ప్రధాన మంత్రి కార్యాలయం

‘ప్రజల పట్ల స్నేహపూర్వకం గా ఉన్నటువంటి  మరియుక్రమాభివృద్ధి సహితమైనటువంటి బడ్జెటు’ ను రూపొందించినందుకు ఆర్థిక మంత్రి కిమరియు ఆమె యొక్క జట్టు కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


‘‘ఈసంవత్సరం బడ్జెటు వందేళ్ళకు ఒకసారి విరుచుకుపడిన విపత్తు నడుమ అభివృద్ధి తాలూకు ఒకకొత్త ఆత్మవిశ్వాసం తో ముందుకు వచ్చింది’’

‘‘ఈబడ్జెటు ఆర్థిక వ్యవస్థ కు బలాన్ని అందించడంతో పాటు, సామాన్యప్రజానీకానికి కొత్త అవకాశాల ను కల్పిస్తుంది’’

‘‘మరిన్నిమౌలిక సదుపాయాల కల్పన కు, మరింత పెట్టుబడి కి, అధిక వృద్ధి కి, మరిన్ని ఉద్యోగాల కు బడ్జెటు లోఅవకాశాలు సంపూర్ణం గా ఉన్నాయి’’

‘‘ఈబడ్జెటు లో అత్యంత ముఖ్యమైనటువంటి అంశాల లో పేదల సంక్షేమం అనేది ఒకటి గా ఉంది’’

‘‘వ్యవసాయాన్నిలాభసాటి గాను మరియు కొత్త అవకాశాల తో నిండినది గాను తీర్చిదిద్దడం బడ్జెటు లోపేర్కొన్న అంశాల ధ్యేయం గా ఉంది’’

Posted On: 01 FEB 2022 3:57PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సంవత్సరం బడ్జెటు వందేళ్ళ కు ఒకసారి విరుచుకుపడిన విపత్తు నడుమ అభివృద్ధి కి సంబంధించిన ఒక కొత్త విశ్వాసం తో ముందుకు వచ్చిందన్నారు. ‘‘ఈ బడ్జెటు ఆర్థిక వ్యవస్థ కు శక్తి ని అందించడంతో పాటు సామాన్య ప్రజల కు కొత్త అవకాశాల ను కూడా ప్రసాదిస్తుంది’’ అని ఆయన అన్నారు.

 

 

కేంద్ర బడ్జెటు ను లోక్ సభ లో ప్రవేశపెట్టిన తరువాత ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘మరిన్ని మౌలిక సదుపాయాల కు, మరింత పెట్టుబడి కి, మరింత వృద్ధి కి, అలాగే మరిన్ని ఉపయోగాల కు అవకాశాలు సంపూర్ణం గా బడ్జెటు లో ఉన్నాయి’’ అన్నారు. ఇది గ్రీన్ జాబ్ సెక్టర్ ను మరింత గా విస్తరింప జేస్తుంది అని ఆయన అన్నారు. ఈ బడ్జెటు సమకాలీన సమస్యల ను పరిష్కరించడం ఒక్కటే కాకుండా యువత కు ఉజ్వలమైన భవిష్యత్తు కు కూడా పూచీ పడుతుంది అని ఆయన అన్నారు.

 

జీవితం లోని ప్రతి ఒక్క రంగం లో సాంకేతిక విజ్ఞానం ఉపయోగాని కి, నూతనత్వాన్ని తీసుకొని రావడానికి సాగుతున్నటువంటి అన్వేషణ రైతు లకై డ్రోన్ లు, వందే భారత్ రైళ్ళు, డిజిటల్ కరెన్సీ, 5జి సేవలు, నేశనల్ డిజిటల్ హెల్థ్ ఇకో సిస్టమ్ ల వంటి చర్య లలో ప్రతిబింబించి మన యువత కు, మధ్య తరగతి కి, పేదల కు, దళితుల కు, ఇంకా వెనుకబడిన వర్గాల వారికి ఎన్నో ప్రయోజనాల ను సమకూర్చగలుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు.

