రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

రక్షా మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్


1971 యుద్ధంలో మ‌న దేశ సైనికులు క‌న‌బ‌రిచిన‌ ధైర్యాన్ని, త్యాగాన్ని ‘స్వర్ణిమ్ విజయ్ దివస్’ సందర్భంగా గుర్తు చేసుకున్న ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌

భారత సైనిక చరిత్రలో 1971 యుద్ధం సువర్ణ అధ్యాయమ‌ని పేర్కొన్న ర‌క్ష‌ణ మంత్రి

Posted On: 16 DEC 2021 10:04AM by PIB Hyderabad

1971లో పాకిస్థాన్‌తో  జ‌రిగిన యుద్ధంలో మ‌న దేశ సైనికులు క‌న‌బ‌రిచిన అపార‌మైన‌ ధైర్యాన్ని, పరాక్రమాన్ని, త్యాగాన్నికేంద్ర  ర‌క్ష‌ణ మంత్రి  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ గురువారం గుర్తు చేసుకున్నారు.  డిసెంబర్ 16, 2021న ‘స్వర్ణిమ్ విజయ్ దివస్’ సందర్భంగా  ఇక్క‌డ ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని వారి ధైర్యాన్ని,  త్యాగాన్ని స్మ‌రించుకున్నారు. త‌న వరుస ట్వీట్లలో కేంద్ర రక్ష‌ణ మంత్రి 1971 యుద్ధాన్ని భారతదేశ సైనిక చరిత్రలో ఒక సువ‌ర్ణ‌ అధ్యాయంగా అభివ‌ర్ణించారు. ఈ సంద‌ర్భంగా 1971 యుద్ధం స‌మ‌యంలో తీసిన కొన్ని పాత చిత్రాలను కూడా ర‌క్ష‌ణ మంత్రి  పంచుకున్నారు, ఇందులో ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ యొక్క చారిత్రాత్మక ఛాయాచిత్రం కూడా ఉంది. 1971 యుద్ధంలో భారతదేశం విజ‌యం సాధించి 50 సంవత్సరాలు గ‌డిచిన నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకొని 'స్వర్ణిమ్ విజయ్ వర్ష్' జరుపుకుంటున్నారు. యుద్ధంలో పాల్గొన్న అనుభవజ్ఞులకు త‌గిన గౌరవం చూపడంతో పాటు సాధారణంగా ప్రజలలో మరియు ముఖ్యంగా సాయుధ దళాలలో ఐక్యత, జాతీయత, స‌గౌర‌త యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయడం దీని లక్ష్యం.

 


(Release ID: 1782435) Visitor Counter : 158