కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సంపన్ ప్రాజెక్ట్ ద్వారా 1 లక్ష మందికి పైగా ప్రజలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్ పొందుతున్నారు
ఈ వ్యవస్థ ద్వారా 9,630 ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి
టెలికాం డిపార్ట్‌మెంట్‌కు పెన్షన్ కేసులను వేగంగా పరిష్కరించడంలో, మెరుగైన సయోధ్య/ఆడిటింగ్ మరియు అకౌంటింగ్ సౌలభ్యం కోసం సంపన్ సహాయం చేస్తోంది.
Posted On:
09 DEC 2021 1:11PM by PIB Hyderabad
సంపన్ ద్వారా భారతదేశం అంతటా ఉన్న ప్రిన్సిపల్ కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్/కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ కార్యాలయాల ద్వారా ప్రస్తుతం లక్ష మందికి పైగా పింఛనుదారులు సేవలందుకుంటున్నారు. ఇది క్రింది ప్రయోజనాలకు భరోసానిస్తూ సింగిల్ విండో సెటప్‌ని అందించడం ద్వారా పెన్షనర్లకు సర్వీస్ డెలివరీని మెరుగుపరిచింది:
· పింఛను కేసులు సకాలంలో పరిష్కారం
· ఈ-పెన్షన్ చెల్లింపు ఆర్డర్ కేటాయింపు
· ప్రతి పెన్షనర్కు లాగిన్ చెల్లింపు చరిత్ర వంటి కీలక సమాచారానికి యాక్సెస్‌ను అనుమతిస్తుంది
· ఫిర్యాదుల ఆన్‌లైన్ సమర్పణ మరియు సకాలంలో ఎస్ఎంఎస్ అలర్ట్ లు
పెన్షన్ చెల్లింపునకు బ్యాంకులు/పోస్టాఫీసులకు చెల్లించే కమీషన్ ఖాతాలో భారత ప్రభుత్వానికి పునరావృతమయ్యే నెలవారీ పొదుపులను ఇది నిర్ధారిస్తుంది. ఇది సుమారుగా జూన్ 2021 నాటికి రూ.11.5 కోట్లు.
ప్రారంభించినప్పటి నుండి సంపన్ కు సంబంధించిన కీలక డేటా దిగువన సంగ్రహించబడింది:
సంవత్సరం
|
ఆన్‌బోర్డ్ చేసిన పెన్షనర్ల సంఖ్య
|
పరిష్కరించబడినఫిర్యాదుల సంఖ్య
|
పంపిణీ చేయబడిన మొత్తం (రూ.కోట్లలో)
|
2019
|
12,001
|
524
|
2109.67/-
|
2020
|
87,958
|
6,839
|
8477.30/-
|
2021 (జూన్ వరకు)
|
1,382
|
2,267
|
5238.47/-
|
మొత్తం
|
1,01,341
|
9,630
|
15,825.44 కోట్లు
|
ఎస్ఎఎంపిఎఎన్ఎన్– 'సిస్టమ్ ఫర్ అకౌంటింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ పెన్షన్' అనేది కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, కమ్యూనికేషన్స్ మినిస్ట్రీ ద్వారా అమలు చేయబడుతున్న భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. దీనిని 29 డిసెంబర్ 2018న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఇది టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ పెన్షనర్‌ల కోసం అవాంతరాలు లేని ఆన్‌లైన్ పెన్షన్ ప్రాసెసింగ్ మరియు చెల్లింపు వ్యవస్థ. ఇది పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా పెన్షన్ క్రెడిట్‌ను అందిస్తుంది.
ఈ వ్యవస్థ పెన్షన్ కేసులను వేగంగా పరిష్కరించడంలో, మెరుగైన సయోధ్య/ఆడిటింగ్ మరియు అకౌంటింగ్ సౌలభ్యం కోసం డిపార్ట్‌మెంట్‌కు సహాయపడింది.
6 నెలల స్వల్ప వ్యవధిలో 76000 బిఎస్ఎన్ఎల్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ 2019 కేసులను పరిష్కరించడంలో సంపన్ కీలకపాత్ర పోషించింది.
సంపన్ అనేది అనువైన డిజైన్‌తో కూడిన సిస్టమ్, ఇది ఎప్పటికప్పుడు విస్తరిస్తున్న అవసరాలకు అనుగుణంగా మార్పునకు అనుమతిస్తుంది.
******
(Release ID: 1779992)
Visitor Counter : 219