బొగ్గు మంత్రిత్వ శాఖ
భారతదేశంలో అత్యంత ఆధారపడదగిన ప్రభుత్వ రంగ సంస్థ అవార్డును పొందినందుకు కోల్ ఇండియా లిమిటెడ్‌ను అభినందించిన మంత్రులు శ్రీ ప్రహ్లాద్ జోషి, శ్రీ రావ్ సాహెబ్ పాటిల్ దాన్వే
Posted On:
20 FEB 2022 5:03PM by PIB Hyderabad
భారతదేశంలో అత్యంత ఆధారపడదగిన ప్రభుత్వ రంగ సంస్థ అవార్డును పొందినందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్)ను కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి అభినందించారు. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ మంత్రి శ్రీ జోషీ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇంధన రంగంలో అగ్రగామిగా అవతరించేందుకు సిఐఎల్ చేస్తున్న కృషికి ఈ అవార్డు మరింత ప్రేరణను, ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మక అవార్డును సాధించినందుకు సిఐఎల్‌ను బొగ్గు, గనులు, రైల్వే మంత్రిత్వ శాఖ సహాయమంత్రి శ్రీ రావ్ సాహెబ్ కూడా అభినందనలు తెలిపారు.
ఎనర్జీ మీట్& ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో కోల్‌కొతాకు చెందిన అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ సిఐఎల్‌కు ఈ అవార్డును అందించింది.
***
(Release ID: 1799872)
Visitor Counter : 152