ప్రధాన మంత్రి కార్యాలయం

జర్మనీ చాన్స్ లర్ మాన్య శ్రీ ఓలాఫ్ శోల్జ్ తో ఫోన్‌ లో మాట్లాడిన ప్రధాన మంత్రి

Posted On: 05 JAN 2022 8:33PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జర్మనీ చాన్స్ లర్ మాన్య శ్రీ ఓలాఫ్ శోల్జ్ తో ఫోన్‌ లో మాట్లాడారు.

ఛాన్సలర్‌ గా పదవీబాధ్యతల ను చేపట్టిన మాన్య శ్రీ ఓలాఫ్ శోల్జ్ కు  ప్రధాన మంత్రి అభినందనలు తెలియజేశారు.  భారతదేశం-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో పూర్వ చాన్స్ లర్ మాననీయురాలు ఎంజెలా మర్కెల్ అందజేసిన విశిష్ట తోడ్పాటు ను  ఆయన ప్రశంసిస్తూ, ఈ సకారాత్మక గతి ని మాన్య శ్రీ ఓలాఫ్ శోల్జ్ నాయకత్వం లో ఇకమీదట కూడా కొనసాగించాలనే వచనబద్ధత ను వ్యక్తం చేశారు. 

జర్మనీ లోని కొత్త ప్రభుత్వం పక్షాన ప్రకటించినటువంటి పాలనపరమైన ప్రాధాన్యాల లోను మరియు భారతదేశం యొక్క ఆర్థిక దృష్టికోణం లోను మహత్వపూర్ణమైన సమన్వయం కనుపిస్తోందనే అంశం పట్ల నేతలు ఇద్దరు  సమ్మతి ని వ్యక్తం చేశారు.  పెట్టుబడి, ఇంకా వ్యాపార సంబంధాల ను పెంచడం సహా కొనసాగుతున్న సహకార కార్యక్రమాల ను సైతం  వారు సమీక్షించారు.  నూతన రంగాల లో ఆదాన ప్రదానా లోను  మరియు సహకారం లో ను ఇకపై వైవిధ్యాన్ని తీసుకు రాగల అవకాశాల విషయం లో  వారు తమ అంగీకారాన్ని వ్యక్తపరిచారు.  విశేషించి, రెండు దేశాలు తమ తమ జలవాయు నిబద్ధతల ను సాధించుకొనేందుకు వీలు ఏర్పడేటట్లగా జలవాయు సంబంధి కార్యకలాపాలలో మరియు హరిత శక్తి రంగం లో సహకారం తాలూకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న అభిలాష ను వారు వ్యక్తం చేశారు.

మాన్య శ్రీ చాన్స్ లర్ శ్రీ ఓలాఫ్ శోల్జ్ కు మరియు జర్మనీ యొక్క ప్రజల కు నూతన సంవత్సర శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి తెలియజేశారు.   దీనితో పాటే ద్వైపాక్షిక అంతర్-ప్రభుత్వ సంప్రదింపుల తాలూకు తదుపరి సమావేశం కోసం గౌరవనీయ చాన్స్ లర్ తో త్వరలో  భేటీ కావడం కోసం తాను ఉత్సాహం తో ఎదురుచూస్తున్నానని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

 

 

 



(Release ID: 1787913) Visitor Counter : 138