ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తరాఖండ్ లో 17,500 కోట్ల రూపాయల కు పైగా విలువైన 23 పథకాల లో కొన్నింటిని ప్రారంభించి, మరి కొన్నింటికి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి


‘‘ఉత్తరాఖండ్ ప్రజల బలం ఈ దశాబ్దాన్ని ఉత్తరాఖండ్ యొక్క దశాబ్దం గా మార్చనుంది’’

"లఖ్ వాడ్ ప్రాజెక్టు ను గురించి మొదటిసారి గా 1976వ సంవత్సరం లో ఆలోచించడమైంది.  46 సంవత్సరాల అనంతరం ఈ రోజు న, మా ప్రభుత్వంఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల కు శంకుస్థాపన ను చేసింది.  ఈ  జాప్యం అనేది నేరం కంటే తక్కువేమీ కాదు’’

‘‘గతం తాలూకు దగా ను, ఇక్కట్టుల ను ప్రస్తుతం సౌకర్యాల లోకి మరియు సద్భావన లోకి మార్చడం జరుగుతోంది’’

‘‘ప్రస్తుతం,  దిల్లీ మరియ దేహ్ రాదూన్ ప్రభుత్వాలుఅధికార లాలస తో కాక సేవా భావన తో నడుస్తున్నాయి’’

‘‘మీ  స్వప్నాలు మా సంకల్పాలు;  మీ అభిలాష మాకు ప్రేరణ;  ఇంకా మీ యొక్క ప్రతి అవసరాన్ని నెరవేర్చడంమా బాధ్యత గా ఉంది’’

Posted On: 30 DEC 2021 3:28PM by PIB Hyderabad

 

 

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 17,500 కోట్ల రూపాయల పై చిలుకు విలువైనటువంటి 23 పథకాల ను ఈ రోజు న ఉత్తరా ఖండ్ లో అయితే ప్రారంభించడమో లేదా శంకు స్థాపన చేయడమో చేశారు. ఆయన లఖ్ వాడ్ బహుళ ప్రయోజక ప్రాజెక్టు కు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ను తొలుత 1976వ సంవత్సరం లో రూపొందించగా, చాలా ఏళ్ళ పాటు అది పెండింగు పడింది. ఆయన 8700 కోట్ల రూపాయల విలువైన రహదారి రంగ ప్రాజెక్టుల కు సైతం ప్రారంభోత్సవం/శంకుస్థాపన చేశారు. ఈ రహదారి పథకాలు దూర ప్రాంతాల లో, గ్రామీణ ప్రాంతాల లో, ఇంకా సరిహద్దు ప్రాంతాల లో సంధానాన్ని మెరుగు పరచాలన్న ప్రధాన మంత్రి దృష్టి కోణాన్ని ఆచరణాత్మకం చేసేటటువంటివి. ఆయన ఉధమ్ సింహ్ నగర్ లో ఎఐఐఎమ్ఎస్ రుషికేశ్ శాటిలైట్ సెంటర్ కు మరియు పిథోరాగఢ్ లో జగ్ జీవన్ రామ్ ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణాని కి గాను పునాది రాయి ని కూడా వేశారు. ఈ శాటిలైట్ సెంటర్ లు దేశం లోని అన్ని ప్రాంతాల లో ప్రపంచ శ్రేణి వైద్య చికిత్స సదుపాయాల ను కల్పించాలన్న ప్రధాన మంత్రి ప్రయాసల కు అనుగుణం గా ఉన్నాయి. ఆయన కాశీ పుర్ లో అరోమ పార్కు కు, సితార్ గంజ్ లో ప్లాస్టిక్ ఇండస్ట్రియల్ పార్కు కు, ఇంకా గృహ నిర్మాణం, పారిశుధ్యం, ఇంకా తాగునీటి సరఫరాల కు సంబంధించిన అనేక ఇతర కార్యక్రమాల కు కూడాను శంకుస్థాపన చేశారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, కుమావూఁ తో తనకు దీర్ఘ కాలం గా ఉన్న అనుబంధాన్ని గుర్తు కు తెచ్చుకొన్నారు. ఉత్తరాఖండ్ కు చెందిన టోపీ తో తన ను సమ్మానించినందుకు గాను ఆ ప్రాంత ప్రజల కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ దశాబ్దం ఉత్తరాఖండ్ యొక్క దశాబ్దం అని తాను ఎందుకు అనుకొంటున్నది ప్రధాన మంత్రి వివరంగా చెప్పారు. ఉత్తరాఖండ్ ప్రజల శక్తి ఈ దశాబ్ది ని ఉత్తరాఖండ్ యొక్క దశాబ్దం గా తీర్చిదిద్దనుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఉత్తరాఖండ్ లో ఆధునిక మౌలిక సదుపాయాలు పెరుగుతుండటం, చార్ ధామ్ ప్రాజెక్టు, కొత్త రైలు మార్గాల నిర్మాణం వంటివి ఈ దశాబ్దాన్ని ఉత్తరాఖండ్ యొక్క దశాబ్దం గా మార్చివేస్తాయి అని ఆయన అన్నారు. జల విద్యుత్తు రంగం లో, పరిశ్రమ రంగం లో, పర్యటన రంగం లో, ప్రాకృతిక వ్యవసాయ రంగం లో, ఇంకా సంధానం రంగం లో ఉత్తరాఖండ్ వేసినటువంటి అడుగులు ఈ దశాబ్ది ని ఉత్తరాఖండ్ యొక్క దశాబ్దం గా మార్చుతాయి అని ఆయన అన్నారు.

