ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాతా వైష్ణోదేవి భవన్ వద్ద తొక్కిసలాట బాధితులకు ‘పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌’ నుంచి నష్టపరిహారం చెల్లింపునకు ప్రధాని ఆమోదం

Posted On: 01 JAN 2022 12:08PM by PIB Hyderabad

   మాతా వైష్ణోదేవి భవన్ వద్ద తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి నష్ట పరిహారం చెల్లించేందుకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ ద్వారా సమాచారమిస్తూ-

“మాతా వైష్ణోదేవి భవన్‌లో తొక్కిసలాట జరిగి మరణించిన వారి కుటుంబాలకు ‘పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌’ నుంచి తలా రూ.2 లక్షల వంతున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున నష్టపరిహారం అందజేయబడుతుంది: ప్రధానమంత్రి @నరేంద్రమోదీ” అని తెలిపింది.

 

***

DS/SH


(Release ID: 1786805) Visitor Counter : 213