హోం మంత్రిత్వ శాఖ

ప్ర‌ముఖ నేప‌థ్య గాయ‌ని, భార‌త ర‌త్న సుశ్రీ ల‌తా మంగేష్క‌ర్ మృతి ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేసిన కేంద్ర హోం, స‌హ‌కార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


శ్రావ్య‌త‌, సంగీతానికి ప‌ర్యాయంగా ఉన్న ల‌తా దీదీ మంత్ర ముగ్ధుల‌ను చేసే త‌న స్వ‌ర‌మాధుర్యంతో భార‌త‌దేశంలోనే కాక ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తి త‌రానికీ ఆనందాన్ని పంచింది

సంగీత ప్ర‌పంచానికి ఆమె అందించిన సేవ‌లు మాట‌ల్లో పెట్ట‌లేనివి, ఆమె మ‌ర‌ణం నాకు వ్య‌క్తిగ‌త లోటు

అప్పుడ‌ప్పుడు ల‌తా దీదీ ఆప్యాయ‌త‌ను, ఆశీస్సుల‌ను పొంద‌డం నా అదృష్టంగా భావిస్తాను

సాటిలేని దేశ‌భ‌క్తి, మృదుమ‌ధుర‌మైన వాణితో, ఆమె ఎప్పుడూ మ‌న మ‌ధ్య ఉంటారు, ఆమె కుటుంబానికీ, అసంఖ్యాక అభిమానుల‌కు నా సంతాపాన్ని వ్య‌క్తం చేస్తున్నాను

Posted On: 06 FEB 2022 1:28PM by PIB Hyderabad

 ప్ర‌ముఖ నేప‌థ్య గాయ‌ని, భార‌త ర‌త్న శ్రీ ల‌తా మంగేష్క‌ర్ ఆక‌స్మిక మ‌ర‌ణం ప‌ట్ల కేంద్ర హోం, స‌హ‌కార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. 
శ్రావ్య‌త‌, సంగీతానికి ప‌ర్యాయంగా ఉన్న ల‌తా దీదీ మంత్ర ముగ్ధుల‌ను చేసే త‌న స్వ‌ర‌మాధుర్యంతో భార‌త‌దేశంలోనే కాక ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తి త‌రానికీ ఆనందాన్ని పంచింది. సంగీత ప్ర‌పంచానికి ఆమె అ          ందించిన సేవ‌లు మాట‌ల‌కు అంద‌నివి, ఆమె మ‌ర‌ణం నాకు వ్య‌క్తిగ‌త లోటు, అని శ్రీ అమిత్ షా త‌న ట్వీట్ లో పేర్కొన్నారు. 
అప్పుడ‌ప్పుడు నేను ల‌తా దీదీ ఆప్యాయ‌త‌ను, ఆశీస్సుల‌ను పొంద‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. త‌న సాటిలేని దేశ‌భ‌క్తి, సౌమ్య‌మైన‌, మ‌ధుర‌మైన మాట‌ల‌తో  ఆమె ఎప్పుడూ మ‌న మ‌ధ్య ఉంటారు. ఆమె కుటుంబానికీ, అసంఖ్యాక అభిమానుల‌కు నా ప్ర‌గాఢ సంతాపాన‌ని తెలియ‌చేస్తున్నాను, అని కేంద్ర హోం మంత్రి అన్నారు.

 (Release ID: 1795951) Visitor Counter : 175