పేదల సంక్షేమం అనేది ఈ బడ్జెటు లో ఒక అతి ముఖ్యమైన అంశం గా ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. పక్కా ఇంటి కి, టాయిలెట్ కు, నల్లా నీటి కి మరియు గ్యాస్ కనెక్షన్ కు పూచీ పడటం ధ్యేయం గా ఈ బడ్జెటు రూపొందింది అని ఆయన అన్నారు. అదే సమయం లో ఆధునిక ఇంటర్ నెట్ సంధానం పట్ల సైతం శ్రద్ధ ను తీసుకోవడమైంది అని ఆయన అన్నారు.

దేశం మొట్టమొదటిసారిగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము కశ్మీర్, ఇంకా ఈశాన్య రాష్ట్రాల వంటి ప్రాంతాల లో ‘పర్వతమాల’ పథకాన్ని ఆరంభించడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఈ పథకం ద్వారా పర్వతమయమైన ప్రాంతాల కు ఆధునిక రవాణా వ్యవస్థ ఏర్పడుతుంది అని ఆయన అన్నారు.

గంగ శుద్ధి కి తోడు గా ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఝార్ ఖండ్, ఇంకా పశ్చిమ బంగాల్.. ఈ అయిదు రాష్ట్రాల లో నది తీర ప్రాంతాల లో ప్రాకృతిక వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించనుందని ప్రధాన మంత్రి అన్నారు. ఇది రైతుల సంక్షేమం కోసం తీసుకొన్నటువంటి ఒక విశేషమైన చర్య, మరి ఇది గంగా నది ని రసాయనాల కు తావు లేనటువంటిది గా మార్చడం లో కూడాను సహాయకారి అవుతుంది అని ఆయన అన్నారు.

వ్యవసాయాన్ని లాభదాయకం గాను, కొత్త కొత్త అవకాశాల ను ప్రసాదించేది గాను తీర్చిదిద్దాలన్నది బడ్జెటు లో పేర్కొన్న అంశాల ధ్యేయం గా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. కొత్త వ్యావసాయిక స్టార్ట్-అప్స్ ను ప్రోత్సహించడం కోసం ఒక ప్రత్యేక నిధి, ఇంకా ఫూడ్ ప్రోసెసింగ్ ఇండస్ట్రీ కి ప్యాకేజీ ల వంటి చర్య లు రైతుల ఆదాయాన్ని పెంచడం లో సహాయకారి కాగలవు అని ఆయన అన్నారు. 2.25 లక్ష ల కోట్ల రూపాయల కు పైగా డబ్బు ను ఎమ్ఎస్ పి కొనుగోలు ద్వారా రైతు ల ఖాతా లోకి బదలాయించడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.

రుణ హామీ లో రికార్డు పెంపుదల తో పాటు గా బడ్జెటు లో అనేక పథకాల ను ప్రకటించడం జరిగిందని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘రక్షణ సంబంధి మూలధన బడ్జెటు లో 68 శాతాన్ని దేశీయ పరిశ్రమ కు ప్రత్యేకించడం ద్వారా భారతదేశం లోని ఎమ్ఎస్ఎమ్ఇ రంగం ఎంతగానో లబ్ధి ని పొందనుంది. 7.5 లక్ష ల కోట్ల రూపాయల విలువైన సార్వజనిక పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ కు నూతనోత్తేజాన్ని ఇవ్వనుంది, అంతేకాదు ఇది చిన్న పరిశ్రమల కు, ఇతర పరిశ్రమల కు కొత్త అవకాశాల ను కూడా అందిస్తుంది’’ అని ఆయన అన్నారు.

‘ప్రజల పట్ల స్నేహపూర్వం గా ఉన్నటువంటి, మరిన్ని క్రమాభివృద్ధి సహితమైనటువంటి బడ్జెటు’ ను ఇచ్చినందుకు గాను ఆర్థిక మంత్రి కి మరియు ఆమె యొక్క జట్టు కు అభినందనల ను తెలియజేస్తూ ప్రధాన మంత్రి తన వ్యాఖ్యల ను ముగించారు.

 

*****

 

DS

 

 



(Release ID: 1794566) Visitor Counter : 109