ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'ఆరోగ్యం మరియు విద్య సెస్' వ్యాపార వ్యయంగా అనుమతించబడదు


నిర్దిష్ట ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడం కోసం పన్ను చెల్లింపుదారులపై అదనపు సర్‌ఛార్జ్‌గా ఆరోగ్యం మరియు విద్య సెస్ విధించబడింది.

प्रविष्टि तिथि: 01 FEB 2022 1:07PM by PIB Hyderabad
‘ఆరోగ్యం మరియు విద్య సెస్’ వ్యాపార వ్యయంగా అనుమతించబడదు. ఈరోజు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
వ్యాపార ఆదాయాన్ని లెక్కించేందుకు ఆదాయపు పన్ను అనుమతించదగిన ఖర్చు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఇందులో పన్నుతో పాటు సర్‌ఛార్జ్‌లు కూడా ఉంటాయి.
నిర్దిష్ట ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడం కోసం పన్ను చెల్లింపుదారులపై 'ఆరోగ్యం మరియు విద్య సెస్' అదనపు సర్‌ఛార్జ్‌గా విధించబడుతుందని ఆమె వివరించారు. కొన్ని న్యాయస్థానాలు 'ఆరోగ్యం మరియు విద్య సెస్'ను వ్యాపార వ్యయంగా అనుమతించాయని, ఇది చట్టబద్ధమైన ఉద్దేశ్యానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి, ఆదాయం మరియు లాభాలపై ఎలాంటి సర్‌ఛార్జ్ లేదా సెస్‌ను వ్యాపార వ్యయంగా అనుమతించలేమని పునరుద్ఘాటించారు.

 

***


(रिलीज़ आईडी: 1794558)
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Hindi , Bengali , Manipuri , Punjabi , Tamil , Urdu , Marathi , Gujarati , Kannada , Malayalam