ప్రధాన మంత్రి కార్యాలయం

‘ఆజాదీ కె అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కీ ఓర్’యొక్క జాతీయ ప్రారంభ కార్యక్రమం లో కీలకోపన్యాసాన్ని ఇచ్చిన ప్రధాన మంత్రి


బ్రహ్మ కుమారీస్ తాలూకు ఏడుకార్యక్రమాల ప్రారంభించిన ప్రధాన మంత్రి

ఆలోచనమరియు వైఖరి సరికొత్తవిగా ఉన్నటువంటి మరియు నిర్ణయాలు క్రమాభివృద్ధి సహితంగాఉన్నటువంటి భారతదేశం ఆవిర్భావానికి మనం సాక్షులు గా ఉన్నాం’’

‘‘భేదభావానికి తావు లేనటువంటి ఒక వ్యవస్థ ను ప్రస్తుతం మనం ఆవిష్కరిస్తున్నాం, సమానత్వం మరియుసామాజిక న్యాయం అనే పునాదుల మీద దృఢం గా నిలబడ్డ ఒక సంఘాన్ని మనం నిర్మిస్తున్నాం’’

‘‘ప్రపంచం చిమ్మచీకటి లో మగ్గుతూ,  మహిళల విషయం లో పాతవైనఆలోచన విధానాల లో చిక్కుకుపోయి ఉన్నటువంటి కాలం లో భారతదేశం మహిళల ను మాతృ శక్తిగా, దేవత గా ఆరాధించేది’’

‘‘అమృతకాలం అంటే నిద్రపోతూ కలలు గనడం కాదు, మన సంకల్పాల ను నిశ్చితం గా నెరవేర్చుకోవడంకోసం ఉద్దేశించినటవంటిది.  రాబోయే 25 సంవత్సరాలుఅత్యంత కఠోర శ్రమ, త్యాగం మరియు తపస్సు ల కాలం. ఈ పాతికేళ్ల కాలం- మన సంఘం బానిసత్వం లో గడిపిన వందల కొద్దీ సంవత్సరాలలో కోల్పోయిన దాన్నంతటి నితిరిగి సాధించుకోవడానికి ఉద్దేశించిన కాలం- సుమా.’’

దేశం లోప్రతి ఒక్కరి గుండె లో ఒక దివ్వె ను మనమంతా తప్పక వెలిగించాలి- అదే కర్తవ్య దీపం. కలసికట్టుగా మనం దేశాన్ని కర్తవ్యపథం లో ముందుకు తీసుకుపోదాం; అప్పుడు సంఘం లో వ్యాపించిన చెడులను తొలగించడం సాధ్యపడి దేశం కొత్త శిఖరాల నుఅందుకోగలుగుతుంది’’

‘‘ప్రస్తుతం, మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకొంటున్న ఈ కాలం లోప్రపంచం భారతదేశాన్ని గురించి సరి అయిన రీతి లో తెలుసుకొనేటట్టు చేయడం కూడా మనబాధ్యతే’’