పర్వత ప్రాంతాల ను అభివృద్ధి కి దూరం గా ఉంచినటువంటి ఆలోచన స్రవంతి కి, పర్వత ప్రాంతాల ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆలోచన స్రవంతి కి మధ్య గల భేదాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. అభివృద్ధి మరియు సదుపాయాలు లోపించడం తో ఎంతో మంది ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాల కు ప్రవాసం వెళ్లారు అని ఆయన అన్నారు. ప్రభుత్వం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ (అందరి తో కలసి అందరి పురోగతి కోసం) అనే స్ఫూర్తి తో కృషి చేస్తోంది అని ఆయన అన్నారు. ఉధమ్ సింహ్ నగర్ లో ఎఐఐఎమ్ఎస్ రుషికేశ్ శాటిలైట్ సెంటర్ కు, పిథోరాగఢ్ లో జగ్ జీవన్ రామ్ ప్రభుత్వ వైద్య కళాశాల కు శంకుస్థాపన తో రాష్ట్రం లో వైద్య సంబంధి మౌలిక సదుపాయాల కల్పన బలోపేతం కానుంది అని ఆయన చెప్పారు. ఈ రోజు న ప్రారంభం అవుతున్నటువంటి పథకాలను కూడా కలుపుకొంటే ఈ ప్రాజెక్టు లు రాష్ట్రం లో సంధానాన్ని మెరుగు పరుస్తాయి అని ఆయన పేర్కొన్నారు. ఇవాళ వేస్తున్నటువంటి పునాదిరాళ్ళ విషయం లో పూర్తి సంకల్ప శక్తి ద్వారా ఆయా పథకాల కు ఆచరణ రూపాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ఆయన అన్నారు. గతం లో జరిగిన మోసాన్ని మరియు గతం లో ఎదురైన ఇక్కట్టుల ను ప్రస్తుతం సమరస భావన లోకి, ఇంకా సౌకర్యాల రూపం లోకి మార్చడం జరుగుతోంది అని ఆయన అన్నారు. గడచిన ఏడు సంవత్సరాల లో హర్ ఘర్ జల్ ద్వారా, టాయిలెట్ ల ద్వారా, ఉజ్జ్వల పథకం ద్వారా, పిఎమ్ఎవై ద్వారా మహిళల జీవనం కొత్త సౌకర్యాల కు, గౌరవానికి నోచుకొంటున్నది అని కూడా ఆయన అన్నారు.

