మంత్రిమండలి
కస్టమ్స్ అంశాలలో పరస్పర సహకారానికి ఇండియా-స్పెయిన్ ల మధ్య ఒప్పందానికి కేబినెట్ ఆమోదం
Posted On:
06 JAN 2022 4:29PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ , కస్టమ్స్ అంశాలలో సహకారం, పరస్పర సహాయానికి సంబంధించి ఇండియా- స్పెయిన్ ల మధ్య ఒప్పందానికి ఆమోదం తెలిపింది.
ప్రయోజనాలు :
ఈ ఒప్పందం, నమ్మకమైన సత్వర, ఖర్చు లేని సమాచారాన్ని, నిఘా సమాచారాన్ని కస్టమ్స్ నేరాల దర్యాప్తు, నిరోధానికి అందుబాటులోకి తెచ్చేందుకు , కస్టమ్స్ నేరస్థులను పట్టుకునేందుకు వీలు కల్పిస్తుంది.
ఈ ఒప్పందం ఇరు దేశాల కస్టమ్స్ అధికారుల మధ్య సమాచారాన్నిఅందుకునేందుకు అవసరమైన చట్టపరమైన ఏర్పాటుకు వీలు కల్పిస్తుంది. ఇది కస్టమ్స్ చట్టాలను తగిన విధంగా అమలు చేయడానికి, గుర్తించడానికి, కస్టమ్స్ నేరాలను దర్యాప్తు చేయడానికి, చట్టబద్దమైన వ్యాపారానికి వీలుకల్పించడానికి దోహదపడుతుంది.
ఈ ఒప్పందలో కింది ప్రొవిజన్లు ఉన్నాయి.
1)కస్టమ్స్ సుంకాలను కచ్చితంగా అసెస్ చేయడం, ప్రత్యేకించి కస్టమ్స్ విలువను నిర్ధారించడానికి సంబంధించి సమాచారం, టారిఫ్ వర్గీకరణ, ఇరుదేశాల మధ్య ట్రేడ్ అయ్యే వస్తువుల మూల తయారీ ప్రదేశం తదితర అంశాలను కచ్చితంగా అంచనా వేయడానికి వీలు కలుగుతుంది.
2) ఏదైనా డిక్లరేషన్‌కు సంబంధించి సమర్పించే డాక్యుమెంట్ సరైనదా కాదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ( సర్టిఫికెట్ ఎక్కడిది, ఇన్ వాయిస్, తదితరాలు )
3) కింద పేర్కొన్న అక్రమ రవాణాకు సంబంధించి కస్టమ్స్ నేరాలు
(ఎ) ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పరికరాలు
(బి)కళలు, పురాతన కళాఖండాలు, చారిత్రక, సాంస్క్రుతిక పురాతత్వ ప్రాధాన్యత కలిగినవి, టాక్సిక్ మెటీరియల్, ఇతర ప్రమాదకర, పర్యావరణానికి ప్రజారోగ్యానికి హానిచేసేవి కస్టమ్స్ సుంకాలు, పన్నులు వేయదగ్గ వస్తువులు
(సి) కస్టమ్స్ చట్టానికి వ్యతిరేకంగా కస్టమ్స్ నేరాలకు పాల్పడేందుకు కొత్త పద్ధతులకు పాల్పడడం వంటివి ఉన్నాయి.
***
(Release ID: 1788160)
Visitor Counter : 255
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam