -

‘‘రాజస్థాన్ లోని కోటా లో జరిగిన దుర్ఘటన అత్యంత దుఃఖదాయకం గా ఉంది. ప్రాణాల ను కోల్పోయిన వారి దగ్గరి బంధువుల కు నేను నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ అపార దుఃఖాన్ని భరించే శక్తి ని వారికి ఆ ఈశ్వరుడు ప్రదానం చేయు గాక: ప్రధాన మంత్రి ’’

‘‘కోటా లో జరిగిన దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతు న , గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతు న ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.

***

DS/SH

 

 

 

 



(Release ID: 1799974) Visitor Counter : 103