రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వాహ‌న అనుగామి వ్య‌వ‌స్థ ప‌రిక‌రం కోసం ముసాయిదా నోటిఫికేష‌న్ జారీ

Posted On: 16 FEB 2022 2:07PM by PIB Hyderabad

జాతీయ ప‌ర్మిట్ ప‌రిధిలోని లేకుండా ప్ర‌మాద‌క‌ర‌మైన లేదా అపాయ‌క‌ర‌మైన స్వ‌భావం క‌లిగిన‌ ఆర్గాన్‌, నైట్రోజెన్‌, ఆక్సిజ‌న్ త‌దిత‌ర వాయువుల‌ను ర‌వాణా చేసే వాహ‌నాలలో వాహ‌న అనుగామి వ్య‌వ‌స్థ‌ల (ట్రాకింగ్ సిస్టం) ప‌రిక‌రాలను అమ‌ర్చ లేవని ర‌హ‌దారులు ర‌వాణా & హైవేల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకురావ‌డం జ‌రిగింది. 
ఇందుకు అనుగుణంగా, ర‌హ‌దారులు, ర‌వాణా, హైవేల మంత్రిత్వ శాఖ‌, 15 ఫిబ్ర‌వ‌రి, 2022న ముసాయిదా నోటిఫికేష‌న్ ద్వారా ప్ర‌మాద‌క‌ర‌మైన లేదా అపాయ‌క‌ర‌మైన వ‌స్తువుల‌ను ర‌వాణా చేసే ప్ర‌తి వాహ‌నానికీ ఆటోమేటివ్ ఇండ‌స్ట్రీ స్టాండ‌ర్డ్ (ఎఐఎస్‌) 140 కింద వాహ‌న అనుగామి వ్య‌వ‌స్థ ప‌రిక‌రాల అమ‌ర్చాల‌ని ప్ర‌తిపాదించింది. 
భాగ‌స్వాములంద‌రి నుంచి ముప్పైరోజుల లోపు త‌మ వ్యాఖ్య‌ల‌ను, సూచ‌న‌ల‌ను చేయ‌వ‌ల‌సిందిగా ఆహ్వానించ‌డ‌మైంది. 

 

****
 


(Release ID: 1798766)