ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మధ్వ నవమి సందర్భంగా శ్రీ మధ్వాచార్యుల వారిని స్మరించుకున్న - ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 10 FEB 2022 7:00PM by PIB Hyderabad

మధ్వ నవమి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీ మధ్వాచార్యులకు శ్రద్ధాంజలి ఘటించారు.  2017 ఫిబ్రవరి నెలలో జగద్గురు మధ్వాచార్య 7వ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం వీడియోను కూడా ప్రధానమంత్రి  పంచుకున్నారు.

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,  "పవిత్ర దినమైన మధ్వ నవమి సందర్భంగా, శ్రీ మధ్వాచార్య గారికి నా హృదయ పూర్వక శ్రద్ధాంజలి సమర్పిస్తున్నారు.  ఆధ్యాత్మిక, సామాజిక అభ్యున్నతికి సంబంధించిన ఆయన గొప్ప సందేశం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.  శ్రీ మధ్వాచార్యుల వారి గురించి నేను చేసిన ప్రసంగాన్ని ఇక్కడ జత చేస్తున్నాను." అని పేర్కొన్నారు.

 

*****


(रिलीज़ आईडी: 1797583) आगंतुक पटल : 227
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam