యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో తాజా ఎస్ఓపీని జారీ చేసిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా

Posted On: 06 JAN 2022 3:25PM by PIB Hyderabad

ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా విపరీతమైన పెరుగుతున్న కోవిడ్ కేసులను  ఎదుర్కొనేందుకు 'స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' తాజాగా  'స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌' (ఎస్ఓపీని )తో ముందుకు వచ్చింది. ఈ తాజా చర్యలు వివిధ 'నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌' (ఎన్‌సీఓఈ)తో పాటు ప్ర‌స్తుతం కొనసాగుతున్న జాతీయ కోచింగ్ క్యాంపులలో క‌చ్చితంగా అమలు చేయబడతాయి.
శిక్షణా కేంద్రాలకు చేరుకున్న తర్వాత అథ్లెట్లందరూ తప్పనిసరిగా 'రాపిడ్ యాంటిజెన్ టెస్ట్స‌ (రాట్‌) చేయించుకుంటారు. పరీక్ష నెగెటీవ్ ఫ‌లితం వస్తే.. చేరిన రోజు నుంచి ఆరో రోజు వరకు విడివిడిగా శిక్షణ పొంది భోజనం చేస్తారు. 5వ రోజున మ‌రోసారి రాట్ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష‌లో పాజిటివ్ రిజ‌ల్ట్ వ‌చ్చిన వారికి ఆర్‌టీపీసీఆర్ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు. వీరికి ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తారు, అయితే ఈ ప‌రీక్ష‌లో నెగ‌టీవ్ ఫ‌లితం వ‌చ్చిన అథ్లెట్ల‌కు సాధారణ శిక్షణను కొనసాగిస్తారు. శిబిరాల్లో కోవిడ్ పాజిటివ్ ఫ‌లితం లేదా సింప్టోమాటిక్ అథ్లెట్ల కోసం సరైన ఐసోలేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేయ‌బ‌డినాయి.  సౌకర్యాలు రోజుకు రెండుసార్లు శానిటైజ్ చేయబడతాయి. మైక్రో బయో-బబుల్ కూడా ఉంటుంది, ఇక్కడ అథ్లెట్లు శిక్షణ, భోజనాల కోసం చిన్న‌ సమూహాలుగా విభజించబడతారు. అథ్లెట్లు ఇతర సమూహాలతో సంభాషించకుండా ఉండాలని కూడా క‌చ్చితంగా కోరారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎన్‌సీఓఈలోని అథ్లెట్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, నివాసేతర సిబ్బందికి యాదృచ్ఛిక‌మైన‌ పరీక్ష కూడా ఉంటుంది. సంబంధిత జాతీయ క్రీడా సమాఖ్యలు (ఎన్ఎస్ఎఫ్‌లు) మరియు శాయి ప్ర‌ధాన కార్యాల‌య అధికారులు సిఫార్సు చేసిన పోటీల్లో మాత్రమే క్రీడాకారులు పాల్గొనాలని కూడా సిఫార్సు చేయబడింది. ఆహ్వాన టోర్నమెంట్‌లు, ఒలింపికేత‌ర‌ క్వాలిఫైయింగ్ ఈవెంట్ ల కోసం, ఎన్‌సీఓఈల సంబంధిత ప్రాంతీయ డైరెక్టర్లు (ఆర్‌డీలు) సిఫార్సులు చేస్తారు.సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు నిర్దిష్ట రాష్ట్రాలు జారీ చేసి నిబంధ‌న‌లు ఈ ఎస్లఓపీల‌ను అద‌నంగా ఉంటాయి.
                                                                                               

*******



(Release ID: 1788246) Visitor Counter : 137