ఆర్థిక మంత్రిత్వ శాఖ
మూలధన వ్యయంలో 35.4% భారీ పెరుగుదల
2019-20తో పోలిస్తే రెండింతలకన్నా ఎక్కువగా 2022-23లో కాపెక్స్
రూ. 10.68 లక్షల కోట్లగా ప్రభావవంతమైన మూలధన వ్యయం అంచనా
హరిత మౌలిక సదుపాయాల కోసం వనరులను సమీకరించనున్న సావరిన్ గ్రీన్ బాండ్లు
Posted On:
01 FEB 2022 1:03PM by PIB Hyderabad
కేంద్ర బడ్జెట్‌లో మూలధన వ్యయం పెట్టుబడిని ప్రస్తుత సంవత్సరం రూ. 5.54 లక్షల కోట్ల నుంచి 2022-23లో రూ. 7,50 లక్షల కోట్లు, అంటే 35.4% శాతం పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో చేసిన తన బడ్జెట్ ఉపన్యాసంలో పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్ 2022-23ను ప్రవేశపెడుతూ, 2019-20 వ్యయంతో పోలిస్తే మూల ధన వ్యయాన్ని 2.2 రెట్లు పెంచామని, ఇది 2022-23 జిడిపిలో 2.9%గా ఉండనుంది. పెట్టుబడి చక్రంలోకి ప్రైవేటు పెట్టుబడిని ఆకర్షించేందుకు ప్రభుత్వ పెట్టుబడి కూడా అవసరం అవుతుంది. తమ సంభావ్యతలకు అనుగుణంగా, ఆర్థిక వ్యవస్థల అవసరాలకు అనుగుణంగా ప్రైవేటు పెట్టుబడులు పెరగాలంటే, 2022-23లో ప్రైవేటు పెట్టుబడిని, డిమాండ్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వ పెట్టుబడులు అగ్రగామిగా ఉండాలని మంత్రి చెప్పారు.
ప్రభావవంతమైన మూలధన వ్యయంః
రాష్ట్రాలకు చేసిన ఆర్థిక సాయం ద్వారా మూలధన ఆస్తులను సృష్టించే అంశంతో మూల ధన వ్యయాన్ని కలిపి, కేంద్ర ప్రభుత్వ ప్రభావవంతమైన మూలధన వ్యయం 2022-23లో రూ.10.68 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇది జిడిపిలో 4.1%గా ఉంటుందని మంత్రి వెల్లడించారు.
గ్రీన్ బాండ్లుః
2022-23లో మొత్తం మార్కెట్ రుణాలలో భాగంగా హరిత మౌలిక సదుపాయాలకు వనరులను సమీకరించేందుకు సావరిన్ గ్రీన్ బాండ్లను శ్రీమతి సీతారామన్ ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థ కర్బన తీవ్రతను తగ్గించడంలో సహాయపడే ప్రభుత్వ రంగ ప్రాజెక్టులలో దీనిపై వచ్చే ఆదాయాలను వెచ్చించనున్నారు.
ఉపాధి అవకాశాల సృష్టి, పెద్ద పరిశ్రమలు, ఎంఎస్ఎంఇల నుంచి ఉత్పాదక ఇన్‌పుట్లకు డిమాండ్‌ను పెంచడం, నిపుణుల నుంచి సేవలు, మెరుగైన వ్యవసాయ మౌలిక సదుపాయాల ద్వారా రైతులకు తోడ్పడడం ద్వారా వేగవంతమైన, స్థిరమైన ఆర్ధిక పునరుద్ధరణ, ఏకీకరణకు భరోసా ఇవ్వడంలో మూలధన పెట్టుబడుల పాత్రను ఆర్థిక మంత్రి పట్టి చూపారు.
***
(Release ID: 1794265)
Visitor Counter : 449