సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గోవా చలన చిత్రోత్సవం లో ఇండియన్ పనోరమా విభాగాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్

సరైన కంటెంట్ భారతీయ సినిమాని ప్రపంచ ప్రేక్షకులకు తీసుకెళ్లగలదు: అనురాగ్ సింగ్ ఠాకూర్

సినిమాలు మన ఆకాంక్షలు , కలలను ప్రతిబింబిస్తాయి: రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, గవర్నర్, హిమాచల్ ప్రదేశ్

సెంఖోర్: ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శించబడిన మొట్టమొదటి దిమాసా భాషా చిత్రం

వేద్-ది విజనరీ, ఓపెనింగ్ ఫిల్మ్ (నాన్-ఫీచర్ – ఇండియన్ పనోరమా) ఒక చిత్ర నిర్మాత పోరాటం, స్థితిస్థాపకత ను ఆవిష్కరించే చిత్రం..

Posted On: 21 NOV 2021 3:03PM by PIB Hyderabad

పెద్ద తెరపై భారతదేశం నలు మూలల నుండి సేకరించిన కథలను ఆవిష్కరించే వాగ్దానంతో, ఇండియన్ పనోరమా విభాగం గోవాలో జరుగుతున్న 52 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ఆదివారం ప్రారంభమైంది.

52వ ఐఎఫ్ ఎఫ్ ఐ ప్రారంభోత్సవాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కూడా పాల్గొన్నారు.

ఈ ఏడాది ఇండియన్ పనోరమా 2021 కేటగిరీ కింద ఐఎఫ్ ఎఫ్ ఐ అధికారికంగా ఎంపిక చేసిన 24 ఫీచర్ ,20 నాన్ ఫీచర్ చిత్రాలను ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రేక్షకులకు పరిచయం చేసింది.

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేంద్ర మంత్రితో కలిసి ప్రారంభ చిత్రాలయిన  సెంఖోర్ (ఫీచర్) ,వేద్- ది విజనరీ (నాన్ ఫీచర్) చిత్రాల నిర్మాతలు,  తారాగణం, సిబ్బందిని సత్కరించారు. వారికి పార్టిసిఫేషన్ సర్టిఫికేట్లను అందచేశారు.

చిత్ర నిర్మాతలను అభినందిస్తూ కేంద్ర మంత్రి మాట్లాడుతూ, "మీరందరూ దేశంలోని మారుమూల ప్రాంతాల నుండి కథలు తీసుకురావడానికి ప్రయత్నించి కష్టపడ్డారు. ఇప్పుడు, కధాంశమే ప్రధానం. మీరు సరైన కధాంశాన్ని సృష్టిస్తే, అది జాతీయ స్థాయి మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయికి వెళుతుంది. మనలో ప్రతిభ ఉంది మీ అందరి సాయంతో, మేం ఐఎఫ్ ఎఫ్ ఐని కొత్త శిఖరాలకు తీసుకు వెడతాం" అని అన్నారు.ఐఎఫ్ ఎఫ్ ఐని గోవా తీరాలకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన దివంగత మనోహర్ పారికర్ ను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.

" చలన చిత్రోత్సవాలలో నటులు, దర్శకులు , నిర్మాతలకు మాత్రమే అవార్డులు ఇవ్వడం ఇంతకుముందు చూశాం. కానీ ఇప్పుడు మేము టెక్నీషియన్లను, ఒక సినిమా పూర్తి చేసే తెర వెనుక వ్యక్తులను కూడా గౌరవిస్తున్నాము" అని కూడా అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. భారత్ కు వచ్చి సినిమాలు తీయాలని ఆయన అంతర్జాతీయ చిత్ర నిర్మాతలకు పిలుపు ఇచ్చారు.

“మనకు ప్రతిభ, సాంకేతికత, నైపుణ్యం కలిగిన మానవ వనరులున్నాయి. భారత్ కు వచ్చి సినిమా తీసుకునే వేదికను మనం ప్రపంచానికి అందించవచ్చు, తెరవెనుక కీలకమైన పాత్ర పోషించే వ్యక్తులను గౌరవించడం చాలా ముఖ్యం" అని కేంద్ర మంత్రి అన్నారు.

 

ఈ సమావేశాన్ని ఉద్దేశించి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మాట్లాడుతూ, "నేను సినీ విమర్శకుడిని కాదు లేదా సినిమాలను అభిమానించే అంచరుడినీ కాదు. ఫిల్మ్స్ యొక్క తీవ్ర అనుచరుడిని కాదు, కానీ నేను ఎల్లప్పుడూ ఇండియన్ పనోరమాను చూస్తాను. మన సినిమాలు మన సమాజాన్ని ఎలా ప్రతిబింబిస్తాయో చూస్తాను. . భారతీయ సినిమాలు మన సమాజం యొక్క ఆకాంక్షలు, అవసరాలు , సమస్యలతో పోరాటాలను వాస్తవంగా ప్రతిబింబిస్తాయని నేను గర్వంగా చెప్పగను" అని అన్నారు.

