గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
స్వచ్ఛ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్రపతి చేతుల మీదుగా భారతదేశంలోని పరిశుభ్రమైన నగరాలకు సత్కారం
స్వచ్ఛ సర్వేక్షణ్ కింద ఇండోర్ వరుసగా ఐదవసారి ‘క్లీనెస్ట్ సిటీ’ టైటిల్‌ను గెలుచుకుంది
9 ఫైవ్ స్టార్ నగరాలు, 143 నగరాలు 3 నక్షత్రాల చెత్త రహిత నగరాలు
ఇండోర్, నవీ ముంబై మరియు నెల్లూరు సఫాయిమిత్ర సురక్షా ఛాలెంజ్‌లో అగ్రగామిగా నిలిచాయి
Posted On:
20 NOV 2021 2:54PM by PIB Hyderabad
దిల్లీలోని న్యూ విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్‌యుఏ) స్వచ్ఛ్ భారత్ మిషన్-అర్బన్ 2.0లో భాగంగా నిర్వహించిన 'స్వచ్ఛ్ అమృత్ మహోత్సవ్'లో భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఈరోజు భారతదేశంలోని పరిశుభ్రమైన నగరాల అవార్డు గ్రహీతలను సన్మానించారు. స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) యొక్క వివిధ కార్యక్రమాల కింద పట్టణాలు/నగరాలు, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత కోసం చేసిన కృషి గుర్తించేందుకు ఈ అవార్డు ప్రదానోత్సవం నిర్వహించబడింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021, సఫాయిమిత్ర సురక్షా ఛాలెంజ్ మరియు నగరాలకు గార్బేజ్ ఫ్రీ స్టార్ రేటింగ్ కోసం సర్టిఫికేషన్‌లు - వివిధ కేటగిరీల కింద 300 కంటే ఎక్కువ అవార్డులు ఈ రోజు నిర్వహించిన మొత్తం కార్యక్రమంలో అందించబడుతున్నాయి.
వరుసగా ఐదవ సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ కింద ఇండోర్ భారతదేశ క్లీనెస్ట్ సిటీ టైటిల్‌ను పొందగా, '1 లక్ష కంటే ఎక్కువ జనాభా' విభాగంలో సూరత్ మరియు విజయవాడ వరుసగా రెండవ మరియు మూడవ స్థానాలను కైవసం చేసుకున్నాయి. ‘లక్ష కంటే తక్కువ’ జనాభా విభాగంలో మహారాష్ట్రకు చెందిన వీటా, లోనావాలా, సాస్వాద్‌లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. వారణాసి 'ఉత్తమ గంగా పట్టణం'గా ఉద్భవించగా, అహ్మదాబాద్ కంటోన్మెంట్ 'ఇండియాస్ క్లీనెస్ట్ కంటోన్మెంట్' టైటిల్‌ను గెలుచుకుంది, మీరట్ కంటోన్మెంట్ మరియు ఢిల్లీ కంటోన్మెంట్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 'ఫాస్టెస్ట్ మూవర్' విభాగంలో, హోషంగాబాద్ (మధ్యప్రదేశ్) 2020 ర్యాంకింగ్స్‌లో 361వ స్థానం నుండి 274 ర్యాంక్‌లతో 87వ ర్యాంక్‌తో 'ఫాస్టెస్ట్ మూవర్ సిటీ'గా ('1 లక్ష కంటే ఎక్కువ జనాభా' విభాగంలో) ఉద్భవించింది. తద్వారా ఈ సంవత్సరం టాప్ 100 నగరాల్లో స్థానం సంపాదించింది.
రాష్ట్ర అవార్డులలో, "100 కంటే ఎక్కువ పట్టణ స్థానిక సంస్థల" విభాగంలో ఛత్తీస్‌గఢ్ వరుసగా మూడవ సంవత్సరం 'క్లీనెస్ట్ స్టేట్'గా ఉద్భవించగా, జార్ఖండ్ రెండవసారి "100 లోపు క్లీనెస్ట్ స్టేట్ అవార్డును గెలుచుకుంది. కర్ణాటక మరియు మిజోరాం వరుసగా పెద్ద (100 కంటే ఎక్కువ యుఎల్‌బిలు) మరియు చిన్న (100 యుఎల్‌బిల కంటే తక్కువ) రాష్ట్ర కేటగిరీలో ‘పాస్టెట్ మూవల్స్ స్టేట్స్’ అయ్యాయి.
ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ.. " ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని, ఎందుకంటే మనం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'ను జరుపుకుంటున్నామని" అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా సఫాయి మిత్రలు మరియు పారిశుధ్య కార్మికులు తమ సేవలను నిరంతరం అందించారని ఆయన పేర్కొన్నారు. అసురక్షిత క్లీనింగ్ పద్ధతుల వల్ల పారిశుధ్య కార్మికుడి ప్రాణం ప్రమాదంలో పడకుండా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. నగరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఘన వ్యర్థాల సమర్ధవంతమైన నిర్వహణ అవసరమని రాష్ట్రపతి అన్నారు. భారతదేశ సంప్రదాయ జీవన విధానంలో పర్యావరణ పరిరక్షణ అంతర్భాగమని ఆయన నొక్కి చెప్పారు. నేడు ప్రపంచం మొత్తం పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారిస్తోంది, దీనిలో వనరులను తగ్గించడం, పునర్వినియోగం చేయడం మరియు రీసైకిల్ చేయడంపై దృష్టి సారిస్తోంది. 'వేస్ట్ టు వెల్త్' ఆలోచన నుండి మంచి ఉదాహరణలు వస్తున్నాయని మరియు ఈ రంగాలలో చాలా స్టార్టప్‌లు చురుకుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ రంగాలలో వ్యవస్థాపకత మరియు పెట్టుబడులను ప్రోత్సహించడానికి తగిన పథకాలను అభివృద్ధి చేయవచ్చని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ "ఎస్‌బిఎం-యు ఆధ్వర్యంలో అపూర్వమైన సమిష్టి కృషి ఫలితమేనని అన్నారు. ఈ రోజు ఈ మిషన్ ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుందని - నిజమైన ‘జన్ ఆందోళన’గా మారించదని అని ఆయన అన్నారు. 2016లో 73 నగరాల్లో పైలట్‌గా ప్రారంభమైన స్వచ్ఛ సర్వేక్షణ్ యొక్క భారీ వృద్ధిలో కూడా ఇది ప్రతిబింబిస్తుంది మరియు ఇది నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ పరిశుభ్రత సర్వే. రాబోయే కొన్నేళ్లు సంపూర్ణ పరిశుభ్రత అంటే స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన భూమి మరియు స్వచ్ఛమైన నీటిపై దృష్టి సారిస్తామని ఆయన అన్నారు. పచ్చదనంతో కూడిన, సమ్మిళిత నగరాలను రూపొందించేందుకు మన భవిష్యత్ తరాలకు రుణపడి ఉంటామని మంత్రి అన్నారు. స్వచ్ఛ అమృత్ మహోత్సవ్ పేరుతో ఈ వేడుక ద్వారా అర్బన్ ఇండియా స్వచ్ఛతా ఛాంపియన్‌లను ఆయన అభినందించారు.
ఛత్తీస్‌గఢ్ మరియు సిక్కిం ముఖ్యమంత్రులు మరియు అండమాన్ & నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్‌తో సహా ప్రముఖుల సమక్షంలో శ్రీ హర్దీప్ సింగ్ పూరి మరియు గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ కూడా అవార్డు గ్రహీత నగరాలు మరియు రాష్ట్రాలను సత్కరించారు.
పలు సంవత్సరాలుగా, స్వచ్ఛ సర్వేక్షణ్ (ఎస్‌ఎస్) పట్టణాల్లో పరిస్థితిని మార్చడానికి సమర్థవంతమైన సాధనంగా ఉద్భవించింది. కోవిడ్-19 ద్వారా క్షేత్ర స్థాయిలో సవాళ్లు ఎదురైనప్పటికీ, 2,000 మందికి పైగా మదింపుదారుల బృందం 28 రోజుల రికార్డు సమయంలో 65,000 వార్డులను సందర్శించింది. ఈ ఏడాది సర్వేక్షణ్‌లో అత్యధికంగా మహారాష్ట్ర మొత్తం 92 అవార్డులను విజయవంతంగా కైవసం చేసుకుంది. 67 అవార్డులతో ఛత్తీస్‌గఢ్ రెండో స్థానంలో ఉంది. వీటితో పాటు ప్రేరక్ దౌర్ సమ్మాన్ కింద, స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 కింద ప్రవేశపెట్టబడిన కొత్త పనితీరు వర్గం, ఐదు నగరాలు - ఇండోర్, సూరత్, నవీ ముంబై, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ మరియు తిరుపతి 'దివ్య' (ప్లాటినం)గా వర్గీకరించబడ్డాయి. ఈ సంవత్సరం సర్వేక్షణ్, 4,320 నగరాలు పాల్గొంది. గత సంవత్సరం 1.87 కోట్లతో పోలిస్తే 5 కోట్లకు పైగా అపూర్వమైన సంఖ్యలో పౌరుల ఫీడ్‌బ్యాక్‌ను పొందింది. స్వచ్చ సర్వేక్షణ్-2021 భారతదేశంలోని పట్టణ ప్రాంతాల నుండి పారిశుద్ధ్యం మరియు వ్యర్థ పదార్థాల నిర్వహణలో 6,000కి పైగా ఆవిష్కరణలు మరియు ఉత్తమ అభ్యాసాలను గుర్తించడంలో సహాయపడింది.
