ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘నేవీ డే’ సందర్భంగా భారత నావికాదళానికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 04 DEC 2021 11:02AM by PIB Hyderabad

   ‘నేవీ డే’ సందర్భంగా భారత నావికాదళ సిబ్బందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో-

  “నావికా దినోత్సవం నేపథ్యంలో నా శుభాకాంక్షలు. భారత నావికాదళం ఆదర్శప్రాయ కర్తవ్య నిర్వహణ మనకెంతో గర్వకారణం. వృత్తిగత నైపుణ్యం, అత్యుత్తమ ధైర్యసాహసాలకుగాను మన నావికాదళం విస్తృతంగా గౌరవించబడుతుంది. ప్రకృతి వైపరీత్యాల వంటి సంక్షోభ పరిస్థితుల తీవ్రతను ఉపశమింపజేయడంలో మన నావికాదళ సిబ్బంది సదా ముందంజలో ఉంటారు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు

***

DS/SH


(रिलीज़ आईडी: 1778023) आगंतुक पटल : 207
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam