సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు అందుకోనున్న హేమమాలిని, ప్రసూన్ జోషి


52వ ఐఎఫ్ఎఫ్ఐలో అవార్డుల ప్రధానం ... శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్

Posted On: 18 NOV 2021 4:14PM by PIB Hyderabad
ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డుకు   హేమమాలిని, ప్రసూన్ జోషిలను ఎంపిక చేసినట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటించారు. అవార్డు గ్రహీతల పేర్లను శ్రీ ఠాకూర్ వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ ఠాకూర్ ' ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డుకు ప్రముఖ  నటి,మధుర పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి హేమమాలిని, రచయిత, సీబీఎఫ్సీ అధ్యక్షుడు శ్రీ ప్రసూన్ జోషీలను ఎంపిక చేయడం జరిగింది. భారత చలన చిత్ర రంగానికి అనేక దశాబ్దాల పాటు వారు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందిస్తున్నాము. అనేక తరాలను వారు అలరించారు. భారత చలన చిత్ర రంగంలో దిగ్గజాలుగా ఉన్నారు. వారు వారి ప్రతిభా పాటవాలతో ప్రపంచ వ్యాప్త గుర్తింపు, గౌరవాన్ని పొందారు.   గోవాలో జరగనున్న 52వ భారత  అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో వారికి అవార్డులను అందించి గౌరవిస్తాము.' అని అన్నారు.
అవార్డు అందుకోనున్న ప్రముఖుల వివరాలు: 
శ్రీమతి హేమమాలిని, నటి, ఉత్తరప్రదేశ్ లోని మధుర పార్లమెంట్ సభ్యురాలు 
శ్రీమతి హేమమాలిని తమిళనాడులోని అమ్మకుండిలో 1948 అక్టోబర్ 16వ తేదీన జన్మించారు. శ్రీమతి హేమమాలిని నటిగా, రచయిత్రిగా,దర్శకురాలిగా, నిర్మాతగా, నర్తకిగా, రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందారు. తమిళ సినిమా ఇదుసతియం తో చలన చిత్ర రంగంలో ప్రవేశించారు. ఆ తరువాత ఆమె 1968లో సప్నోకాసౌదాగర్ ముఖ్య పాత్ర పోషించి  హిందీ చిత్ర రంగంలో ప్రవేశించారు. షోలే, సీతా అవుర్ గీత, సత్తెపేసట్టా మరియు బాగ్‌బాన్ వంటి 150కి పైగా చిత్రాల్లో ఆమె నటించారు.
'డ్రీం  గర్ల్ గా గుర్తింపు పొందిన శ్రీమతి హేమమాలిని అనేక అవార్డులను పొందారు. 2000లో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డును భారత ప్రభుత్వం ఆమెకు ప్రధానం చేసింది. భారత చలన చిత్ర రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా 2012లో సర్ పదంపట్ సింఘానియా విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ను అందించింది. జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ గా కూడా ఆమె వ్యవహరించారు. భరతనాట్యం నృత్యకారిణి అయిన శ్రీమతి హేమమాలినికి సోపోరి అకాడమీ ఆఫ్ మ్యూజిక్ & పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ 2006లో విశిష్ట అవార్డును ప్రధానం చేసి భారత సంస్కృతి నృత్య రంగాలకు ఆమె అందించిన సేవలను గౌరవించింది. 2003-2009 మధ్య శ్రీమతి హేమమాలిని రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించారు.  అప్పటి రాష్ట్రపతి ఆమెను రాజ్యసభకు నామినేట్ చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆమె మధుర నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె లోక్ సభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. 
శ్రీ ప్రసూన్ జోషి,  గీత రచయిత, సీబీఎఫ్సీ  చైర్ పర్సన్ 
కవిరచయితగీత రచయితస్క్రీన్ రైటర్ మరియు కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ గా శ్రీ ప్రసూన్ జోషి గుర్తింపు పొందారు. తన 17వ ఏట శ్రీ జోషి తన మొదటి గద్య మరియు కవిత్వ పుస్తకాన్ని ప్రచురించారు. ప్రస్తుతం మెకాన్ వరల్డ్ గ్రూప్ ఇండియా చైర్మన్ ఆసియా మరియు సీఈఓగా ఆయన వ్యవహరిస్తున్నారు. 
2001లో గేయ రచయితగా శ్రీ జోషి చలన చిత్ర రంగంలో ప్రవేశించారు.రాజ్‌కుమార్ సంతోషి సినిమా  లజ్జా కు తొలిసారిగా ఆయన పాటలు రాశారు. అనేక విజయవంతమైన బాలీవుడ్ చిత్రాలకు ఆయన రచయితగా పనిచేసి గుర్తింపు పొందారు. ఉత్తమ సాహిత్య కవిత్వ విలువలు కలిగిన రచనలతో ఆయన ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.  తారే జమీన్ పర్రంగ్ దే బసంతిభాగ్ మిల్కా భాగ్నీర్జా మరియు మణికర్ణికఢిల్లీ మరియు మరెన్నో చిత్రాల ద్వారా  తన రచనల ద్వారా జనాదరణ పొందిన రంగాల ద్వారా ప్రజల ఆలోచనా సరళిని మార్చి  సమాజానికి నిర్మాణాత్మక దిశానిర్దేశం చేయవచ్చునని ఆయన నిరూపించారు. 

శ్రీ జోషి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సముచిత గుర్తింపు పొందారు.  తారే జమీన్ పర్ (2007) మరియు చిట్టగాంగ్ (2013) చిత్రాలకు రెండు సార్లు ఉత్తమ సాహిత్యానికి జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నారు. 2015 సంవత్సరంలోకళలుసాహిత్యం  ప్రకటనల రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా  భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ అవార్డు  ప్రదానం చేసింది. ఐఐఎఫ్ఏ  ఫిల్మ్‌ఫేర్,  స్క్రీన్ వంటి ప్రముఖ చలనచిత్ర అవార్డులను అనేకసార్లు అందుకున్నారు. 2014లో కేన్స్ టైటానియం జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.  అంతర్జాతీయ కేన్స్ లయన్ టైటానియం అవార్డులకు అధ్యక్షత వహించిన మొదటి ఆసియా వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.  యువ గ్లోబల్ లీడర్‌గా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్  శ్రీ జోషిని గుర్తించి గౌరవించింది. . 

కామన్వెల్త్ గేమ్స్ 2010 ప్రారంభ, ముగింపు వేడుకల నిర్వహణ  కోసం ఎంపిక చేసిన ముగ్గురు సభ్యుల కోర్ క్రియేటివ్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా  శ్రీ జోషి పనిచేశారు.   52వ భారత అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న  '75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో గ్రాండ్ జ్యూరీ సభ్యునిగా  కూడా శ్రీ జోషి వ్యవహరిస్తున్నారు. 

***

 



(Release ID: 1773075) Visitor Counter : 209