కార్యక్రమానికి సంబంధించిన నేటి రెండవ సెషన్ స్వచ్ఛ్ భారత్ మిషన్-అర్బన్ ఫ్రంట్‌లైన్ సైనికులు సఫాయిమిత్రలకు అంకితం చేయబడింది. ప్రపంచ టాయిలెట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని (నవంబర్ 19) ఈ సెషన్‌లో మొట్టమొదటిసారిగా సఫాయిమిత్ర సురక్షా ఛాలెంజ్ కింద అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి గుర్తింపు లభించింది. మురుగు కాలువలు మరియు సెప్టిక్ ట్యాంకుల ప్రమాదకర క్లీనింగ్ నుండి మానవ మరణాలను నిర్మూలించడానికి ఎంఓహెచ్‌యుఏ గత సంవత్సరం ప్రారంభించిన సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్‌లో పాల్గొన్న 246 నగరాల్లో వివిధ జనాభా వర్గాలలో ఇండోర్, నవీ ముంబై, నెల్లూరు మరియు దేవాస్ టాప్ పెర్ఫార్మర్స్‌గా నిలిచాయి. రాష్ట్రాలలో, ఛత్తీస్‌గఢ్ మరియు చండీగఢ్ ఛాలెంజ్ కింద ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రం మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు అవార్డును కైవసం చేసుకున్నాయి. గత సంవత్సరంలో సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్ నేషనల్ సఫాయి కరంచారి ఫైనాన్షియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌కేఎఫ్‌డిసి ) ద్వారా బ్యాంకులతో సఫాయిమిత్రల క్రెడిట్ లింకేజీల వంటి కార్యక్రమాల ద్వారా పట్టణ భారతదేశంలో 'మ్యాన్‌హోల్ నుండి మెషిన్ హోల్' విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లగలిగింది. గ్రీన్ జాబ్స్ కోసం
సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ద్వారా ఉద్యోగ శిక్షణలు మరియు 190 నగరాల్లో పౌరుల ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 14420 ఏర్పాటు చేయబడింది.
చెత్త రహిత నగరాల స్టార్ రేటింగ్ ప్రోటోకాల్ కింద 3-స్టార్ మరియు 5-స్టార్ రేటింగ్ ఉన్న నగరాల ఫలితాలను ప్రకటించడం ద్వారా ఎస్‌బిఎం-యు 2.0 కింద చెత్త రహిత భారతదేశం యొక్క విజన్ మరింత ఊపందుకుంది. మొత్తం 9 నగరాలు - ఇండోర్, సూరత్, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, నవీ ముంబై, అంబికాపూర్, మైసూరు, నోయిడా, విజయవాడ మరియు పటాన్- 5 స్టార్ సిటీలుగా సర్టిఫికేట్ పొందగా, 143 నగరాలు 3 స్టార్‌గా సర్టిఫికేట్ పొందాయి. చెత్త రహిత నగరాల స్టార్ రేటింగ్ ప్రోటోకాల్ 2018లో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ పారామితులలో నగరాలను సమగ్రంగా అంచనా వేయడానికి ఎంఓహెచ్‌యుఏ స్మార్ట్ ఫ్రేమ్‌వర్క్‌గా ప్రవేశపెట్టింది. 2018లో కేవలం 56 నగరాలు మాత్రమే కొంత స్టార్ రేటింగ్‌లో సర్టిఫికేషన్ పొందాయి. ఈ సంవత్సరం, 2,238 నగరాలు అసెస్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో సంఖ్య చాలా రెట్లు పెరిగింది. కోవిడ్-19 ఆంక్షలు ఉన్నప్పటికీ మముత్ ఎక్సర్‌సైజ్ విజయవంతంగా పూర్తయింది. 3.5 కోట్ల డేటా పాయింట్‌లలో 1.4 కోట్ల ఫోటోగ్రాఫిక్ సాక్ష్యం సేకరించబడింది, దానితో పాటు 14.19 లక్షల పౌరుల ధ్రువీకరణ మరియు 1 లక్ష స్థానాలు అంచనా వ్యవధిలో కవర్ చేయబడ్డాయి.
