ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్ర లోజరిగిన ఒక దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్ర‌ధానమంత్రి


బాధితుల కు పిఎమ్ఎన్ ఆర్ ఎఫ్ నుంచి పరిహారాన్ని ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు

నాడు పోస్టు చేయడమైనది: 25 JAN 2022 10:56AM by PIB Hyderabad

మహారాష్ట్ర లో సెల్ సురా కు సమీపం లో జరిగిన ఒక దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వనున్నట్లు కూడా ప్రధాన మంత్రి ప్రకటన చేశారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం అనేక ట్వీట్ లలో –

మహారాష్ట్ర లో సేల్ సురా కు దగ్గర లో జరిగిన ఒక ప్రమాదం లో ప్రాణనష్టం వాటిల్లడం నాకు వేదన ను కలిగించింది. ఈ దు:ఖ ఘడియ లో, ప్రియతముల ను కోల్పోయిన వారి యొక్క శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరలోనే కోలుకోవాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.

 

సేల్ సురా సమీపం లో జరిగిన దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వారికి ప్రతి ఒక్కరికి పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల చొప్పున వారి దగ్గరి సంబంధికుల కు ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రమాదం లో గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది.’’ అని తెలిపింది.

***

DS/SH

 

 


(రిలీజ్ ఐడి: 1792432) సందర్శకుల సూచీ సంఖ్య : : 189