ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

ప్రసిద్ధకథక్ నర్తకుడు పండిత్ శ్రీ బిర్ జూ మహారాజ్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి  

Posted On: 17 JAN 2022 9:50AM by PIB Hyderabad

ప్రసిద్ధ కథక్ నర్తకుడు పండిత్ శ్రీ బిర్ జూ మహారాజ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు. ఆయన నిష్క్రమణ యావత్తు కళా జగతి కి ఒక భర్తీ చేయలేనటువంటి లోటు అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘భారతీయ నృత్య‌ కళ కు ప్రపంచం అంతటా విశిష్టమైన గుర్తింపు దక్కేటట్టు చేసిన పండిత్ శ్రీ బిర్ జూ మహారాజ్ గారు కన్నుమూశారని తెలిసి అమిత దు:ఖం కలిగింది. ఆయన నిష్క్రమణ సంపూర్ణ కళా జగతి కే భర్తీ చేయలేనటువంటి ఒక లోటు. ఈ శోక ఘడియ లో ఆయన సంబంధికుల కు మరియు ఆయన అభిమాన వర్గాల కు కలిగిన దు:ఖం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 (Release ID: 1790446) Visitor Counter : 155