భారత రాష్ట్రపతిచే ‘హర్ ధడ్కన్ స్వచ్ఛ్ భారత్ కి - రిఫిర్మింగ్ ఏ నేషన్‌స్ కమింట్‌మెంట్ టు స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0’ అనే పాటను విడుదల చేయడం ద్వారా వేడుకల స్ఫూర్తి మరింత పెరిగింది. ఈ పాట స్వచ్ఛతా ఉద్యమం యొక్క స్ఫూర్తిని పొందుపరిచింది మరియు స్వచ్ఛతా ప్రయాణంలో పౌరులందరికీ ముఖ్యంగా పిల్లలు, యువత మరియు సీనియర్ సిటిజన్ల నిబద్ధతకు ఒక వందనం. క్లీన్, గ్రీన్ మరియు ఆధునిక పట్టణ భారతదేశాన్ని వర్ణించే వీడియో, రాబోయే రోజుల్లో ఎస్‌బిఎం-యు 2.0 ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రజలను పునరుజ్జీవింపజేసే ప్రయత్నం. ఈ పాట లింక్: https://www.youtube.com/watch?v=CY_ejy6ifwE.
స్వచ్ఛ్ భారత్ మిషన్-అర్బన్ 2.0..1 అక్టోబర్, 2021న ప్రారంభించబడింది. అందరికీ పారిశుద్ధ్య సౌకర్యాలు పూర్తిగా అందుబాటులో ఉండేలా చూడటంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది. గత ఏడేళ్లలో ఎస్‌బిఎం-యు ప్రయాణంలో ఫలితాలను సాధించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించింది. ఈ డిజిటల్ ప్రయాణంలో ఒక పెద్ద ముందడుగు వేస్తూ మంత్రిత్వ శాఖ పునరుద్ధరించిన స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 వెబ్‌సైట్ మరియు ఇంటిగ్రేటెడ్ ఎంఐఎస్ పోర్టల్ ‘స్వచ్ఛతం’ను ప్రారంభించింది.
ఫ్యూచరిస్టిక్ మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ప్రాదేశిక జిఐఎస్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించబడింది. ఇది మిషన్‌ను స్మార్ట్, డేటా ఆధారిత నిర్ణయం తీసుకోవడం వైపు మరింత ముందుకు తీసుకువెళుతుంది. ఈ కొత్త డిజిటల్ ఎనేబుల్‌మెంట్‌లు మిషన్‌ను కాగితరహితంగా, పటిష్టంగా మరియు పారదర్శకంగా మార్చడానికి, స్వచ్ఛతా స్పెక్ట్రమ్‌లో రాష్ట్రాలు, నగరాలు మరియు వాటాదారులతో 24 గంటలపాటు కనెక్టివిటీని అందిస్తాయి.
స్వచ్ఛ్ అమృత్ మహోత్సవ్ స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ గత ఏడు సంవత్సరాలలో నగరాలు సాధించిన విజయాల ఉత్సవం మరియు స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 ద్వారా స్వచ్ఛత యొక్క తదుపరి దశలో కొత్త శక్తితో ముందుకు సాగడానికి నగరాలు మరియు పౌరుల నిబద్ధతను చాటుతుంది.
స్వచ్ఛ్ భారత్ మిషన్ –అర్బన్‌లో వివరణాత్మక ఫలితాలు, నివేదికలు మరియు రిలీజ్‌లు https://www.ss2021.in/#/home లో అందుబాటులో ఉన్నాయి
కార్యక్రమానికి సంబంధించిన వెబ్‌కాస్ట్ స్వచ్ఛ భారత్ అర్బన్ యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంది.
***
(Release ID: 1773568)
Visitor Counter : 259