Posted On: 20 JAN 2022 12:57PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘ఆజాదీ కే అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కీ ఓర్’ జాతీయ ప్రారంభ కార్యక్రమం లో ప్రధానోపన్యాసాన్ని ఇచ్చారు. ఆయన బ్రహ్మ కుమారీస్ యొక్క ఏడు కార్యక్రమాల కు జెండా ను కూడా చూపెట్టారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్ లా, రాజస్థాన్ గవర్నర్ శ్రీ కల్ రాజ్ మిశ్ర, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గహ్ లోత్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రులు శ్రీ జి. కిషన్ రెడ్డి, శ్రీ భూపేందర్ యాదవ్, శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్, శ్రీ పర్ శోత్తమ్ రూపాలా, ఇంకా శ్రీ కైలాస్ చౌధరి తదితరులు ఉన్నారు.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, బ్రహ్మ కుమారీ సంస్థ ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుక లో స్వర్ణ భారతదేశం కోసం ప్రేరణ ను, ఉత్సాహాన్ని, అనుభూతి ని దృష్టాంతం గా వివరిస్తోందన్నారు. వ్యక్తిగత ఆకాంక్ష లకు, సాఫల్యాల కు మధ్య ఎలాంటి భేదం లేదని, అలాగే జాతీయ ఆకాంక్షల కు మరియు సాఫల్యాల కు మధ్య కూడా ఎలాంటి భేదం లేదు అని ప్రధాన మంత్రి అన్నారు. దేశ ప్రజల పురోగతి లోనే మన క్రమాభివృద్ధి ఇమిడివుంటుందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ‘‘దేశం యొక్క అస్తిత్వం మన నుంచే వస్తుంది, మరి మనం దేశం ద్వారానే ఉనికి లోకి వస్తాం. ఈ గ్రహింపు ఒక న్యూ ఇండియా నిర్మాణం లో మన భారతీయుల యొక్క అతి ప్రధానమైనటువంటి బలం గా మారుతున్నది. దేశం ప్రస్తుతం చేస్తున్న ప్రతి దానిలోనూ సబ్ కా ప్రయాస్కలిసి ఉంది’’ అని ఆయన అన్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్అనేది దేశానికి దారి ని చూపే ధర్మసూత్రం గా మారుతున్నది అని కూడా ఆయన వివరించారు.

 

న్యూ ఇండియా యొక్క సరికొత్తదైనటువంటి మరియు క్రమాభివృద్ధి తో కూడుకొన్నటువంటి నూతన ఆలోచనల సరళి ని గురించి, నవీన వైఖరి ని గురించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, ‘‘ప్రస్తుతం మనం భేదభావానికి తావు లేనటువంటి ఒక వ్యవస్థ ను సృష్టిస్తున్నాం, మనం సమానత్వం, ఇంకా సామాజిక న్యాయం అనే పునాది మీద దృఢం గా నిలబడివుండేటటువంటి ఒక సంఘాన్ని నిర్మిస్తున్నాం’’ అన్నారు.

 

మహిళల ను ఆదరించేటటువంటి మరియు మహిళల కు ప్రాముఖ్యాన్ని ఇచ్చేటటువంటి భారతదేశం సంప్రదాయాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచం చిమ్మ చీకటి లో మగ్గుతూ మహిళల విషయం లో పాతదైనటువంటి ఆలోచన విధానాన్ని అనుసరిస్తున్నప్పుడు, ఆ కాలం లోనే భారతదేశం మహిళల ను మాతృ శక్తి గాను, దేవత గాను పూజిస్తూ వచ్చింది. మన దేశం లో గార్గి, మైత్రేయి, అనుసూయ, అరుంధతి మరియు మదాలస వంటి విదుషీమణులు సంఘానికి జ్ఞ‌ానాన్ని ఇస్తూ వచ్చారు’’ అని ఆయన అన్నారు. భారతదేశ చరిత్ర తాలూకు వేరు వేరు యుగాల లో ప్రశంసాయోగ్యమైనటువంటి మహిళ ల తోడ్పాటు ను గురించి ఆయన తెలిపారు. మధ్యయుగం నాటి కష్ట కాలాల్లో, పన్నా ధాయి ఇంకా మీరాబాయి ల వంటి మహనీయమైన మహిళలు ఈ దేశం లో ఉండే వారు అని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకువచ్చారు. స్వాతంత్ర్య పోరాట కాలంలో సైతం, అనేక మంది మహిళ లు త్యాగాలు చేశారు అని ఆయన అన్నారు. కిత్తూరు కు చెందిన రాణి చెన్నమ్మ, మాతంగిని హజరా, రాణి లక్ష్మిబాయి, వీరాంగన ఝల్ కారి బాయి మొదలుకొని, సామాజిక రంగం లో అహిల్యాబాయి హోల్కర్ మరియు సావిత్రిబాయి ఫులే లు భారతదేశం యొక్క గుర్తింపు ను పరిరక్షించారు అని ఆయన వివరించారు. సాయుధ దళాల్లోకి బహిళల ప్రవేశం, మరిన్ని ప్రసూతి సెలవులు, మరింత ఎక్కువ మంది వోట్లు వేయడం, ఇంకా మంత్రిమండల లో ప్రాతినిధ్యం వంటి రూపాల లో రాజకీయ రంగం లో మెరుగైన ప్రాతినిధ్యం వంటివి మహిళల్లో నూతన ఆత్మవిశ్వాసానికి ఒక సంకేతం గా నిలచాయి అని ఆయన అన్నారు. ఈ ఉద్యమం సమాజ ప్రధానమైంది గా ఉండడం తో పాటు దేశం లో ఆడ మగ నిష్పత్తి మెరుగుపడటం పట్ల ఆయన సంతృప్తి ని వ్యక్తం చేశారు.