ప్రభుత్వ పథకాల లో జాప్యం అనేది ఇదివరకు అధికారం లో ఉన్న వారి శాశ్వత వ్యాపార చిహ్నం గా ఉండింది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఈ రోజు న, ఉత్తరాఖండ్ లో ప్రారంభించినటువంటి లఖ్ వాడ్ ప్రాజెక్టు కు ఇటువంటి చరిత్రే ఉంది. ఈ ప్రాజెక్టు ను గురించి మొట్టమొదట గా 1976వ సంవత్సరం లో ఆలోచన చేయడమైంది. ఇవాళ 46 సంవత్సరాల తరువాత దీని నిర్మాణాని కి శంకుస్థాపన ను మా ప్రభుత్వం చేసింది. ఈ జాప్యమనేది ఒక నేరాని కంటే తక్కువేం కాదు’’ అని ఆయన అన్నారు.

ప్రభుత్వం గంగోత్రి నుంచి గంగా సాగర్ వరకు ఒక మిశన్ లో తలమునకలుగా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. గంగా నది లోకి కలుస్తున్న మురుగునీటి కాలువల సంఖ్య టాయిలెట్ ల నిర్మాణం ద్వారా, ఉత్తమ మురుగునీటి పారుదల వ్యవస్థ ద్వారా, ఆధునిక జల శుద్ధి సదుపాయాల ద్వారా శర వేగం గా తగ్గిపోతున్నది. అదే విధం గా, నైనీతాల్ సరస్సు పట్ల సైతం శ్రద్ధ వహించడం జరుగుతోంది అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం నైనీతాల్ లోని దేవస్థల్ లో భారతదేశం లో కెల్లా అతి పెద్దదైనటువంటి ఆప్టికల్ టెలిస్కోపు ను కూడా ఏర్పాటు చేసింది అని ప్రధాన మంత్రి చెప్పారు. ఇది దేశంలోని, విదేశాలలోని శాస్త్రవేత్తల కు ఒక కొత్త సదుపాయాన్ని ఇవ్వడం ఒక్కటే కాకుండా ఈ రంగం ఒక సరికొత్త గుర్తింపున కు కూడా నోచుకొన్నది అని ఆయన అన్నారు. ప్రస్తుతం దిల్లీ లోను, దేహ్ రాదూన్ లోను ఉన్నటువంటి ప్రభుత్వాలు అధికార వ్యామోహం తో కాక సేవా స్ఫూర్తి తో నడుస్తున్నాయి అని ఆయన అన్నారు.

సరిహద్దు రాష్ట్రం అయినప్పటికీ కూడా రక్షణ సంబంధి అవసరాల ను అలక్ష్యం చేయడం అనే యథార్థం కడు శోచనీయం అని ప్రధాన మంత్రి అన్నారు. సంధానం తో పాటు గా దేశ భద్రత కు సంబంధించిన ప్రతి అంశాన్ని ఉపేక్షించడం జరిగింది. సైనికులు సంధానం కోసం, అత్యవసరమైన కవచం కోసం, మందుగుండు సామాను కోసం, ఆయుధాల కోసం చివరకు ఆక్రమణదారులకు, ఉగ్రవాదుల కు దీటైన సమాధానాన్ని ఇవ్వడాని కి సైతం వేచి ఉండవలసి వచ్చింది అని ఆయన అన్నారు.

అభివృద్ధి తాలూకు జోరు ను పెంచుకోవాలి అని ఉత్తరాఖండ్ కోరుకొంటోంది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘మీ కలలే మా సంకల్పాలు; మీ అభిలాషే మాకు ప్రేరణ గా ఉంది; మరి మా బాధ్యత ఏమిటి అంటే అది మీ యొక్క ప్రతి అవసరాన్ని నెరవేర్చడం’’ అని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్ ప్రజల యొక్క సంకల్పం ఈ దశాబ్ది ని ఉత్తరాఖండ్ యొక్క దశాబ్ది గా తీర్చిదిద్దనుంది అని ఆయన అన్నారు.

 

***

DS/AK

 

 



(Release ID: 1786372) Visitor Counter : 171