ప్రధాన మంత్రి కార్యాలయం

దేశమంతటా కోవిడ్-19 యొక్క స్థితి, ఓమిక్రాన్ మరియు ఆరోగ్య వ్యవస్థ లసన్నద్ధత ను సమీక్షించడం కోసం ఉన్నత స్థాయి సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి


కొత్త వేరియంట్ ను దృష్టి లో పెట్టుకొని మనం జాగరూకత తోను, అప్రమత్తంగాను ఉండాలి:  ప్రధాన మంత్రి

జిల్లా స్థాయి నుంచి మొదలుపెట్టి రాష్ట్రాల లో ఆరోగ్య వ్యవస్థల ను బలపరచేదిశ లో పూచీ పడడం జరగాలి:  ప్రధాన మంత్రి

ప్రభుత్వం జాగరూకత తో ఉంది; వర్తమాన స్థితి పూర్తి గా అదుపు లో ఉంది; ‘సంపూర్ణప్రభుత్వం’ అనే దృష్టికోణం లో భాగం గా కట్టడి మరియు సంబాళించే చర్యల లో సక్రియాత్మకమైన కార్యాచరణ ను చేపడుతూ, రాష్ట్రాల కు మద్దతిచ్చే చర్యలను కొనసాగించడం జరుగుతోంది: ప్రధానమంత్రి

కాంటాక్ట్ లను త్వరగాను, ప్రభావవంతమైన విధం గాను పసిగట్టడం, పరీక్షల ను పెంచడం, టీకాకరణ ను వేగవంతం చేయడం తో పాటు ఆరోగ్య సంబంధి మౌలిక సదుపాయాల నుపటిష్ట పరచడం అనే అంశాల పై తదేకం గా శ్రద్ధ వహించాలి:  ప్రధాన మంత్రి

టీకా మందు ను ఇప్పించడమనేది తక్కువ స్థాయి లో ఉన్నటువంటి రాష్ట్రాలకు, కేసులు పెరుగుతూ ఉన్న రాష్ట్రాల కు, ఆరోగ్య సంబంధిత మౌలిక సదుపాయాలుసరిపడినంతగా లేనటువంటి రాష్ట్రాల కు సాయపడటాని కి గాను కేంద్రం బృందాల నుపంపుతుంది 

Posted On: 23 DEC 2021 9:37PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆ సమావేశం లో కోవిడ్-19 స్థితి మరియు ఓమిక్రాన్, ఆందోళనను కలిగిస్తున్నటువంటి కొత్త వేరియంట్ (విఒసి), కోవిడ్-19 వ్యాప్తి ని నిరోధించడం, ఇంకా దానిని సంబాళించడానికి గాను సార్వజనిక స్వాస్థ్యపరమైన స్పందన తాలూకు ఉపాయాలు, మందుల అందుబాటు సహా ఆరోగ్య సంబంధి మౌలిక సదుపాయాల ను పటిష్టపరచడం, ఆక్సీజన్ సిలిండర్ లు మరియు కంసెన్టేటర్ లు, వెంటిలేటర్ లు, పిఎస్ఎ ప్లాంటు లు, ఐసియు/ఆక్సీజన్ సౌకర్యం కలిగిన పడకలు, మానవ వనరులు, ఐటి సహాయం, ఇంకా టీకాకరణ ఏ స్థాయి లో ఉందీ అనేటటువంటి అంశాలను పరిశీలించడం జరిగింది.

ఉన్నత స్థాయి వ్యాక్సీనేశన్ కవరేజి మరియు ఓమిక్రాన్ వేరియంట్ ఉనికి గల దేశాల లో కేసు లు వృద్ధి పొందుతుండడం పై దృష్టి పెట్టడం తో పాటు గా కొత్త వేరియంట్ ప్రపంచ స్థాయి లో ముమ్మరిస్తున్న స్థితి ని గురించి కూడా అధికారులు ప్రధాన మంత్రి కి సమాచారాన్ని ఇచ్చారు. ఓమిక్రాన్ నేపథ్యం లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) సిఫారసు చేసిన సాంకేతిక అంశాలను, ప్రాధాన్య పూర్వక కార్యాచరణల ను గురించి కూడా వారు ఆయన దృష్టి కి తీసుకు వచ్చారు. దేశం లో కోవిడ్-19 స్థితి మరియు ఓమిక్రాన్ స్థితి ఎలా ఉన్నదీ తెలియ జేయడం తో పాటు కేసు లు ఎక్కువ సంఖ్య లో నమోదు అవుతున్న రాష్ట్రాల ను గురించి, పాజిటివిటీ అధికం గా ఉంటున్న జిల్లాల గురించి, క్లస్టర్ లు ఎక్కడెక్కడ అధిక సంఖ్య లో ఏర్పాటయిందీ వంటి అంశాల ను కూడా వారు ప్రధాన మంత్రి కి నివేదించారు. దేశం లో వెల్లడి అయిన ఓమిక్రాన్ కేసుల వివరాలు, ఆయా వారి ప్రయాణాల వివరాలు, టీకాకరణ ఎంతవరకు వచ్చిందీ, రోగం బారిన పడి చికిత్స తో నయమైన కేసుల ను గురించిన సమచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన ఒకటో సలహా ల జాబితా ను రాష్ట్రాల తో పంచుకొన్న తరువాత 2021 నవంబర్ 25వ తేదీ నాటి నుంచి తీసుకొన్న వివిధ చర్యల ను గురించి ప్రధాన మంత్రి కి తెలియ జేయడమైంది. దీనికి అదనం గా అంతర్జాతీయ ప్రయాణికుల కోసం సవరించినటువంటి ట్రావెల్ అడ్వైజరీ, కోవిడ్-19 కి సంబంధించి ప్రజారోగ్య స్పందన చర్యల పై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల తో నిర్వహించిన సమీక్ష సమావేశాలు, వ్యాక్సీనేశన్ ను ముమ్మరం చేయడం, ఆక్సీజన్ సరఫరా సంబంధి సామగ్రి ఏర్పాటు మొదలైన అంశాల పై ప్రధాన మంత్రి కి వివరించడం జరిగింది.