 

ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించబడిన ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ ప్రారంభ చిత్రం సెంఖోర్, ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించబడుతున్న  మొట్టమొదటి దిమాసా భాషా చిత్రం. ఈ చిత్రానికి గౌరవం గుర్తింపు ఇచ్చినందుకు ఈ చిత్ర దర్శకుడు ఐమీ బారువా ఐఎఫ్ఎఫ్ఐ కి కృతజ్ఞతలు తెలిపారు. సెంఖోర్ చిత్రం సామాజిక ఆంక్షలను తెలియ చేస్తుందని, వ్యవహరిస్తుందని, ఈ చిత్రం ద్వారా అస్సాంలోని దిమాసా కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సమస్యలను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించానని ఆమె తెలిపారు.

 

నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ప్రారంభ చిత్రం వేద్- ది విజనరీ డైరెక్టర్ రాజీవ్ ప్రకాష్ మాట్లాడుతూ, ఇది సినిమా నిర్మాణ రంగంలో తన  తండ్రి నిలదొక్కుకున్న తీరు, ధైర్యానికి సంబంధించిన కధ అని,  సినిమా చరిత్రలో నిక్షిప్తమై ఉండే ఆయన ప్రయత్నాలను ఈ చిత్రం చూపిస్తుందని తెలిపారు.

 

ఈ సందర్భంగా ఫీచర్ మరియు నాన్ ఫీచర్ చిత్రాల జ్యూరీ సభ్యులను కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్లతో సత్కరించారు.

 

ఇండియన్ పనోరమా అనేది ఐఎఫ్ఎఫ్ఐ ప్రధాన (ఫ్లాగ్ షిప్ ) భాగం, దీని కింద సమకాలీన భారతీయ చిత్రాలలో ఉత్తమమైన వాటిని  చిత్ర కళ ప్రాచుర్యం కోసం ఎంపిక చేస్తారు. భారతీయ సినిమాలు ,భారతదేశ సుసంపన్న్స్ సంస్కృతి ,సినిమా కళను ప్రోత్సహించడానికి ఐఎఫ్ఎఫ్ఐ లో భాగంగా 1978 లో దీనిని ప్రవేశపెట్టారు.

 

ఇండియన్ పనోరమాలో ప్రారంభ చిత్రాల గురించి:

 

సెంఖోర్

 

సెంఖోర్ లో దిరో సంసా వర్గానికి చెందినవాడు. దిరో చనిపోయినప్పుడు, అసిస్టెంట్ మిడ్ వైఫ్ గా పనిచేసిన అతని భార్య వారి ముగ్గురు పిల్లలనూ  చూసుకుంటుంది. ఆమె తన ఏకైక కుమార్తె మురిని కేవలం పదకొండు సంవత్సరాల వయస్సులో దినార్ తో వివాహం చేస్తుంది. దురదృష్టవశాత్తు, మురి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చిన తరువాత మరణిస్తుంది.  సెంఖోర్ ఆచారం ప్రకారం, బిడ్డ పుట్టినప్పుడు ఒక మహిళ మరణిస్తే, శిశువు ను తల్లితో పాటు సజీవంగా ఖననం చేస్తారు. కానీ దిరో భార్య మురి శిశువును రక్షిస్తుంది, ఇది సెంఖోర్ లో కొత్త ఉదయాన్ని సూచిస్తుంది.

 

వేద్... ది విజనరీ

 

ఈ చిత్రం చిత్ర నిర్మాత వేద్ పర్కాష్ కథను ,1939-1975 సమయంలో న్యూస్ రీల్ చిత్రీకరణ ప్రపంచాన్ని జయించే అతని ప్రయాణాన్ని చెబుతుంది. 1949లో బ్రిటిష్ అకాడమీ అవార్డులకు నామినేట్ అయిన 1948 జనవరిలో మహాత్మా గాంధీ అంత్యక్రియల కు సంబంధించిన వార్తా కవరేజ్ ఆయన అసాధారణ రచనలలో చేర్చబడింది; భారతదేశం స్వతంత్రం పొందినప్పుడు అధికార మార్పు; భారతదేశ విభజన తరువాత జరిగిన విషాదం మొదలైనవి. భారతదేశ విజువల్స్ మరియు దాని గందరగోళ ఫార్మెటివ్ సంవత్సరాల్లో అధిక భాగం అతని కృషి,  సౌందర్యానికి బహుమతి.(Release ID: 1773824) Visitor Counter : 68