ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తర్ ప్రదేశ్ లోని కుశీనగర్ లో జరిగిన దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడంపట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
17 FEB 2022 10:02AM by PIB Hyderabad
ఉత్తర్ ప్రదేశ్ లోని కుశీనగర్ లో జరిగిన దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేశారు. స్థానిక పాలన యంత్రాంగం సాధ్యమైన అన్ని విధాలు గా సహాయాన్ని అందించడం లో తలమునకలైందని కూడా ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఉత్తర్ ప్రదేశ్ లోని కుశీనగర్ లో జరిగిన దుర్ఘటన హృదయ విదారకం గా ఉంది. ఈ ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు నేను నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారు సాధ్యమైనంత త్వరలో కోలుకోవాలని కోరుకొంటున్నాను. స్థానిక పాలన యంత్రాంగం సాధ్యమైన అన్ని విధాలు గా సహాయం చేయడం లో తలమునకలైంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1798979)
సందర్శకుల సూచీ సంఖ్య : : 175
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam