ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19: అపోహలు, వాస్తవాలు


- భారత్‌లో గడువు ముగిసిన వ్యాక్సిన్‌లిస్తున్నారన్న‌ మీడియా నివేదికలు స‌త్య‌దూరం, తప్పుదారి పట్టించేవి

- సీడీఎస్‌సీఓ గతంలో కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ల షెల్ఫ్ జీవిత కాలాన్ని వరుసగా 12 నెలలు, 9 నెలలకు పొడిగించడానికి ఆమోదించింది

Posted On: 03 JAN 2022 4:12PM by PIB Hyderabad

భారతదేశంలో జాతీయ కోవిడ్‌-19 టీకా కార్యక్రమం కింద గడువు తీరిన‌ వ్యాక్సిన్‌ల‌ను ఇస్తున్నార‌ని ఆరోపిస్తూ కొన్ని మీడియాల్లో క‌థ‌నాలు వచ్చాయి. ఇది స‌త్య‌దూరం మరియు తప్పుదారి పట్టించేది. అసంపూర్ణ సమాచారం ఆధారంగా ఇలాంటి క‌థ‌నాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. 'సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్' (సీడీఎస్‌సీఓ) 25 అక్టోబర్ 2021న.. మెస్స‌ర్స్‌  భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అందించిన లేక‌ నెం: బీబీఐఎల్‌/ ఆర్ఏ/21/567కి ప్రతిస్పందనగా కోవ్యాక్సిన్‌ (హోల్ విరియన్, ఇన్యాక్టివేటెడ్ కరోనావైరస్ వ్యాక్సిన్) షెల్ఫ్ జీవితాన్ని పొడిగించడానికి ఆమోదించింది. ఈ వ్యాక్సిన్స్ జీవిత కాలాన్ని 9 నెలల నుండి 12 నెలల వరకు. అదేవిధంగా, కోవిషీల్డ్ యొక్క షెల్ఫ్ జీవితాన్ని జాతీయ‌ రెగ్యులేటర్ 22 ఫిబ్రవరి 2021న 6 నెలల నుండి 9 నెలలకు పొడిగించింది. టీకా తయారీదారులు అందించిన స్థిరత్వ అధ్యయన డేటా యొక్క సమగ్ర విశ్లేషణ మరియు పరిశీలన ఆధారంగా నేషనల్ రెగ్యులేటర్ ద్వారా వ్యాక్సిన్‌ల షెల్ఫ్ జీవితాన్ని పొడిగించారు.

***

 



(Release ID: 1787260) Visitor Counter : 180