సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
డిజిటల్ మీడియా లో భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు ఆసక్తి వ్యక్తం చేసే పత్రంపై సంతకాలు చేసిన ఇండియా వియత్నాం.
ఇరు పక్షాలు కలసి పనిచేయడానికి , భాగం పంచుకోవడానికి ఎంతో ఉంది అన్న అనురాగ్ ఠాకూర్
Posted On:
16 DEC 2021 1:42PM by PIB Hyderabad
కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈరోజు వియత్నాం ప్రభుత్వ సమాచార ప్రసార శౄఖ మంత్రి తో కలిసి , డిజిటల్ మీడియా రంగంలో కొలాబరేషన్‌కు ఒక ఆసక్తి వ్యక్తీకరణ పత్రంపై సంతకాలు చేశారు. దీనితో ఇండియా, వియత్నాంల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఇది ఉపకరిస్తుంది.
ఈ ఆసక్తి వ్యక్తీకరణ ఒప్పందం ద్వారా సమాచార మార్పిడి, ఇరుదేశాల అనుభవాలను పరస్పరం పంచచుకోవడం విధానాల రూపకల్పన, డిజిటల్ మీడియా, సోషల్ నెట్ వర్క్‌పై రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్
ఈ ఆసక్తి వ్యక్తీకరణ ఒప్పందం ద్వారా సమాచార మార్పిడి, ఇరుదేశాల అనుభవాలను పరస్పరం పంచుకోవడం విధానాల రూపకల్పన, డిజిటల్ మీడియా, సోషల్ నెట్ వర్క్‌పై రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్, సామర్థ్యాల నిర్మాణం , ఇరుదేశాల మీడియా, అధికారుల కోసం శిక్షణ కార్యక్రమాల నిర్వహణ వంటి వి ఉన్నాయి.
ఇరుదేశాల మంత్రులు శ్రీ ఠాకూర్ నివాసంలో సమావేశమై సుహృద్భావ పూరిత చర్చలు నిర్వహించడం ఇరుదేశాల మధ్యగల సౌహార్ద్ర సంబంధాలకు అద్దం పడుతోంది. ఇటీవల రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వియత్నాంలో పర్యటనతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడినట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఈరోజు జరిగిన సమావేశం ఇరు దేశాల మధ్య నూతన సాంకేతికత, సవాళ్లు, కోవిడ్ 19 సమయంలో అన్ని దేశాలు ఎదుర్కొంటున్న సమస్య అయిన ఇన్‌ఫోడెమిక్ విషయంలో ద్వైపాక్షిక సహకారానికి ఇది వీలు కల్పిస్తుంది. డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్‌ను 2021 ఫిబ్రవరి నుంచి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న విషయాన్ని కూడా వియత్నాం మంత్రిదృష్టికి తీసుకురావడం జరిగింది.
శ్రీ ఠాకూర్ ను వియత్నాం సందర్శించాల్సిందిగా హుంగ్ కోరారు..భారత -వియత్నాం దేశాల ప్రజలకు ప్రజలకు ప్రజలకు మధ్య మరింత బలమైన బంధం ఏర్పడేందుకు ఇరు దేశాలలోని విజయగాధలపై విస్తృత ప్రచారం కల్పించేందుకు , ఇరుదేశాల సామాజిక ఆర్థిక అభివృద్ధిపై సమాచారాన్ని జర్నలిస్టులకుఅందుబాటులో ఉంచే అంశంపై కూడా వారు చర్చించారు.
ఈ సమావేశానికి ప్రసారభారతి సి.ఇ.ఒ శ్రీ శశిశేఖర్ వెంపటి, పిఐబి ప్రిన్సిపల్ డిజి శ్రీ జైదీప్ భట్నగర్, సమాచార ప్రసార మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి విక్రమం సహాయ్ తోపాటు ఇండియా , వియత్నాంలకు చెందిన పలువురు అధికారులు హాజరయ్యారు.
ఇండియా , వియత్నాంల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నది. 2022 సంవత్సరం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు 50 వసంతాలు పూర్తి చేసుకుంటాయి.
***
(Release ID: 1783004)
Visitor Counter : 177
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam