ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశంయొక్క 73వ గణతంత్ర దినం సందర్భం లోశుభాకాంక్షలను వ్యక్తం చేసినందుకు గాను ప్రపంచ నేతల కు ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 26 JAN 2022 9:54PM by PIB Hyderabad

భారతదేశం యొక్క 73వ గణతంత్ర దినం సందర్భం లో ప్రపంచ నేతలు వారి శుభకామనల ను వ్యక్తం చేసినందుకు గాను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వారికి ధన్యవాదాలను తెలియజేశారు.

నేపాల్ ప్రధాని చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ,

‘‘ప్రధాని శ్రీ శేర్ బహాదుర్ దేవుబా గారు మీ స్నేహపూర్ణమైనటువంటి అభినందనల కు గాను ఇవే ధన్యావాదాలు. శతాబ్దాల పాతదైన మన మైత్రి కి మరింత దృఢత్వాన్ని ఇవ్వడం కోసం మనం కలసి పనిచేయడాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉందాం.’’ అని పేర్కొన్నారు.

In response to a tweet by PM of Bhutan, the Prime Minister said;

భూటాన్ ప్రధాని చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ,

‘‘భూటాన్ ప్రధాని గారు, భారతదేశం యొక్క గణతంత్ర దినం నాడు మీరు వ్యక్తం చేసిన స్నేహపూర్ణమైనటువంటి శుభాకాంక్షల కు ఇవే ధన్యవాదాలు. భూటాన్ తో అద్వితీయమైనటువంటి మరియు సహన శక్తి ని కలిగినటువంటి మైత్రి కి భారతదేశం చాలా ప్రాముఖ్యాన్ని ఆపాదిస్తున్నది. భూటాన్ ప్రజల కు మరియు భూటాన్ ప్రభుత్వానికి తాశి డెలెక్. మన సంబంధాలు ఇప్పటి కన్న మిన్న గా వర్ధిల్లు గాక.’’ అని పేర్కొన్నారు.

 

 

శ్రీ లంక ప్రధాని చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ,

‘‘ప్రధాని రాజపక్షె గారు, మీకు ఇవే ధన్యవాదాలు. ఈ సంవత్సరం ప్రత్యేకమైన సంవత్సరం ఎందుకంటే, మన రెండు దేశాలు స్వాతంత్ర్యం తాలూకు 75 సంవత్సరాలు పూర్తి అయినందువల్ల మహోత్సవాన్ని జరుపుకొంటున్నాయి. మన దేశాల ప్రజల మధ్య గల బంధాలు మరింత దృఢతరం అవ్వాలి అని నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

In response to a tweet by PM of Israel, the Prime Minister said;

 

ఇజ్ రాయిల్ ప్రధాని చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ,

‘‘ప్రధాని నఫ్తాలీ బెనెట్ గారు, భారతదేశం యొక్క గణతంత్ర దినానికి గాను మీరు స్నేహపూర్ణమైనటువంటి శుభాకాంక్షలను వ్యక్తం చేసినందుకు గాను మీకు ఇవే ధన్యవాదాలు. గడచిన నవంబరు లో జరిగిన మన సమావేశం నాకు జ్ఞ‌ాపకముంది. న్ని నేను ఆప్యాయం గా గుర్తుకు తెచ్చుకొంటున్నాను. భారతదేశం-ఇజ్ రాయిల్ ల మధ్య గల వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యం మీ దూరదర్శి దృక్పథం తో సమృద్ధం అవుతూ ఉంటుందని నేను నమ్ముతున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***



(Release ID: 1792994) Visitor Counter : 135