 

మన సంస్కృతి ని, మన నాగరకత ను, మన విలువల ను సజీవం గా అట్టిపెట్టవలసిందంటూను, మన ఆధ్యాత్మికత ను పరిరక్షించవలసింది గాను, మన వైవిధ్యాన్ని ప్రోత్సహించవలసిందిగాను ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. అదే కాలం లో, సాంకేతిక విజ్ఞ‌ానం, మౌలిక సదుపాయాల కల్పన, విద్య మరియు వైద్యం వ్యవస్థల ను అదే పని గా ఆధునికీకరిస్తూ ఉండవలసిన అవసరం ఎంతయినా ఉంది అని ఆయన స్పష్టంచేశారు.

 

‘‘అమృత కాలం అనేది నిద్రిస్తూ కలలు కనడం కోసం కాదు, అంతకంటే అది మనం జాగ్రదావస్థ లోనే ఉండి సంకల్పాల ను నెరవేర్చుకోవలసిన కాలం అని ప్రధాన మంత్రి తెలియజేశారు. రాబోయే 25 సంవత్సరాలు అత్యంత కఠోర శ్రమ, త్యాగం మరియు తపస్సు ల కాలం. ఈ పాతికేళ్లు మన సంఘం వందల కొద్దీ సంవత్సరాల బానిసతనం లో కోల్పోయినదానిని మనం మళ్లీ సాధించుకొనే కాలం’’ అని ఆయన అన్నారు.

 

స్వాతంత్ర్యం తరువాతి 75 సంవత్సరాల లో విధుల ను పట్టించుకోని పాపం, విధుల ను అన్నిటికంటే మిన్న గా భావించని దోషం జాతీయ జీవనం లోకి చొరబడింది అనే విషయాన్ని ఒప్పుకొని తీరవలసిందే అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కాలం లో, మనం హక్కుల ను గురించి మాట్లాడుకొంటూ, పోట్లాడుకొంటూనే సమయాన్ని గడిపేశాం అని ఆయన అన్నారు. హక్కుల ను గురించిన సంభాషణ కొంత వరకు సరి అయినదే కావచ్చు, కొన్ని పరిస్థితుల లో అయితే ఒకరి విధుల ను పూర్తి గా మరచిపోవడం అనేది భారతదేశాన్ని బలహీనంగా మార్చివేయడం లో ఒక పెద్ద పాత్ర ను పోషించింది అని ఆయన ఉద్ఘాటించారు. దేశం లో ప్రతి ఒక్క వ్యక్తి గుండె లో ఒక దివ్వె ను వెలిగించండి - అదే కర్తవ్యం అనేటటువంటి దీపం. మనం అందరం కలసికట్టు గా, దేశాన్ని కర్తవ్య మార్గం లోకి ముందుకు తీసుకుపోదాం. అప్పుడు సంఘం లో ఉన్న చెడులు అన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది మరి దేశం కొత్త శిఖరాల కు చేరుకొంటుంది.’’ అని అందరి కి ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

 

