ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజ్యాంగ పరిషత్తు తొలి చరిత్రాత్మక సమావేశాని కి 75 సంవత్సరాలు పూర్తి అయినందుకు గుర్తు గారాజ్యాంగ పరిషత్తు యొక్క మహానుభావుల కు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి 

Posted On: 09 DEC 2021 12:22PM by PIB Hyderabad

 

రాజ్యాంగ పరిషత్తు తొలి చారిత్రిక సమావేశాని కి 75 సంవత్సరాలు పూర్తి అయినందుకు గుర్తు గా రాజ్యాంగ పరిషత్తు యొక్క మహానుభావుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సుల ను అర్పించారు.

ప్రధాన మంత్రి తన వరుస ట్వీట్ లలో -

‘‘75 సంవత్సరాల కిందట ఇదే రోజు న మన రాజ్యాంగ పరిషత్తు మొట్ట మొదటిసారి గా సమావేశమైంది. భారతదేశం లోని వివిధ ప్రాంతాల నుంచి, విభిన్న నేపథ్యాలు ఆ మాటకొస్తే వేరు వేరు ఆలోచన స్రవంతులు కలిగినటువంటి మహా వ్యక్తులు ఒక చోట గుమికూడారు. వారికి ఉండిన ఉద్దేశ్యం ఒక్కటే.. అది ఏమిటి అంటే భారతదేశ ప్రజల కు ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించాలి అనేదే. ఆ మహానుభావుల కు ఇవే నమస్సులు.

రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశాని కి ఆ పరిషత్తు సభ్యులందరి లోకి వయస్సు లో పెద్ద వారయిన డాక్టర్ సచ్చిదానంద సిన్హా అధ్యక్షత వహించారు.

ఆయన పేరు ను ఆచార్య కృపలానీ గారు ప్రతిపాదించారు; అంతేకాకుండా ఆయన ను ఆచార్య కృపలానీ గారు అధ్యక్ష స్థానం లో కూర్చోబెట్టారు.

ఈ రోజు న, ఎప్పుడయితే మనం రాజ్యాంగ పరిషత్తు యొక్క ఒకటో చరిత్రాత్మకమైన సమావేశానికి 75 సంవత్సరాలు పూర్తి కావడాన్ని గుర్తు కు తెచ్చుకొంటున్నామో, ఈ వేళ నేను నా యువ మిత్రులను కోరేది ఏమిటి అంటే ఈ ప్రసిద్ధ సభ నిర్వహించిన అటువంటి సభా కార్యకలాపాల ను, దీనిలో పాలుపంచుకొన్న మహానుభావుల ను గురించి మరింత ఎక్కువ గా తెలుసుకోండి అనేదే. ఇలా చేయడం వల్ల మేధోపరంగా లభించే అనుభవం సమృద్ధం అవుతుంది.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/SH

 


(Release ID: 1779697) Visitor Counter : 182