ప్రధాన మంత్రి కార్యాలయం

వేరు వేరు జిల్లా ల డిఎమ్ లతోజనవరి 22న మాట్లాడనున్న ప్రధాన మంత్రి


దేశం లో ఏభాగం కూడాను అభివృద్ధి పథం లో వెనుకబడకుండా పూచీ పడాలన్న ప్రధాన మంత్రి దృష్టికోణమే ఈ ప్రయాస కు ప్రేరణ గా ఉంది 

జిల్లా స్థాయిలో వేరు వేరు పథకాల ను మిశన్ మోడ్ లో పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని సాధించడం ఈ సమావేశంయొక్క ఉద్దేశ్యం గా ఉంది

Posted On: 21 JAN 2022 6:49PM by PIB Hyderabad

వేరు వేరు జిల్లాల డిఎమ్ లతో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2022 జనవరి 22వ తేదీ న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు.

జిల్లాల లో ప్రభుత్వ పథకాల మరియు కార్యక్రమాల అమలు తాలూకు వర్తమాన స్థితి ని, ఇంకా వాటి క్రమాభి వృద్ధి ని గురించి ప్రధాన మంత్రి నేరు గా ఫీడ్ బ్యాక్ స్వీకరిస్తారు. పనితీరు ను సమీక్షించడం తో పాటు ఎదురవుతున్న సవాళ్లు ఏమిటన్నది తెలుసుకోవడం లో ఈ సమావేశం ద్వారా తోడ్పాటు లభించనుంది.

సంబంధి వర్గాల వారందరితో కలసికట్టుగా కృషి చేసి జిల్లాల లో వివిధ విభాగాల ద్వారా వేరు వేరు పథకాల ను పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని సాధించడం దీని ఉద్దేశ్యం గా ఉంది.

దేశమంతటా వృద్ధి లో, ప్రగతి లో అసమతుల్యతల ను అధిగమించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం లోని ప్రభుత్వం అదే పని గా అనేక చర్యల ను చేపట్టింది. పౌరులందరి జీవన ప్రమాణాల ను పెంపొందింపచేయడానికి, అన్ని వర్గాల వారి సమ్మిళిత కాసానికి పూచీపడేందుకు ప్రభుత్వం తరఫు వచనబద్ధత కు అనుగుణం గా ఇది ఉంది.

***

 



(Release ID: 1791862) Visitor Counter : 126