భారతదేశం యొక్క ప్రతిష్ట ను, అంతర్జాతీయ స్థాయి లో సైతం ధ్వంసం చేసే ధోరణి పట్ల ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఇవి కేవలం రాజకీయాలే అని అంటూ దీని నుంచి మనం తప్పించకోలేం. ఇవి రాజకీయాలు కాదు, ఇది మన దేశానికి సంబంధించిన ప్రశ్న. ప్రస్తుతం, మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకొంటున్న కాలం లో, భారతదేశాన్ని గురించి ప్రపంచ దేశాలు సరి అయిన రీతి లో తెలుసుకొనేటట్టు చూడటం కూడా మన బాధ్యత గా ఉన్నది’’ అంటూ ఆయన మనసు కు హత్తుకొనేటట్టు చెప్పారు. అంతర్జాతీయ ఉనికి కలిగివున్నటువంటి సంస్థ లు ఇతర దేశాల ప్రజల కు భారతదేశం తాలూకు సరి అయినటువంటి చిత్రాన్ని చూపగలగాలి; మరి అంతే కాదు, భారతదేశాన్ని గురించి వ్యాపింపచేస్తున్నటువంటి వదంతుల ను గురించిన వాస్తవాన్ని తెలియజెప్పాలి అని సూచిస్తూ తన ఉపన్యాసాన్ని ప్రధాన మంత్రి ముగించారు. భారతదేశాని కి విచ్చేసి ఈ దేశాన్ని గురించి తెలుసుకోండి అంటూ ప్రజల ను ప్రోత్సహించాలి అంటూ బ్రహ్మ కుమారీస్ వంటి సంస్థల కు ఆయన విజ్ఞ‌ప్తి చేశారు.

ब्रह्मकुमारी संस्था के द्वारा ‘आज़ादी के अमृत महोत्सव से स्वर्णिम भारत की ओर’, कार्यक्रम की शुरुआत हो रही है।

इस कार्यक्रम में स्वर्णिम भारत के लिए भावना भी है, साधना भी है।

इसमें देश के लिए प्रेरणा भी है, ब्रह्मकुमारियों के प्रयास भी हैं: PM @narendramodi

— PMO India (@PMOIndia) January 20, 2022

राष्ट्र की प्रगति में ही हमारी प्रगति है।

हमसे ही राष्ट्र का अस्तित्व है, और राष्ट्र से ही हमारा अस्तित्व है।

ये भाव, ये बोध नए भारत के निर्माण में हम भारतवासियों की सबसे बड़ी ताकत बन रहा है।

आज देश जो कुछ कर रहा है उसमें ‘सबका प्रयास’ शामिल है: PM @narendramodi

— PMO India (@PMOIndia) January 20, 2022

आज हम एक ऐसी व्यवस्था बना रहे हैं जिसमें भेदभाव की कोई जगह न हो,

एक ऐसा समाज बना रहे हैं, जो समानता औऱ सामाजिक न्याय की बुनियाद पर मजबूती से खड़ा हो,

हम एक ऐसे भारत को उभरते देख रहे हैं, जिसकी सोच और अप्रोच नई है, और जिसके निर्णय प्रगतिशील हैं: PM @narendramodi

— PMO India (@PMOIndia) January 20, 2022

दुनिया जब अंधकार के गहरे दौर में थी, महिलाओं को लेकर पुरानी सोच में जकड़ी थी, तब भारत मातृशक्ति की पूजा, देवी के रूप में करता था।

हमारे यहाँ गार्गी, मैत्रेयी, अनुसूया, अरुंधति और मदालसा जैसी विदुषियाँ समाज को ज्ञान देती थीं: PM @narendramodi

— PMO India (@PMOIndia) January 20, 2022

कठिनाइयों से भरे मध्यकाल में भी इस देश में पन्नाधाय और मीराबाई जैसी महान नारियां हुईं।

और अमृत महोत्सव में देश जिस स्वाधीनता संग्राम के इतिहास को याद कर रहा है, उसमें भी कितनी ही महिलाओं ने अपने बलिदान दिये हैं: PM @narendramodi

