ఆర్థిక మంత్రిత్వ శాఖ
నీతి ఆయోగ్ ఎస్‌డిజి ఇండియా ఇండెక్స్, డాష్ బోర్డు 2020-21లో ఇండియా స్కోరు 66కు మెరుగుపడింది.
పోటీపడుతున్న వాటి సంఖ్య 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పెరిగింది : ఆర్థిక సర్వే
2010-20 మధ్య అంతర్జాతీయంగా అటవీ ప్రాంతం పెంచుకున్న దేశాల జాబితాలో ఇండియా 3 వ స్థానంలో ఉంది.
2011-2021 మధ్య అటవీ ప్రాంతం 3 శాతానికంటే పెరుగుదల సాధించింది.
Posted On:
31 JAN 2022 2:45PM by PIB Hyderabad
ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను 2022 నాటికి ఇండియా వదిలించుకోనుంది. ప్లాస్టిక్ పాకేజింగ్ వ్యర్థాల చక్రీయ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం కానుంది.
గంగానది ప్రధాన ప్రవాహప్రాంతం, దాని ఉపనదుల ప్రాంతంలో ఎక్కువ కాలుష్యకారక పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ చర్యల విషయంలో ప్రభుత్వం నిబంధనలు పాటించడం 2020 లో 81 శాతానికి చేరింది.
2024 నాటికి పార్టికులేట్ మేటర్ కాన్సన్‌ట్రేషన్‌లను 20-30 శాతం తగ్గించాలన్న లక్ష్యం చేరుకునేందుకు నేషనల్ క్లీన్ ఎయిర్ పథకాన్ని 132 నగరాలలో అమలుచేయడం జరుగుతుంది.
2030 నాటికి కాలుష్య ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను చేరుకునేందుకు సిద్ధంగా ఉంది. వనరులను జాగ్రత్తగా ఒక పద్ధతిప్రకారం వినియోగించడం అవసరమని పేర్కొన్న ఆర్థిక సర్వే.
ఇండియా ఐఎస్ ఎ, సిడిఆర్ ఐ, ఎల్ ఇ ఎ డి ఐ టి కింద అంతర్జజాతీయ వేదికలపై ఇండియా వాతావరణ నాయకత్వ పాత్రను పోషిస్తోంది.
-------
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబంధించి ఇండియా పురోగతి సాధించింది. నీతి ఆయోగ్ ఎస్ డి జి ఇండియా ఇండెక్స్, డాష్ బోర్డు ఇండెక్స్ పాయింట్లు 2018-19లో 57 , 2019-20లో 60 ఉండగా 2020-21లో అది 66 పాయింట్లకు పెరిగింది. 2021-22. కేంద్ర ఆర్థిక ,కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్ధిక సంవత్సరానికి ఆర్థిక సర్వేని పార్లమెంటు లో ప్రవేశపెట్టారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో పురోగతిని ఈ సందర్బంగా ఆమె ప్రస్తావించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కింద సామాజిక, ఆర్థిక, పర్యావరణ లక్ష్యాలను సాధించేందుకు ఇండియా కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు .
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల విషయంలో ఇండియా ప్రగతి:
ఆర్ధిక సర్వే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నీతి ఆయోగ్ ఎస్ డిజి ఇండియా ఇండెక్స్ 2021 పనితీరుపై కింది వ్యాఖ్యలు చేసింది.
స్కోరు65-69 కి పోటీపడుతున్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 2019-20లో 10 ఉండగా, 2020-21 లో ఇది 22 కు పెరిగింది.
ఉన్నత స్థాయిలో ఉన్నవి కేరళ , చండీఘడ్
దేశ ఈశాన్య ప్రాంతలో (ఈశాన్య ప్రాంత జిల్లా ఎస్‌డిజి ఇండెక్స్ 2021-22) 64 జిల్లాలు ఫ్రంట్ రన్నర్‌లుగా, 34 జిల్లాలు పనితీరు కనబరిచిన జిల్లాలుగా ఉన్నాయి.
పర్యావరణ స్థితిః
సమతుల్యతతో కూడిన అద్భుత ప్రగతి, పరిరక్షణ, పర్యావరణ భద్రత, సుస్థిరతత తో పాటు పలు ఇతర అంశాలపై ఆర్ధిక సర్వే ప్రముఖంగా ప్రస్తావించింది.
అడవులు:
గత దశాబ్ద కాలంలో ఇండియా అటవీప్రాంతాన్ని చెప్పుకోదగిన స్థాయిలో పెంచుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా సగటు వార్షిక అడవుల విస్తీర్ణం 2011-2020 మధ్య పెరుగుదలలో మూడవ స్థానంలో ఉంది. అదే సమయంలో ఇండియా అటవీ విస్తీర్ణం 2011 నుంచి 2020 మధ్య 3 శాతం కంటే పెరిగింది. ఇది ప్రధానంగా అత్యంత దట్టమైన అడవులు పెరగడంవల్ల సాధ్యమైంది. దట్టమైన అడవులు ఈ కాలంలో 20 శాతం పెరిగాయి.
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, ఒకసారి పారేసే ప్లాస్టిక్‌లు :
2022 నాటికి ఒకేసారి వాడి పారేసే ప్లాస్టిక్ ను రూపుమాపనున్నట్టు ప్రధానమంత్రి చేసిన ప్రకటనను సర్వే పునరుద్ఘాటించింది. ఈ అంశంపై అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలని అంటూ, 2019లో ఐక్యరాజ్యసమితి పర్యావరణ అసెంబ్లీలో 2019లో ఒకసారి వాడపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తుల నుంచి వచ్చే కాలుష్య సమస్యను పరిష్కరించాలని ఇండియా తీర్మానించింది.
