ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎన్ డిఆర్ఎఫ్ స్థాపన దినం నాడు ఆ బృందాని కి అభినందన లు తెలియజేసిన ప్రధాన

Posted On: 19 JAN 2022 10:08AM by PIB Hyderabad

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్ డిఆర్ఎఫ్) స్థాపన దినం సందర్భం లో ఎన్ డిఆర్ఎఫ్ బృందాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -

‘‘కష్టపడి పనిచేసే @NDRFHQ బృందాని కి వారి స్థాపన దినం నాడు ఇవే అభినందన లు. తరచు గా చాలా సవాళ్ళ తో కూడుకొన్నటువంటి స్థితుల లో వారు అనేక రక్షణ కార్యకలాపాలలోను, సహాయక చర్యల లోను అగ్రభాగాన నిలబడుతున్నారు. ఎన్ డిఆర్ఎఫ్ యొక్క ధైర్యం, సాహసం మరియు వృత్తి నైపుణ్యం అమితమైన ప్రేరణ ను ఇచ్చేవి గా ఉన్నాయి. వారి భావి ప్రయాసల లో సైతం వారు రాణించుదురు గాక.

 

వైపరీత్యాల నిర్వహణ అనేది ప్రభుత్వాల కు, విధాన రూపకర్తల కు ఒక ప్రధానమైనటువంటి విషయం గా ఉంది. ప్రతిక్రియాశీల వైఖరి కి తోడు, ఎక్కడయితే విపత్తు లు సంభవించిన తరువాతి కాలం లో ఎదురయ్యే స్థితి ని విపత్తు నిర్వహణ బృందాలు ఉపశమనింప చేస్తాయో, మనం విపత్తు కు ఎదురొడ్డి నిలచే తరహా మౌలిక సదుపాయాల కల్పన ను గురించి ఆలోచించితీరాలి; అలాగే, ఈ విషయం లో పరిశోధన మీద కూడాను శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది

 

‘కొయలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్’ రూపం లో ఒక ప్రయత్నాన్నంటూ భారతదేశం చేపట్టింది. మన ఎన్ డిఆర్ఎఫ్ బృందాల యొక్క నైపుణ్యాల ను మరింత గా పెంచుకొనే దిశ లో కూడా మనం కృషి చేస్తున్నాం. దీని ద్వారా, ఏదైనా సవాలు ఎదురైనప్పుడు గరిష్ఠ సంఖ్య లో ప్రాణాల ను, అలాగే సంపత్తి ని మనం కాపాడ గలుగుతాం.’’ అని పేర్కొన్నారు.

***


(Release ID: 1790936) Visitor Counter : 198