అధికారుల వద్ద నుంచి సమాచారాన్ని తెలుసుకొన్న తరువాత, ప్రధాన మంత్రి వారిని అన్ని స్థాయిల లో ఉన్నత శ్రేణి నిఘా ను, అప్రమత్తత ను కొనసాగిస్తూ ఉండాలని ఆదేశించారు. కేంద్ర స్థాయి లోనూ ‘సంపూర్ణ ప్రభుత్వం’ దృష్టి కోణం లో భాగం గా నియంత్రణ మరియు నిర్వహణ తాలూకు సార్వజనిక స్వాస్థ్య ఉపాయాల ను, ప్రయాసల ను సమర్థించడం కోసం రాష్ట్రాల తో కలసి సన్నిహిత సమన్వయం ఏర్పరచుకొని కృషి చేయవలసిందిగా ఆయన ఆదేశించారు. మహమ్మారి కి వ్యతిరేకం గా సక్రియాత్మక, తదేక శ్రద్ధ తో కూడిన, సహకార పూర్వకమైన, సమన్వయభరితమైన పోరాటానికై కేంద్రం అనుసరించే వ్యూహాన్ని భవిష్యత్తు లో అన్ని కార్యాల కు మార్గదర్శి గా స్వీకరించాలి అని అధికారుల కు ప్రధాన మంత్రి ఆదేశాలు ఇచ్చారు.

కొత్త వేరియంట్ వెలుగు లోకి వచ్చిన సంగతి ని గమనించి జాగరూకత తో సావధానం గా ఉండాలి అని ప్రధాన మంత్రి ఆదేశించారు. మహమ్మారి కి వ్యతిరేకం గా చేస్తున్న యుద్ధం ముగిసి పోలేదు. కోవిడ్ నేపథ్యం లో సురక్షిత నడవడిక కు కట్టుబడి ఉండడాన్ని కొనసాగించవలసిన అవసరం ఈ నాటికి కూడా అన్నింటి కంటే మిన్న గా ఉంది అని ఆయన అన్నారు.

రాష్ట్రాల లో జిల్లా స్థాయి నుంచి మొదలయ్యే ఆరోగ్య వ్యవస్థల ను కొత్త వేరియంట్ ద్వారా తలెత్తే ఎటువంటి సవాలు ను అయినా సరే ఎదిరించి నిలబడడం కోసం పటిష్ట పరచేందుకు తగిన చర్యల ను తీసుకోవాలి అని అధికారుల ను ప్రధాన మంత్రి ఆదేశించారు. ఆక్సీజన్ సరఫరా ఉపకరణాలను సరి అయిన పద్ధతి లో ఏర్పాటు చేసుకోవాలని, మరి అవి పూర్తి స్థాయి లో పని చేస్తూ ఉండేటట్టు రాష్ట్రాలు చూడాలని అధికారుల కు ప్రధాన మంత్రి ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రాల తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ, మానవ వనరుల కు అవసరమైన శిక్షణ ను ఇవ్వడం, కెపాసిటీ బిల్డింగ్, ఎంబులెన్సులను సకాలం లో అందుబాటు లో ఉంచడం, సంస్థాగత క్వారన్టీన్ కోసం కోవిడ్ సదుపాయాల నిర్వహణ లో రాష్ట్రాల సన్నద్ధత సహా హోమ్ ఐసలేశన్ లో ఉండేవారి ని ప్రభావవంతమైన రీతి లో పర్యవేక్షిస్తూ ఉండటం తో పాటు గా ఆరోగ్య సంబంధి మౌలిక సదుపాయాల సంబంధి వివిధ కంపొనంట్స్ ను సిద్ధంగా ఉంచుకోవడం తాలూకు స్థితి ని సమీక్షిస్తూ ఉండాలని కూడా ఆయన ఆదేశించారు. టెలీ మెడిసిన్, ఇంకా టెలీ కాన్ సల్టేశన్ కోసం ఐటి పరికరాల ను ప్రభావశీలమైన రీతి న ఉపయోగించుకోవాలి అని కూడా అధికారుల ను ఆయన ఆదేశించారు.

సరికొత్త గా క్లస్టర్ ల రూపాన్ని సంతరించుకొంటున్న ప్రాంతాలను మరియు హాట్ స్పాట్ లను నిశితం గా పర్యవేక్షించడం, త్వరిత గతి న ప్రభావవంతమైనటువంటి నిఘా ను కొనసాగించడం చేయాలి అని ఆయన పేర్కొన్నారు. అధిక సంఖ్య లో పాజిటివ్ శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం శీఘ్రం గా ఐఎన్ఎస్ఎసిఒజి (INSACOG) ల్యాబ్స్ కు పంపించే విషయం లో శ్రద్ధ వహించాలి అని ఆయన ఆదేశించారు. సరి అయిన కాలం లో కట్టడి చేయడం మరియు వైద్య చికిత్సను అందించడం కోసం కేసుల ను త్వరిత గతి న గుర్తించడం కోంస పరీక్షల లో వేగాన్ని తీసుకురావాలి అని కూడా ప్రధాన మంత్రి ఆదేశించారు. సంక్రమణ వ్యాప్తి ని అడ్డుకోవడం కోసం కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రభావశీలమైన రీతి లో జరపాలి అని ఆయన స్పష్టం చేశారు. టీకామందు ను ఇవ్వడం లో వెనుక పట్టు పట్టిన రాష్ట్రాల కు, కేసు లు పెరుగుతూ ఉన్నటువంటి ప్రాంతాల కు, ఆరోగ్య సంబంధి మౌలిక సదుపాయాలు ఉండవలసిన స్థాయి లో ఉండని ప్రాంతాల స్థితి ని మెరుగుపరచడం లో సహాయాన్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం బృందాల ను పంపించాలి అంటూ అధికారుల కు ప్రధాన మంత్రి ఆదేశాలు ఇచ్చారు.

దేశవ్యాప్తం గా టీకాకరణ లో పురోగతి ని గురించి ప్రధాన మంత్రి కి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అర్హులైన జనాభా లో 88 శాతాని కి పైగా కోవిడ్-19 టీకా మందు తాలూకు ఒకటో డోజు ను ఇప్పించడం జరిగిందని, అదే మాదిరి గా అర్హత కలిగిన జనాభా లో 60 శాతాని కి పైగా ప్రజలు రెండో డోజు ను ఇవ్వడమైందని ఆయన కు తెలియ జేయడమైంది. ప్రజల ను పోగేసి వారికి టీకామందు ను ఇప్పించడం కోసం హర్ ఘర్ దస్తక్పేరిట చేపట్టిన టీకాకరణ ప్రచార ఉద్యమం ప్రజల కు కోవిడ్-19 టీకా మందు తీసుకొనేటట్లుగా వారిలో ప్రేరణ ను కలిగించడం లో ఉపయోగపడిందని, మరి దీని తో వ్యాక్సీన్ కవరేజీ ని పెంచడం లో ప్రోత్సాహకర ఫలితాలు వచ్చాయని ప్రధాన మంత్రి కి అధికారులు వివరించారు. అర్హులైన వారు అందరూ కోవిడ్-19 కి వ్యతిరేకం గా పూర్తి స్థాయి లో టీకా మందు అందుకొనేటట్లుగా రాష్ట్రాలు చూడవలసి ఉందని, ఈ దిశ లో అనుకున్న కాలం లోపల సంపూర్ణ లక్ష్యాన్ని సాధించే విధం గా ముందడుగు వేయాలని ప్రధాన మంత్రి ఆదేశించారు.

ఈ సమావేశాని కి హాజరైన వారిలో కేబినెట్ సెక్రట్రి, నీతి ఆయోగ్ లో ఆరోగ్యం విషయాల సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్; హోం సెక్రట్రి శ్రీ ఎ.కె. భల్లా; ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ భూషణ్;, ఫార్మాస్యూటికల్స్ సెక్రట్రి; బయోటెక్నాలజీ సెక్రట్రి డాక్టర్ రాజేశ్ గోఖలే; ఐసిఎమ్ఆర్ డిజి డాక్టర్ బలరామ్ భార్గవ్; ఆయుష్ సెక్రట్రి శ్రీ వైద్య రాజేశ్ కొటేచా; పట్టణాభివృద్ధి కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్ర; ఎన్ హెచ్ఎ సిఇఒ శ్రీ ఆర్.ఎస్. శర్మ; భారత ప్రభుత్వాని కి ప్రధాన వైజ్ఞానిక సలహాదారు ప్రొఫెసర్ శ్రీ కె. విజయ్ రాఘవన్ లతో పాటు ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు.

 

***



(Release ID: 1784879) Visitor Counter : 191