దేశీయంగా, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సవరణ నిబంధనలు 2021 ని నోటిఫై చేయడం జరిగింది. ఇవి ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను దశల వారీగా రూపుమాపనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ పాకేజింగ్ కు సంబంధించి ఉత్పత్తిదారు బాధ్యతను విస్తరించారు. అలాగే ప్లాస్టిక్ పాకేజింగ్ వ్యర్థాలకు సంబంధించి సర్కులర్ ఎకానమీని బలోపేతం చేయడం, ప్లాస్టిక్‌కు నూతన ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసి వాటిని ప్రోత్సహించడం, సుస్థిర ప్లాస్టిక్ పాకేజింగ్ కు నిబంధనలను నిర్దేశించారు.
నీరు
భూగర్భ జల వనరుల యాజమాన్యం, దానికి సంబంధించి సర్వేలోతేలిన అంశాల ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు భూ గర్భ జల వనరులను జాగ్రత్తగా వాడుకోవలసిన అవసరం ఉందని సూచిస్తున్నది. అలాగే భూగర్భ జలాలను రీచార్జి చేయడం, వాటిని అవసరానికి మించి వాడడాన్ని అరికట్టడం చేయవలసి ఉంది. దేశంలోని దక్షిణాదిన , వాయవ్య ప్రాంతంలో భూగర్భ జలాలను విపరీతంగా వాడడం కనిపిస్తుందని సర్వేలో తేలింది.
సర్వే ప్రకారం, రిజర్వాయర్ లైవ్ స్టోరేజ్ వర్షాకాలంలో గరిష్ఠంగా ఉంటోందని, వేసివికాలంలో కనిష్ఠస్థాయిలో ఉంటోందని అందువల్ల స్టోరేజ్ , నీటివిడుదల, రిజర్వాయర్ల వాడకం విషయంలో జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించింది.
నమామి గంగే మిషన్ కింద ఈ మిషన్ ప్రారంభమైనప్పటినుంచి మురుగునీటి పారుదలకు సంబంధించి ఎన్నో మౌలికసదుపాయాల ప్రాజెక్టులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సర్వే , గంగా ప్రధాన కాలువ వెంట ,దాని ఉపనదుల వద్ద పెద్ద మొత్తంలో కాలుష్యానికి కారకంగా ఉంటూ వచ్చిన పరిశ్రమలు 2017లో 39 శాతం మాత్రమే పరిస్థితుల మెరుగుకు చర్యలు తీసుకుంటూ ఉండగా 2020 నాటికి వాటి శాతం 81 కి పెరిగింది. 2017లో వ్యర్థాల విడుదల రోజుకు 349.13 మిలియన్ లీటర్లు ఉండగా 2020 నాటికి అది 280.20 ఎం.ఎల్.డి కి తగ్గింది.
గాలిః
నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ( ఎన్‌సిఎపి) ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. దీని ప్రకారం 2024 నాటికి పార్టికులేట్ మాటర్ కాన్సన్‌ట్రేషన్‌లను దేశవ్యాప్తంగా 20-30 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ కార్యక్రమాన్ని దేశంలోని 132 నగరాలలో అమలు చేస్తున్నట్టు సర్వే తెలిపింది. దేశంలో వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలను సర్వే ప్రస్తావించింది. వాహనకాలుష్‌యం, పారిశ్రామిక కాలుష్యం, ధూళి కాలుష్యం, వ్యర్థాలు కాల్చడం వల్ల వచ్చే కాలుష్యం, వంటివాటి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, వాయు నాణ్యతకు సంబంధించి పర్యవేక్షణను సర్వేప్రస్తావించింది.
ఇండియా , వాతావరణ మార్పులు
పారిస్ ఒప్పందం ప్రకారం భారతదేశం తొలిగా జాతీయస్థాయిలో నిర్ణయించిన సహకారాన్ని (ఎన్‌డిసి) 2015 లో ప్రకటించింది . కాలుష్య ఉద్గారాలను మరింత తగ్గించేందుకు వీలుగా 2030 నాటికి సాధించాల్సిన ప్రతిష్టాత్మక లక్ష్యాలను 2021లో ప్రకటించింది. ఎల్.ఐ.ఎఫ్.ఇ 'లైఫ్' అనే ఏక పద ఉద్యమం ప్రారంభించాల్సిన అవసరాన్ని సర్వే ప్రస్తావించింది. దీని అర్థం పర్యావరణం కోసం జీవనశైలి, అనుచిత, విధ్వంసక వినియోగానికి బదులుగా బుద్ధిపూర్వక , ఉద్దేశపూర్వక వినియోగాన్ని ప్రోత్సహించడం..
ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ISA), కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సిడిఆర్ ఐ) లీడర్‌షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ (లీడ్ ఐటి గ్రూప్) కింద భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో వాతావరణ నాయకత్వానికి చెప్పుకోదగిన కసరత్తు చేస్తోందని కూడా సర్వే పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బిఐ , సెబి లు సుస్థిర ఆర్థిక రంగంలో అనేక కార్యక్రమాలు చేపట్టాయి.
***
(Release ID: 1794611)
Visitor Counter : 933