కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

“ఆడియో కాన్ఫరెన్సింగ్/ ఆడియోటెక్స్/ వాయిస్ మెయిల్ సర్వీసెస్ కోసం లైసెన్సింగ్ ఫ్రేమ్‌వర్క్” ఏకీకృత లైసెన్స్‌ పరిధిలోకి తీసుకుని రావాలని నిర్ణయించిన టెలికాం శాఖ

Posted On: 30 DEC 2021 4:01PM by PIB Hyderabad

టెలికాం రంగంలో అమలు చేస్తున్న సంస్కరణల్లో భాగంగా ప్రస్తుతం  అమలు అమలు జరుగుతున్నవాయిస్ మెయిల్ సర్వీస్ (విఎంఎస్ ),ఆడియోటెక్స్ (ఏటీఎస్),యూనిఫైడ్ మెసేజింగ్ సర్వీసెస్ (యుఎంఎస్)' స్టాండ్ ఎలోన్ లైసెన్స్ విధానంలో సవరణలు మార్పులు చేస్తూ యూనిఫైడ్ లైసెన్స్ ఫర్ ఆడియో కాన్ఫరెన్సింగ్/ ఆడియోటెక్స్/ వాయిస్ మెయిల్ సేవల  లైసెన్సింగ్ ఫ్రేమ్‌వర్క్” ను జారీ చేసింది. 16.07.2001 నాటి ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం టెలికాం శాఖ  విఎంఎస్,ఆడియోటెక్స్,యుఎంఎస్ లకు స్టాండ్ ఎలోన్ లైసెన్సులు జారీ చేస్తోంది. 

 “ఆడియో కాన్ఫరెన్సింగ్/ఆడియోటెక్స్/వాయిస్ మెయిల్ సర్వీసెస్ కోసం లైసెన్సింగ్ ఫ్రేమ్‌వర్క్పై ట్రాయ్ నుంచి అందిన సిఫార్సులను పరిశీలించిన టెలికాం శాఖ ఈ లైసెన్సులను యూనిఫైడ్ లైసెన్స్ (యూఎల్)లో భాగంగా చేస్తూ ఈ అధికారానికి కొత్త అధ్యాయాన్ని చేర్చింది. అయితే, ప్రస్తుత లైసెన్స్ నుంచి యూనిఫైడ్ లైసెన్స్ లో మారే అంశంలో ప్రస్తుతం విఎంఎస్,ఆడియోటెక్స్,యుఎంఎస్ లైసెన్సులను కలిగి ఉన్నవారికి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. 16.07.2001న జారీ చేయబడిన టెలికాం శాఖ జారీ చేసిన  మార్గదర్శకాలకు వ్యతిరేకంగా  విఎంఎస్,ఆడియోటెక్స్,యుఎంఎస్ లకు కొత్తగా స్టాండ్ ఎలోన్   లైసెన్స్ జారీ చేయడం గాని  వాటి పునరుద్ధరణ గాని  చేయబడదు.

జారీ చేసిన సవరించిన విధానం ప్రకారం మార్పుల  ప్రధాన ముఖ్యాంశాలు:

(ఎ)  "ఆడియో-కాన్ఫరెన్సింగ్/ ఆడియోటెక్స్/ వాయిస్ మెయిల్ సర్వీస్" పేరుతో అధికారం కోసం నూతన  అధ్యాయాన్ని జోడించడం ద్వారా లైసెన్స్ "యూనిఫైడ్ లైసెన్స్"(యుఎల్)  లో భాగంగా చేయబడింది.

(బి)  టీఈసి  ప్రమాణాల మేరకు  ఆడియో కాన్ఫరెన్సింగ్ యూనిట్‌ను పిఎస్ టీ ఎన్ /మొబైల్ మరియు ఐపీ  నెట్‌వర్క్ రెండింటికీ కనెక్ట్ చేయవచ్చు.

(సి)  లైసెన్స్ షరతులకు లోబడి ఒకటి కంటే ఎక్కువ యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్ల వనరులను ఉపయోగించినప్పటికీ డయల్ అవుట్ సౌకర్యం అనుమతించబడుతుంది.

(డి)  భారతదేశంలో నమోదైన సంస్థలకు  సేవలను అందించడానికి పాయింట్-టు-పాయింట్ కాన్ఫరెన్సింగ్ అనుమతించబడింది

(ఈ) యుఎల్   కింద లైసెన్స్ కోసం సర్వీస్ ఏరియా "ఎస్ డి సి ఎ నుంచి  "జాతీయ స్థాయి"కి అంటే అఖిల భారత స్థాయికి మారుతుంది.  అయితేఇది  విఎంఎస్,ఆడియోటెక్స్,యుఎంఎస్  ల స్టాండ్ ఎలోన్ లైసెన్స్ కోసం  ఎస్ డి సి ఎ  గా ఉంటుంది

(ఎఫ్)  కొత్త లైసెన్సీలు మరియు ఇప్పటికే ఉన్న లైసెన్స్‌దారుల లైసెన్స్ ఫీజు ఏజిఆర్ ఏజీఆర్ AGRలో 8% గా ఉంటుందిఇది  యుఎల్   యొక్క ఇతర లైసెన్సులతో సమానంగా ఉంటుంది.

 నూతన వ్యవస్థ  01.01.2022 నుంచి అమల్లోకి వస్తుంది.



(Release ID: 1786349) Visitor Counter : 117