ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తో సమావేశమైన మధ్య ఆసియా దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు
Posted On:
20 DEC 2021 4:39PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో 2021వ సంవత్సరం డిసెంబర్ 20వ తేదీ న కజాఖ్ స్తాన్, కిర్గిజ్ గణతంత్రం, తాజికిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, ఇంకా ఉజ్ బెకిస్తాన్ ల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు సమావేశమయ్యారు. మధ్య ఆసియా దేశాల కు చెందిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు ఇండియా-సెంట్రల్ ఏశియా డైలాగ్ తాలూకు మూడో సమావేశం లో పాల్గొనడం కోసం న్యూ ఢిల్లీ కి విచ్చేశారు.
మధ్య ఆసియా దేశాల కు చెందిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు వారి వారి అధ్యక్షుల శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి తెలియజేయడం తో పాటు గా వారి నాయకత్వం భారతదేశం తో సంబంధాల ను మరింత గా పటిష్ట పరచుకోవడం కోసం సిద్ధం గా ఉందని స్పష్టం చేశారు. భారతదేశం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అధ్యక్షత న 2021వ సంవత్సరం డిసెంబర్ 18వ, 19వ తేదీల లో జరిగిన ఇండియా-సెంట్రల్ ఏశియా డైలాగ్ తాలూకు చర్చోపచర్చల ను గురించి వారు ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు వచ్చారు. అఫ్ గానిస్తాన్ లో స్థితి సహా, ప్రాంతీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత భాగస్వామ్యం, వ్యాపారం, ఇంకా సంధానం లపై ఆ చర్చల సందర్భం లో శ్రద్ధ తీసుకోవడం జరిగింది.
మధ్య ఆసియా దేశాల తో చాలా కాలం గా ఉన్నటువంటి సంబంధాల కు భారతదేశం ప్రాముఖ్యాన్ని ఇస్తోందని, ఆ దేశాలు భారతదేశం అనుసరిస్తున్న ‘ఎక్స్ టెండెడ్ నైబర్ హుడ్’ విధానం లో పాలుపంచుకొంటున్నాయని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ఈ సంవత్సరం లో ఆ మధ్య ఆసియా దేశాల స్వాతంత్య్రం తాలూకు 30 వ వార్షికోత్సవం కావడం తో ఆయన మంత్రుల కు తన అభినందనల ను వ్యక్తం చేశారు. 2015వ సంవత్సరం లో మధ్య ఆసియా దేశాలన్నిటిలోను, మరి ఆ తరువాత కజాఖ్ స్తాన్, ఉజ్ బెకిస్తాన్ మరియు కిర్గిజ్ గణతంత్రం లలోను తాను జరిపిన స్మరణీయ సందర్శనల ను ఆయన గుర్తుచేశారు. భారతదేశాని కి, మధ్య ఆసియా కు ప్రజా సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలను కొనసాగించడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని, ఈ ప్రాంతం లో భారతదేశ చలనచిత్రాలకు, సంగీతానికి, యోగ కు తదితర అంశాల కు గల ప్రజాదరణ ను పరిగణన లోకి తీసుకోవాలని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. అలాగే భారతదేశాని కి మరియు మధ్య ఆసియా కు మధ్య పరస్పర ఆర్థిక సహకారానికి అవకాశాలు ఇదివరకటి కన్నా పెరిగాయని, ఈ విషయం లో సంధానం తాలూకు పాత్ర ను గురించి కూడా ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు.
భారతదేశాని కి, మధ్య ఆసియా దేశాల కు గల శ్రేష్ఠమైనటువంటి ద్వైపాక్షిక సంబంధాల కు ఇండియా-సెంట్రల్ ఏశియా డైలాగ్ ఉత్తేజాన్ని ఇచ్చింది. భారతదేశం తో పాటు మధ్య ఆసియా దేశాలు వాటి మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన దరిమిలా వచ్చే సంవత్సరం 30వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నాయి.
***
(Release ID: 1783542)
Visitor Counter : 227
Read this release in:
Gujarati
,
English
,
Urdu
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam