ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్-19 తాజా సమాచారం

Posted On: 29 NOV 2021 12:13PM by PIB Hyderabad

ప్రపంచవ్యాప్తంగా  కొత్తగా వెలుగు చూస్తున్న సార్స్ కోవ్ -2  వేరియంట్ (ఓమిక్రాన్ ) కేసుల నేపథ్యంలో  అంతర్జాతీయ ప్రయాణికుల కోసం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసిన  భారతదేశం 

   'ప్రమాదంలో ఉన్న దేశాలు'గా గుర్తించబడిన దేశాల నుంచి దేశానికి వచ్చే ప్రయాణికులందరూ (కోవిడ్ -19 టీకా స్థితితో సంబంధం లేకుండా) విమానాశ్రయానికి వచ్చిన  తర్వాత తప్పనిసరిగా కోవిడ్ -19 పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి చేస్తూ  మార్గదర్శకాలు జారీ 

హైదరాబాద్, నవంబర్ 29: 

కోవిడ్-19 మహమ్మారి కట్టడికి అమలు చేస్తున్న చర్యల్లో భాగంగా విదేశాల నుంచి దేశానికి వస్తున్న ప్రయాణికులకు కేంద్ర ఆరోగ్య శాఖ సవరించిన 2021 నవంబర్ 28వ తేదీన నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.  సవరించిన మార్గదర్శకాల ప్రకారం  'ప్రమాదంలో ఉన్న దేశాలు'గా గుర్తించబడిన దేశాల నుంచి దేశానికి వస్తున్న ప్రయాణికులు ప్రయాణానికి 72 గంటల ముందు, దేశంలో విమానాశ్రయానికి చేరుకున్న తరువాత కోవిడ్ -19 టీకా స్థితి తో సంబంధం లేకుండా తప్పనిసరిగా కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలసి  ఉంటుందని నూతన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన  ప్రయాణీకులను విడిగా ఉంచి అమలులో ఉన్న వైద్య విధాన నిబంధనల ప్రకారం చికిత్స అందించడం జరుగుతుంది. వీరి నమూనాలను హోల్  జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సేకరిస్తారు. నెగటివ్ గా తేలిన ప్రయాణీకులు విమానాశ్రయం నుంచి వెళ్ళవచ్చు. అయితే, వీరు ఏడు రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. దేశానికి చేరిన 8వ రోజున వీరు మరోసారి పరీక్షలు చేయించుకు ఏడు రోజుల పాటు విడిగా ఉండాల్సి ఉంటుందని కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

  ఓమిక్రాన్   వేరియంట్‌ వ్యాప్తి చెందుతున్న దేశాల సంఖ్య పెరుగుతున్ననేపథ్యంలో  ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం  'రిస్క్ కేటగిరీ'లో లేని దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల్లో 5% మంది ప్రయాణికులకు  కూడా విమానాశ్రయాలలో యాదృచ్ఛికంగా కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించాలని  ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. 

విమానాశ్రయాల్లో, లేదా హోమ్ ఐసోలేషన్‌లో లేదా యాదృచ్ఛిక పరీక్షల్లో కోవిడ్-19 పాజిటివ్ గాగుర్తించిన వ్యక్తుల నమూనాలను INSACOG నెట్ వర్క్ ల్యాబొరేటరీలకు సార్స్ కోవ్ -2  వేరియంట్ (ఓమిక్రాన్ సహా) ఉనికిని గుర్తించడానికి హోల్ జెనోమిక్ సీక్వెన్సింగ్ కోసం పంపించడం జరుగుతుంది. 

బి .1.1.529 వేరియంట్ (ఓమిక్రాన్ ) పై ప్రపంచ ఆరోగ్య సంస్థకు 2021 నవంబర్ 24న మొదటిసారిగా దక్షిణాఫ్రికా నుంచి వివరాలు అందాయి. సార్స్ కోవ్ -2 వైరస్ ఎవల్యూషన్ (టాగ్ - వీఈ )పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన సాంకేతిక సలహా బృందం 26 నవంబర్ 2021న దీనిని ప్రమాదకర వేరియంట్‌ గా వర్గీకరించింది. వేరియంట్‌లో  పెద్ద సంఖ్యలో గుర్తించిన ఉత్పరివర్తనాల దృష్ట్యా  ఈ మ్యుటేషన్‌ను మరింత వేగంగా విస్తరించి  మరియు రోగనిరోధక తప్పించుకునే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ సమస్యపై వెలువడుతున్న ఆధారాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది. 

 

 అంతర్జాతీయ ప్రయాణీకులపై మరింత  నిఘా ఉంచి, పరీక్షల సంఖ్యని పెంచి కోవిడ్ -19 హాట్‌స్పాట్‌లను పర్యవేక్షించడంమొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను చేపట్టడం సహా ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంపొందించడం కోసం దృష్టి సారించాలని రాష్ట్రాలకు సూచనలు జారీ అయ్యాయి. 

మహమ్మారి పరిణామ స్వభావాన్ని నిశితంగా గమనిస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  కోవిడ్ అనుగుణ  ప్రవర్తన (మాస్క్/ఫేస్ కవర్ వాడకం, శారీరక దూరం, చేతి పరిశుభ్రత మరియు శ్వాసకోశ పరిశుభ్రత) అమలు జరిగేలా చూడడానికి కోవిడ్-19 కట్టడికి చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ చర్యలను అమలు చేయాలని నిర్ణయించింది. 

నూతన మార్గదర్శకాలు  1 డిసెంబర్ 2021 (00.01 గంటలు) నుంచి  అమల్లోకి వస్తాయి . వివరణాత్మక మార్గదర్శకాలు   (https://www.mohfw.gov.in/pdf/GuidelinesforInternationalarrival28112021.pdf)లో అందుబాటులో ఉన్నాయి. 

 ***


(Release ID: 1776117) Visitor Counter : 401