ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డిసెంబర్ 11 వ తేదీ న ఉత్తర్ ప్రదేశ్ లోని బలరామ్ పుర్ నుసందర్శించనున్న ప్రధాన మంత్రి;   సరయూ నహర్ జాతీయ పథకాన్ని ప్రారంభిస్తారు


సుమారు నాలుగు దశాబ్దాల పాటు పెండింగు పడ్డ ప్రాజెక్టు ను నాలుగు సంవత్సరాలలో పూర్తి చేయడమైంది

జాతీయ ప్రాముఖ్యం కలిగిన, దీర్ఘకాలం పాటు పెండింగు పడ్డ ప్రాజెక్టులకు ప్రాథమ్యాన్నిఇవ్వడం తో పాటు రైతుల సంక్షేమం మరియు వారి సశక్తీకరణ ల తాలూకు ప్రధాన మంత్రిదృష్టి కోణం ఫలితం గా ఈ ప్రాజెక్టు పూర్తి అయింది

ఈ ప్రాజెక్టు 14 లక్షల హెక్టేర్ లకు పైగా పొలాల కు సాగునీటి లభ్యత కుపూచీపడనుంది; ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంతాని కి చెందిన 6200కు పైగా పల్లెల లోని సుమారు 29 లక్షల మంది రైతు లకు కూడా ఇది ప్రయోజనాన్నిఅందిస్తుంది

ఆ ప్రాంత రైతులు ఇక ఈ ప్రాంత వ్యవసాయ సామర్థ్యాన్ని పెంపొందింప చేయగలుగుతారు

ఈ ప్రాజెక్టు లో అయిదు నదులను.. ఘాఘరా, సరయూ, రాప్తీ, బాణ్ గంగా, ఇంకా  రోహిణి.. లను పరస్సరంకలపడం కూడా ఒక భాగం గా ఉంది 

Posted On: 10 DEC 2021 8:25AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని బలరామ్ పుర్ ను సందర్శించనున్నారు. ఆయన డిసెంబర్ 11 వ తేదీ నాడు మధ్యాహ్నం ఒంటి గంట వేళ కు సరయు నహర్ నేశనల్ ప్రాజెక్టు ను ప్రారంభిస్తారు.

ఈ ప్రాజెక్టు పనులు 1978వ సంవత్సరం లో మొదలైనప్పటి కీ కూడాను బడ్జెటు రూపేణా సమర్ధన, అంతర్ విభాగ సమన్వయం, తగినంత పర్యవేక్షణ లు లోపించడం వల్ల జాప్యం జరిగింది. సుమారు నాలుగు దశాబ్దాల కాలం గడచి పోయిన తరువాత సైతం ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు. రైతుల సంక్షేమాని కి, వారి సాధికారిత కు తోడ్పడాలన్న ప్రధాన మంత్రి దృష్టి కోణం, అలాగే జాతీయ ప్రాముఖ్యం కలిగినటువంటి ప్రాజెక్టు లు దీర్ఘకాలం పాటు పెండింగు లో పడ్డప్పుడు ఆ తరహా ప్రాజెక్టుల కు పెద్ద పీట వేయాలి అనే ఆయన నిబద్ధత లతో ఈ పథకం పట్ల శ్రద్ధ తీసుకోవడం జరిగింది. తత్ఫలితం గా 2016 వ సంవత్సరం లో ఈ ప్రాజెక్టు ను ప్రధాన మంత్రి కృషి సించాయి యోజనపరిధి లోకి తీసుకు రావడమైంది. ఈ ప్రాజెక్టు ను ఒక కాలబద్ధమైన రీతి లో ముగించాలి అనే లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ కృషి లో భాగం గా కొత్త గా కాలువల ను నిర్మించడం కోసం, మరి అదే విధం గా ప్రాజెక్టు లో కీలకమైన అంతరాల ను పూడ్చటం కోసం, మునుపటి కాలం లో చేసిన భూ సేకరణల కు సంబంధించిన వ్యాజ్యాల ను పరిష్కరించడం కోసం కొత్త కొత్త పరిష్కార మార్గాల ను కనుగొనడం జరిగింది. ఈ ప్రాజెక్టు పై సరికొత్త గా శ్రద్ధ ను వహించిన ఫలితం గా ఇది కేవలం నాలుగు సంవత్సరాల లో పూర్తి కావచ్చింది.


మొత్తం 9800 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో సరయూ నహర్ నేశనల్ ప్రాజెక్టు ను నిర్మించడమైంది. దీనిలో 4600 కోట్ల రూపాయల కు పైగా గడచిన నాలుగు సంవత్సరాల లో సర్దుబాటు చేయడమైంది. ఆ ప్రాంతం లో జలవనరుల ను వీలైనంత అధికం గా ఉపయోగించుకొనేటట్లుగా జాగ్రత్త చర్యల ను తీసుకోవడం కోసం అయిదు నదుల ను.. ఘాఘరా, సరయూ, రాప్తీ, బాణ్ గంగా, ఇంకా రోహిణి.. ఈ నదులను ఒకదానితో మరొక దానిని కలిపే ప్రతిపాదన ను కూడా దీనిలో చేర్చడమైంది.

 

ఈ ప్రాజెక్టు 14 లక్షల హెక్టేర్ లకు పైగా భూమి కి సేద్యపు జలాల ను అందించనుంది. 6200కు పైగా పల్లెల లోని సుమారు 29 లక్షల మంది రైతుల కు పయోజనాన్ని చేకూర్చనుంది. దీని ద్వారా ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంతాని కి చెందిన తొమ్మిది జిల్లాలు లాభపడనున్నాయి. ఆ జిల్లాలు ఏవేవంటే- బహరాయిచ్, శ్రావస్తీ, బలరామ్ పుర్, గోండా, సిద్ధార్థ్ నగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, గోరఖ్ పుర్, ఇంకా మహారాజ్ గంజ్. ఈ ప్రాంత రైతులు ప్రాజెక్టు అమలు లో అత్యధిక జాప్యం జరగడం వల్ల అన్నిటికంటే ఎక్కువ నష్టాల బారిన పడ్డారు. ఈ ప్రాజెక్టు సామర్ధ్యాన్ని పెంచిన నేపథ్యం లో వారికి చాలా ప్రయోజనం లభించనుంది. ఇకమీదట వారు పెద్ద ఎత్తున పంటల ను పండించగలుగుతారు; ఈ ప్రాంతం లో వ్యవసాయ సంబంధి అవకాశాలు కూడా ఎంతో అధికం అవుతాయి.

 

 


***


(Release ID: 1780132) Visitor Counter : 191