సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మీడియా వన్ ఛానెల్‌కు అప్‌లింక్, డౌన్‌లింక్ అనుమతులను రద్దు చేస్తూ జారీ చేసిన ఐ&బి మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను సమర్ధించిన కేరళ హైకోర్టు
प्रविष्टि तिथि:
08 FEB 2022 2:33PM by PIB Hyderabad
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మీడియా వన్ న్యూస్ & కరెంట్ అఫైర్స్ ఛానెల్‌కు అప్‌లింక్, డౌన్లింక్ అనుమతిని రద్దు చేయడాన్ని కేరళ హైకోర్టు మంగళవారం సమర్ధించింది. హోం వ్యవహారాల శాఖ ఈ ఛానెల్‌కు భద్రతాపరమైన అనుమతిని నిరాకరించడంతో ఛానెల్ పై ఆంక్షలు విధించారు.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలైన రిట్ పిటిషన్‌ను కొట్టివేస్తూ, నిఘా వర్గాల ఇచ్చిన సమాచారం ఆధారంగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతిని తిరస్కరించిందని, దీనితో ఛానెల్‌కు భద్రతా అనుమతి తిరస్కరణ సమంజసమని కోర్టు అభిప్రాయపడింది.
మీడియా వన్ ఛానెల్‌ను నిర్వహించే ఎం/ ఎస్ మధ్యమం బ్రాడ్‌కాస్టింగ్ లిమిటెడ్ కు మంజూరు చేసిన అప్‌లింక్, డౌన్లింక్ అనుమతిని రద్దు చేస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 31 జనవరి, 2022న ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతించిన ఛానెళ్ళ జాబితా నుంచి ఛానెల్ పేరును కూడా ఉత్తర్వులు తొలగించాయి.
కాగా, ఛానెల్‌కు 30.09.2011 నుంచి 29.09.2022 మధ్య కాలంలో అప్‌లింక్, డౌన్లింక్ అనుమతిని మంజూరు చేశారు.
***
(रिलीज़ आईडी: 1796671)
आगंतुक पटल : 157