సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఈ.డబ్ల్యూ.ఎస్. రిజర్వేషన్ - ప్రమాణాలు
Posted On:
15 DEC 2021 12:59PM by PIB Hyderabad
రాజ్యాంగం (నూట మూడు) సవరణ చట్టం 2019 ప్రకారం ఉద్యోగాలు మరియు విద్యా సంస్థల్లో ప్రవేశాలకు పది శాతం ఈ.డబ్ల్యూ.ఎస్. రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది. దీనిని సుప్రీం కోర్టులో సవాలు చేశారు. అందువల్ల, ప్రస్తుతం, ఈ అంశం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది.
ఈ.డబ్ల్యూ.ఎస్. లబ్ధిదారులను గుర్తించేందుకు, కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని ఎనిమిది లక్షల రూపాయలుగా సమగ్ర అధ్యయనం తర్వాత నిర్ణయించడం జరిగింది.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ఈ రోజు రాజ్యసభకు లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ విషయాన్ని పొందుపరిచారు.
*****
(Release ID: 1781954)
Visitor Counter : 133