నీతి ఆయోగ్
ఆవిష్కర్తలకు, ఎంటర్ ప్రెన్యుయర్లకు సాధికారత కల్పించేందుకు 22 స్థానికభాషలలో ఆవిష్కరణల కార్యక్రమం (విఐపి) ప్రారంభించిన అటల్ ఇన్నొవేషన్ మిషన్, నీతి ఆయోగ్
Posted On:
22 DEC 2021 1:10PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా గల ఆవిష్కర్తలకు , ఎంటర్ ప్రెన్యుయర్లకు సాధికారత కల్పించేందుకు నీతి ఆయోగ్, అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎఐఎం), దేశంలో తొలి సారిగా వెర్నాకులర్ ఇన్నొవేషన్ ప్రోగ్రాం ( విఐపి) ని ప్రారంభించింది. ఇది ఆవిష్కర్తలు, ఎంటర్‌ప్రెన్యుయర్లకు భారత ప్రభుత్వం గుర్తించిన 22 షెడ్యూలు భాషలలో ఆవిష్కరణలకు సంబంధించిన సమాచారాన్ని అందుకోవడానికి వీలు కలుగుతుంది.
విఐపి, ఎఐఎం కు అవసరమైన సామర్ధ్యాలను కల్పించేందుకు ఒక వెర్నాకులర్ టాస్క్‌ఫోర్స్ ( విటిఎఫ్)కు 22 షెడ్యూలు భాషలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి టాస్క్ ఫొర్సులో వెర్నాకులర్ లాంగ్వేజ్ టీచర్లు, విషయ నిపుణులు, సాంకేతిక రచయితలు, రీజనల్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లకు చెందిన (ఎఐసి ) వారు ఉన్నారు.
ఈ కార్యక్రమం ముందుకు వెళ్లడానికి ఎఐఎం నీతి ఆయోగ్ శిక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. దీనిద్వారా ఇది ఐఐటి ఢిల్లీకి చెందిన డిజైన్ డిపార్టమెంట్ తో కలసి విటిఎఫ్ డిజైన్ ఆలోచన, ఎంటర్ ప్రెన్యుయర్ షిప్‌ను, 22 భాషలు, సంస్కృతులలో అందించడం వంటి వాటిలో పరస్పరం సహకారం తీసుకుంటుంది. దీనికి తోడు పరిశ్రమ మెంటార్లు డిజైన్ ఆలోచనలకు సంబంధించిన నైపుణ్యాల విషయంలో పరస్పరం చేతులు కలిపారు. సిఎస్ ఆర్ స్పాన్సర్లు ఈ కార్యక్రమానికి ఉదారంగా మద్దతునివ్వడానికి ముందుకు వచ్చారు. డిసెంబర్ 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకు కాలానికి టాస్క్‌ఫోర్సు శిక్షణ అనంతరం ఆయా స్థానిక భాషలలోని ఆవిష్కర్తలకు దీనిని అందుబాటులోకి తేనున్నారు.
విఐపిని ప్రారంభిస్తూ నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, ఇండియా తన భిన్న సామాజిక ,సంస్కృతుల సమ్మేళనం నుంచి గుర్తింపును పొందింది. ఇందులోనూ ప్రాంతీయ భాషలు ప్రముఖ సాంస్కృతిక సంపదగా విరాజిల్లుతున్నాయి.
స్థానిక భాషలలోఆవిష్కరణల కార్యక్రమం మన ఆవిష్కర్తల డిజైన్ ఆవిష్కరణల సామర్ధ్యాలను బలోపేతం చేస్తుంది. దీని ద్వారా స్థానిక ఎంటర్ ప్రెన్యుయర్లు, కళాకారులు, ఆవిష్కర్తలు నిరంతరాయంగా విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ఎఐఎం అభివృద్ధి చేసే సాంకేతిక మెటీరియల్‌ను అభివృద్ధి చేయడానికి ఉపకరిస్తుంది. ఇది ఇండియా బలమైన స్థానిక నెట్‌వర్క్‌తో కూడిన డిజైన్ నైపుణ్యాలను, ఆవిష్కరణ విధానాలను నిర్మించడంలో తోడ్పడుతుందని డాక్టర్ రాజీవ్ కుమార్ అన్నారు.
కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ నీతి ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్, ఈ కార్యక్రమం భారత ఆవిష్కరణలు, ఎంటర్ ప్రెన్యుయర్‌షిప్ వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలుస్తుందని,ఇది యువకులు, మంచి ఆకాంక్షలు కలిగిన వారిని ప్రోత్సహిస్తుందని అన్నారు.
భాషాపరమైన అవరోధాలను అధిగమించేందుకు, ఆవిష్కర్తలకు సాధికారత కల్పించేందుకు మారుమూలప్రాంతాల వారికిసైతం సాధికారత కల్పించేందుకు అటల్ ఇన్నొవేషన్ మిషన్ చేపట్టిన చొరవగా ఆయన తెలిపారు.
ఆవిష్కరణలు , ఎంటర్ ప్రెన్యుయర్ షిప్‌ల రంగంలో భాషాపరమైన అడ్డంకులను అవరోధాలను తొలగించేందుకు ఇది ఒక ప్రత్యేక కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. సృజనాత్మక వ్యక్తీకరణలు , ఆదాన ప్రదాన భాషలను క్రమపద్ధతిలో విడదీసి ఆవిష్కరణ , ఎంటర్ ప్రెన్యుయర్ రంగంలో భాషా అవరోధాన్ని తగ్గించడానికి విఐపి ఒక ప్రత్యేక కార్యక్రమమని ఎఐఎం, నీతి ఆయోగ్ మిషన్ డైరక్టర్ డాక్టర్ చింతన్ వైష్ణవ్, అన్నారు.
ప్రపంచానికి తమ ఆలోచనలను ,ఆవిష్కరణలను తెలియజేయలేకపోవడమనే సమస్యను కీలకమైనదని దీనిని పరిష్కరించాలని డాక్టర్ చింతన్ అన్నారు. ప్రత్యేకించి భిన్న భాషలుగల దేశంలో ఇది ముఖ్యమైనదన్నారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని స్థానిక భాషలవారు ఎదుర్కొంటున్నసమస్యను దాని తీవ్రతను జాతీయస్థాయిలో పరిశీలించేవారు విఐపికిఉన్నారన్నారు.
2011 జనాభా లెక్కలను ఉదహరిస్తూ ఆయన భారతీయులలో 10.4 శాతం మంది మాత్రమే ఇంగ్లీషులో మాట్లాడుతున్నారని, చాలామంది ఇంగ్లీషును రెండో మూడో నాలుగో భాషగా మాట్లాడుతున్నారన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే 0.02 శాతం మంది భారతీయులు మాత్రమే ఇంగ్లీషును తమ ప్రథమ భాషగా మాట్లాడుతున్నారన్నారు. పది సంవత్సరాల తర్వాత కూడా ఈ అంకెలలో పెద్ద తేడా ఉండే అవకాశం లేదన్నారు.
ఇలాంటి పరిస్థితులలో స్థానిక భాషల ఆవిష్కర్తలకు సమాన అవకాశాలు ఎందుకు ఇవ్వకూడదు. మన జనాభాలో వీరు 90 శాతం వరకు ఉన్నారు. వారు ఏ భాష మాట్లాడే వారైనా సరే ఈ ప్రజలు సృజనాత్మకత కలిగినవారని గుర్తించాలి అని ఆయన నొక్కి చెప్పారు.
ఇంగ్లీషుతో సహా 22 భాషల వారికి ఉపయోగపడే ఆవిష్కరణల వాతావరణాన్ని కల్పించే చర్యలను చేపట్టిన దేశం ప్రపంచంలోనే ఇండియా ఒక్కటే కావచ్చు. ఆవిష్కర్తలు వారి భాష , సంస్కృతిలో అభ్యాసానికి అవకాశం అందించడం ద్వారా, స్థానిక, ప్రాంతీయ, జాతీయ ప్రపంచ ఆవిష్కరణలను మెరుగుపరచడానికి అటల్ ఇన్నొవేషన్ మిషన్ ఎదురుచూస్తుంది.
***
(Release ID: 1784460)
Visitor Counter : 238