— PMO India (@PMOIndia) January 20, 2022

कित्तूर की रानी चेनम्मा, मतंगिनी हाजरा, रानी लक्ष्मीबाई, वीरांगना झलकारी बाई से लेकर सामाजिक क्षेत्र में अहल्याबाई होल्कर और सावित्रीबाई फुले तक, इन देवियों ने भारत की पहचान बनाए रखी: PM @narendramodi

— PMO India (@PMOIndia) January 20, 2022

हमें अपनी संस्कृति, अपनी सभ्यता, अपने संस्कारों को जीवंत रखना है,

अपनी आध्यात्मिकता को, अपनी विविधता को संरक्षित और संवर्धित करना है,

और साथ ही, टेक्नोलॉजी, इनफ्रास्ट्रक्चर, एजुकेशन, हेल्थ की व्यवस्थाओं को निरंतर आधुनिक भी बनाना है: PM @narendramodi

— PMO India (@PMOIndia) January 20, 2022

अमृतकाल का ये समय, सोते हुए सपने देखने का नहीं बल्कि जागृत होकर अपने संकल्प पूरे करने का है।

आने वाले 25 साल, परिश्रम की पराकाष्ठा, त्याग, तप-तपस्या के 25 वर्ष हैं।

सैकड़ों वर्षों की गुलामी में हमारे समाज ने जो गंवाया है, ये 25 वर्ष का कालखंड, उसे दोबारा प्राप्त करने का है: PM

— PMO India (@PMOIndia) January 20, 2022

हमें ये भी मानना होगा कि आजादी के बाद के 75 वर्षों में, हमारे समाज में, हमारे राष्ट्र में, एक बुराई सबके भीतर घर कर गई है।

ये बुराई है, अपने कर्तव्यों से विमुख होना, अपने कर्तव्यों को सर्वोपरि ना रखना: PM @narendramodi

— PMO India (@PMOIndia) January 20, 2022

बीते 75 वर्षों में हमने सिर्फ अधिकारों की बात की, अधिकारों के लिए झगड़े, जूझे, समय खपाते रहे।

अधिकार की बात, कुछ हद तक, कुछ समय के लिए, किसी एक परिस्थिति में सही हो सकती है लेकिन अपने कर्तव्यों को पूरी तरह भूल जाना, इस बात ने भारत को कमजोर रखने में बहुत बड़ी भूमिका निभाई है: PM

— PMO India (@PMOIndia) January 20, 2022

हम सभी को, देश के हर नागरिक के हृदय में एक दीया जलाना है- कर्तव्य का दीया।

हम सभी मिलकर, देश को कर्तव्य पथ पर आगे बढ़ाएंगे, तो समाज में व्याप्त बुराइयां भी दूर होंगी और देश नई ऊंचाई पर भी पहुंचेगा: PM @narendramodi

— PMO India (@PMOIndia) January 20, 2022

आप सभी इस बात के साक्षी रहे हैं कि भारत की छवि को धूमिल करने के लिए किस तरह अलग-अलग प्रयास चलते रहते हैं।

इसमें अंतरराष्ट्रीय स्तर पर भी बहुत कुछ चलता रहता है।

इससे हम ये कहकर पल्ला नहीं झाड़ सकते कि ये सिर्फ राजनीति है।

ये राजनीति नहीं है, ये हमारे देश का सवाल है: PM

— PMO India (@PMOIndia) January 20, 2022

जब हम आजादी का अमृत महोत्सव मना रहे हैं तो ये भी हमारा दायित्व है कि दुनिया भारत को सही रूप में जाने: PM @narendramodi

— PMO India (@PMOIndia) January 20, 2022

ऐसी संस्थाएं जिनकी एक अंतरराष्ट्रीय उपस्थिति है, वो दूसरे देशों के लोगों तक भारत की सही बात को पहुंचाएं, भारत के बारे में जो अफवाहें फैलाई जा रही हैं, उनकी सच्चाई वहां के लोगों को बताएं, उन्हें जागरूक करें, ये भी हम सबका कर्त्तव्य है: PM @narendramodi

— PMO India (@PMOIndia) January 20, 2022

***

DS/AK

 

 (Release ID: 1791207) Visitor Counter : 259