రక్షణ మంత్రిత్వ శాఖ
ఒడిషా తీరం నుంచి పెరిగిన సామర్ధ్యంతో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
Posted On:
20 JAN 2022 3:42PM by PIB Hyderabad
దేశీయంగా ఉత్పత్తి చేసి సాంకేతికతలు, మెరుగైన పనితీరుతో తయరు చేసిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయజి్ క్షిపణిని జనవరి 20, 2022న ఒడిషాలోని చందీపూర్ తీరంలో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఉదయం 10.30గంటలకు విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగాన్ని బ్రహ్మోస్ ఎయిరోస్పేస్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ) బృందాలతో కలిసి నిర్వహించింది. నిర్ధిష్టమైన తీరులో చేసిన ఈ ప్రయోగంలో క్షిపణి మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా అంచనా వేసిన పథాన్ని అనుసరించింది.
ఈ పరీక్ష బ్రహ్మోస్ కార్యక్రమాన్ని పురోగమనంలో ఒక ప్రధాన మైలు రాయి. అత్యంత విన్యాసాలు చేయగల క్షిపణి దాని గరిష్ట పరిధికి అనుగుణంగా సూపర్‌సోనిక్ వేగంతో ప్రయాణించి మిషన్ లక్ష్యాలను నెరవేర్చింది. ఈ క్షిపణి అత్యంత ఆధునిక దేశీయ సాంకేతికతలతో, మరింత సమర్ధవంతమైన, మెరుగైన పనితీరు కోసం సవరించిన నిర్దేశిత పథాన్ని అనుసరించింది. మరింత సామర్ధ్యాన్ని సాధించేందుకు క్షిపణిలో నియంత్రణ వ్యవస్థను సవరించారు. తూర్పు ప్రాంతం, డౌన్ రేంజ్ ఓడల వ్యాప్తంగా టెలిమెట్రీ, రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థలు సహా రేంజ్ ఇనిస్ట్రుమెంటేషన్ల రాడార్లు అన్నీ ఈ క్షిపణి పరీక్షను పర్యవేక్షించాయి.
ఈ పరీక్షలో డిఆర్‌డిఒ, రష్యాకు చెందిన ఎన్‌పిఒఎం బృందాలు పాల్గొన్నాయి. డిఆర్‌డిఒ, ఎన్‌పిఒఎం, రష్యా ఉమ్మడి వెంచర్ అయిన బ్రహ్మోస్ ఎయిరోస్పేస్,, సముద్ర, ఉపరితల లక్ష్యాలను ఛేదించేందుకు శక్తివంతమైన, అత్యంత బహుముఖీయమైన బ్రహ్మోస్ సామర్ధ్యాన్ని పెంచేందుకు నిరంతరం దానిని ఆధునీకరిస్తున్నారు. శక్తిమంతమైన క్షిపణి ఆయుధ వ్యవస్థ అయిన బ్రహ్మోస్‌ను సాయుధ దళాలలోకి చేర్చడం జరిగింది.
విజయవంతమైన క్షిపణి పరీక్షలను నిర్వహించిన బ్రహ్మోస్, డిఆర్‌డిఒ బృందాలను, పరిశ్రమను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.
రక్షణ శాఖ ఆర్& డి కార్యదర్శి, డిఆర్‌డిఒ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి, ఆయుధ వ్యవస్థల సామర్ధ్యాన్ని గరిష్టం చేసేందుకు నిరంతరం కృసి చేస్తూ, దేశీయ సాంకేతికతలపై దృష్టి పెడుతున్న శాస్త్రవేత్తలను ప్రశంసించారు. బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్ శ్రీ అతుల్ డి రాణె ఈ పరీక్షలో నిమగ్రమైన ఎన్‌పిఒఎం, రష్యా, డిఆర్‌డిఒ ఉమ్మడి బృందాలను అభినందించారు.
***
(Release ID: 1791343)
Visitor Counter : 236