మంత్రిమండలి

భారతదేశం జి20 కి అధ్యక్ష స్థానాన్ని స్వీకరించడం కోసం జరుగుతున్నసన్నాహాల కు, అలాగే జి20 సచివాలయం ఏర్పాటు కు, తత్సంబంధి సిబ్బంది కూర్పున కు ఆమోదం తెలిపినమంత్రిమండలి

Posted On: 15 FEB 2022 5:23PM by PIB Hyderabad

జి20 సచివాలయాన్ని మరియు ఆ సంస్థ తాలూకు నివేదన విభాగాల ను ఏర్పాటు చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది. జి20 కి భారతదేశం త్వరలోనే అధ్యక్షత వహించి సారథ్యాన్ని చేపట్టనుండడం తో అనంతరం తీసుకొనేటటువంటి విధానపరమైన నిర్ణయాల సమగ్ర అమలు కు జి20 సచివాలయం పూచీపడనుంది.

భారతదేశం 2022వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ మొదలుకొని 2023వ సంవత్సరం నవంబర్ 30వ తేదీ వరకు జి20 కి అధ్యక్ష బాధ్యత ను నిర్వహించనుంది. 2023వ సంవత్సరం లో భారతదేశం లో జరిగే జి20 శిఖర సమ్మేళనం తో భారతదేశం అధ్యక్ష బాధ్యత ముగుస్తుంది. జి20 అనేది అంతర్జాతీయం గా ఆర్థిక పరమైనటువంటి సహకారాని కి ఉద్దేశించిన మరియు ప్రపంచం లో ఆర్థిక వ్యవహారాల పాలన లో ఒక ముఖ్యమైన పాత్ర ను పోషించేటటువంటి ఒక ప్రధానమైన వేదిక గా ఉన్నది.

వాడుక ప్రకారం, జి20 కి భారతదేశం అధ్యక్షత తాలూకు జ్ఞాన పరమైన/విషయ పరమైన, సాంకేతిక పరమైన, ప్రసార మాధ్యమాల కు సంబంధించిన, భదత్ర పరమైన, ఇంకా లాజిస్టిక్ పరమైనటువంటి అంశాల తో ముడిపడిన కార్యాల ను పూర్తి చేయడం కోసం జి20 సచివాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీనిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇంకా ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖ లు/విభాగాల కు చెందిన అధికారులు మరియు సిబ్బంది కి తోడు గా డమేన్ నాలెడ్జ్ ఎక్స్ పర్ట్ స్ నడుపుతారు. ఈ సెక్రటేరియట్ 2024వ సంవత్సరం ఫిబ్రవరి వరకు విధుల ను నిర్వహిస్తుంది.

ఈ సచివాలయాని కి ప్రధాన మంత్రి అధ్యక్షత వహించే ఒక అత్యున్నత సంఘం మార్గదర్శకత్వాన్ని అందించనుంది. ఈ అత్యున్నత సంఘం లో ఆర్థిక మంత్రి, హోం మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, జి20 శెర్ పా (వాణిజ్యం & పరిశ్రమ, వస్త్రాలు, వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ఇంకా సార్వజనిక వితరణ శాఖ మంత్రి) కూడా ఉంటారు. ఈ సంఘం జి20 అధ్యక్ష హోదా లో నడుచుకొనే భారతదేశాని కి మొత్తం మీద మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఇంకా, జి20 కు సంబంధించిన అన్ని సన్నాహాల ను పర్యవేక్షించడం కోసం మరియు అత్యున్నత సంఘాని కి నివేదించడం కోసం ఒక సమన్వయ సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జి20 సచివాలయం బహుళ పక్ష వేదికల లో ప్రపంచ అంశాల పై భారతదేశం నాయకత్వం నెరపడం కోసం జ్ఞానం ఇంకా, ప్రావీణ్యం సహా దీర్ఘకాలిక కెపాసిటీ బిల్డింగ్ కు మార్గాన్ని సుగమం చేస్తుంది.

 

***



(Release ID: 1798581) Visitor Counter : 264