ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కోల్ కాతా లో ‘చిత్తరంజన్ నేశనల్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్’ కు చెందిన రెండో ఆవరణ ను జనవరి 7న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి


కేన్సర్ రోగుల కు, ప్రత్యేకించి దేశం లోని తూర్పు ప్రాంతాల కు మరియుఈశాన్య ప్రాంతాల కు చెందిన కేన్సర్ రోగుల కు సంపూర్ణ సంరక్షణ ను ఈ ఆవరణఅందించనుంది

దేశవ్యాప్తం గా ఆరోగ్య సదుపాయాల ను విస్తరించాలన్న మరియు వాటిని ఉన్నతీకరించాలన్నప్రధాన మంత్రి దార్శనికత కు అనుగుణం గా ఈ చర్య ఉంది

Posted On: 06 JAN 2022 11:42AM by PIB Hyderabad

కోల్ కాతా లో చిత్తరంజన్ నేశనల్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ (సిఎన్ సిఐ)కి చెందిన రెండో ఆవరణ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 వ సంవత్సరం జనవరి 7వ తేదీ న మధ్యాహ్నం ఒంటి గంట వేళ కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు.

దేశవ్యాప్తం గా ఆరోగ్య రంగ సదుపాయాల ను విస్తరించాలన్న, అలాగే వాటి ని ఉన్నతీకరించాలన్న ప్రధాన మంత్రి దృష్టి కోణాని కి అనుగుణం గా ఈ సిఎన్ సిఐ లో రెండో ఆవరణ ను నిర్మించడం జరిగింది. సిఎన్ సిఐ కి కేన్సర్ రోగులు భారీ సంఖ్య లో వస్తున్నారు. దీనితో ఈ సంస్థ ను విస్తరించవలసిన అవసరం ఉందన్న భావన గత కొంత కాలం గా ఉంటోంది. ఈ అవసరాన్ని రెండో కేంపస్ ద్వారా తీర్చినట్లు అవుతుంది.

సిఎన్ సిఐ రెండో ఆవరణ ను 530 కోట్ల రూపాయల కు పై చిలుకు ఖర్చు తో నిర్మించడమైంది. ఈ సొమ్ము లో 75:25 నిష్పత్తి లో, దాదాపుగా 400 కోట్ల రూపాయల ను కేంద్ర ప్రభుత్వం అందించగా మిగిలిన సొమ్ము ను పశ్చిమ బంగాల్ ప్రభుత్వం సమకూర్చింది. ఈ కేంపస్ లో 460 పడకల తో సంపూర్ణ కేన్సర్ సెంటర్ యూనిట్ ను కేన్సర్ రోగ నిర్ధారణ, స్టేజింగ్, వైద్య చికిత్స, ఇంకా సంరక్షణ లకు సంబంధించిన అత్యంత ఆధునికమైనటువంటి మౌలిక సదుపాయాల హంగుల తో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆవరణ లో న్యూక్లియర్ మెడిసిన్ (పిఇటి), 3.0 టెస్ లా ఎమ్ఆర్ఐ, 128 స్లైస్ సిటి స్కానర్, రేడియో న్యూక్లైడ్ థెరపీ యూనిట్, ఎండోస్కోపీ స్వీట్, ఆధునిక బ్రాంకిథెరపీ యూనిట్ లు వగైరా సౌకర్యాల ను సమకూర్చారు. ఈ కేంపస్ అధునాతన కేన్సర్ పరిశోధన సదుపాయం గా కూడా పని చేస్తుంది. ఇది కేన్సర్ రోగుల కు, ప్రత్యేకించి దేశం లోని తూర్పు ప్రాంతాలు మరియు ఈశాన్య ప్రాంతాల నుంచి వచ్చే కేన్సర్ రోగుల కు సంపూర్ణ సంరక్షణ ను అందించనుంది.

 

***


(Release ID: 1787941) Visitor Counter : 193