ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేసిన ఆక్సిజన్ సరఫరా పరికరాల స్థాపన, ప్రారంభం, పనితీరు అంశాలు సమీక్షించిన కేంద్రం


ప్రజారోగ్య సంరక్షణకు మెడికల్ ఆక్సిజన్ అత్యంత కీలకం .. ఆక్సిజన్ నిరంతర సరఫరా అత్యంత అవసరం

అందిన అన్ని పరికరాలు/ వ్యవస్థలను నెలకొల్పి అందుబాటులోకి వచ్చే విధంగా ప్రారంభించాలి

ఆక్సిజన్ పరికరాల పనితీరును పరీక్షించడానికి రాష్ట్రాలు మాక్ డ్రిల్ నిర్వహించాలి

Posted On: 15 DEC 2021 3:57PM by PIB Hyderabad

కోవిడ్ మహమ్మారి ని సమస్యను పరిష్కరించే అంశంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరా కీలకంగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ అన్నారు. అత్యంత కీలకమైన మెడికల్ ఆక్సిజన్ ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా అయ్యేలా చూడడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేసిన ఆక్సిజన్ సరఫరా పరికరాలువ్యవస్థ (పీఎస్ఏ ప్లాంటులుయెల్ఎంవో ప్లాంటులుఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లుమెడికల్ గ్యాస్ పైప్‌లైన్ )   స్థాపనప్రారంభంపనితీరు తదితర  అంశాలను  శ్రీ రాజేష్ భూషణ్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ఉన్నతాధికారులతో సమీక్షించారు. 

పీఎస్ఏ ప్లాంటులుయెల్ఎంవో ప్లాంటులువెంటిలేటర్లు ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లుమెడికల్ గ్యాస్ పైప్‌లైన్ వ్యవస్థలు అవసరమైన సంఖ్యలో అందుబాటులో ఉండేలా చూడడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సాంకేతిక, ఆర్థిక సహకారాన్ని అందించిందని ఆయన అన్నారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు వీటిని నెలకొల్పి వాటి పనితీరుసు ప్రతి రోజు సమీక్షించాలని ఆయన సూచించారు. కేంద్రం నుంచి అందిన పరికరాలు/ వ్యవస్థలను జిల్లాలకు పూర్తిగా తరలించి జిల్లా స్థాయిలో ఆరోగ్య సౌకర్యాలను మెరుగు పరచాలని అన్నారు. అందిన పరికరాలు/ వ్యవస్థలను జిల్లాలకు తరలించలేదని కొన్ని రాష్ట్రాల నుంచి, నెలకొల్పిన పరికరాలు/వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం లేదని మరికొన్ని రాష్ట్రాల నుంచి సమాచారం అందిందని శ్రీ భూషణ్ అన్నారు. కేంద్రం నుంచి అందిన ప్రతి పరికరం/ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేసేలా చూసేందుకు   డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, హెచ్ ఎల్ ఎల్ ఇన్ఫ్రా టెక్ సర్వీసెస్ లిమిటెడ్  సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ తో రాష్ట్ర నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. విద్యుత్, స్థలం లాంటి సమస్యలను సత్వరం పరిష్కరించి తమకు అందిన ఆక్సిజన్ సరఫరా మౌలిక సదుపాయాలు తక్షణం అందుబాటులో వచ్చేలా చూడాలని ఆయన అన్నారు. 

దేశంలో తాజా సమాచారం ప్రకారం 3783 ఎంటీ ఆక్సిజన్ ఉత్పత్తి చేయగల 3236 పీఎస్ఏ ప్లాంటులు వివిధ ప్రాంతాలలో ఏర్పాటు అయ్యాయి. పీఎం కేర్స్ ( లక్ష)ఈసీఆర్పీ-II (14,000) కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 1,14,000  ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కేంద్రం అందించింది.

950 యెల్ఎంవో నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి, 1374 ఆసుపత్రుల్లో మెడికల్ గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేయడానికి ఈసీఆర్పీ-II నిధులను విడుదల చేశామని తెలిపారు. కేంద్రం అందిస్తున్న సహకారంతో దేశీయ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ద్యాన్ని పెంపొందించడానికి, ప్రభుత్వ ఆసుపత్రులలో మెడికల్ గ్యాస్ పైపులైన్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి సాధ్యమైనంత వేగంగా వాటిని ప్రారంభించడానికి  రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

 పీఎస్ఏ ప్లాంటులు పూర్తి స్థాయిలో, సక్రమంగా పనిచేసేలా చూడడానికి అవి ఏర్పాటైన ప్రాంతాల్లో తరచు వాటి మాక్ డ్రిల్‌లను నిర్వహించాలని శ్రీ భూషణ్ అన్నారు. దీనివల్ల ప్లాంటుల పనితీరు మెరుగు పడి, అవసరమైన పరిమాణంలో ఆక్సిజన్ ఉత్పత్తి జరిగి పడకలకు సరఫరా అయ్యేలా చూడవచ్చునని అన్నారు. 2021  డిసెంబర్ నాటికి ఈ డ్రిల్లులను నిర్వహించాలని అన్నారు.   మాక్ డ్రిల్ నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపాలని అన్నారు. సమాచారం మేరకు  మాక్ డ్రిల్ నిర్వహణ తేదీల్లో పరికరాల పనితీరును తాము ప్రత్యక్షంగా సమీక్షిస్తామని అన్నారు. . పెండింగ్‌లో ఉన్న ఆక్సిజన్ ఆడిట్ నివేదికలను పూర్తి చేసి  డిసెంబర్ 2021 చివరి నాటికి నియమించబడిన పోర్టల్ ద్వారా సమర్పించాలని రాష్ట్రాలను ఆదేశించారు.

పీఎస్ఏ ప్లాంట్లు ,ఇతర వైద్య ఆక్సిజన్ సంబంధిత మౌలిక సదుపాయాల నిర్వహణ  కోసం సాంకేతిక నిపుణులు మరియు వైద్యుల సామర్థ్యాలను పెంపొందించడానికి మరియు మెరుగుపరచడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమగ్ర శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.  నిర్ణీత శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయని రాష్ట్రాలు జిల్లా నైపుణ్యాభివృద్ధి మండలి సమన్వయంతో వాటిని వేగవంతం చేసి డిసెంబర్ చివరి నాటికి పెండింగ్‌లో ఉన్న వాటిని పూర్తి చేయాలని కోరారు.

 

 డాక్టర్ మనోహర్ అగ్నానీ,  ప్రిన్సిపల్ సెక్రటరీ (హెల్త్), మిషన్ డైరెక్టర్  మరియు అన్ని రాష్ట్రాల  పర్యవేక్షణ  అధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. బొగ్గు, విద్యుత్, రైల్వే, పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖల ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరయ్యారు.

***


(Release ID: 1781827) Visitor Counter : 162