ప్రధాన మంత్రి కార్యాలయం

జనవరి 17న డబ్ల్యుఇఎఫ్ తాలూకు దావోస్ అజెండా లో ‘స్టేట్ ఆఫ్ ద వరల్డ్’ పై ప్రత్యేక ప్రసంగం ఇవ్వనున్న ప్రధాన మంత్రి

Posted On: 16 JAN 2022 7:07PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 17వ తేదీ నాడు భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల 30 నిమిషాల కు వరల్డ్ ఇకానామిక్ ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) యొక్క దావోస్ అజెండా లో వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ‘ప్రపంచం యొక్క వర్తమాన స్థితి’ (స్టేట్ ఆఫ్ ద వరల్డ్) పై ప్రత్యేక ప్రసంగాన్ని ఇవ్వనున్నారు.

 

 కార్యక్రమాన్ని వర్చువల్ పద్ధతి లో 2022వ సంవత్సరం జనవరి 17వ తేదీ నాటి నుంచి 21వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. అనేక మంది ప్రభుత్వాల అధినేత లు కూడా ఈ కార్యక్రమం లో ప్రసంగించనున్నారు. వారి లో జపాన్ ప్రధాని శ్రీ కిశిదా ఫుమియో, యూరోపియన్ కమిశన్ అధ్యకురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్, ఇండొనేశియా అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో, ఇజ్ రాయిల్ ప్రధాని శ్రీ నఫ్తాలీ బెనెట్, పీపల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షడు శ్రీ శీ జిన్ పింగ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమం లో పరిశ్రమ రంగానికి, అంతర్జాతీయ సంస్థల కు మరియు పౌర సమాజానికి చెందిన ప్రముఖులు కూడా పాలుపంచుకోనున్నారు. వారు ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైన సవాళ్ల ను గురించి చర్చోపచర్చలు జరపనున్నారు; ఆ సవాళ్ల ను పరిష్కరించడం కోసం ఎటువంటి పద్ధతుల ను అనుసరించాలో కూడా వారు చర్చిస్తారు.

 

***



(Release ID: 1790389) Visitor Counter : 164